Skip to content

‘రామాయణం’ సినిమా పై ప్రశంసలు కురిపించిన ఎస్ ఎస్ రాజమౌళి

‘రామాయణం’ థియేటర్లలోకి రావడంతో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. గ్రాండ్ స్టోరీటెల్లింగ్, నటీనటుల అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌లు, సాంకేతిక విలువలపై ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడం చిత్రానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.

భారతీయ సినిమాను తనదైన భారీ కథాకథనాలతో కొత్త స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి.. నితేశ్ తివారీ తెరకెక్కించిన ఈ ప్రతిష్ఠాత్మక ఎపిక్ చిత్రాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా సినిమా భారీ స్థాయి, బిగ్ స్క్రీన్‌పై విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఈ సినిమా అందించే గ్రాండ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను కొనియాడుతూ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

“‘రామాయణం’ సినిమా భారీ స్థాయి, బిగ్ స్క్రీన్‌పై దాని విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. రాముడిగా రణ్‌బీర్ కపూర్, ముఖ్యంగా వనవాసం నుంచి ఎంతో అద్భుతమైన ఔన్నత్యంతో కనిపించారు. రావణుడిగా యశ్ ప్రజెన్స్ అద్భుతంగా వుంది. సీతగా సాయి పల్లవి ఎంతో హుందాగా కనిపించారు. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ నాకు ఎంతగానో నచ్చాయి. సినిమాలోని ప్రతి అంశాన్ని ఆస్వాదించాను. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన విజన్‌ను అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన నమిత్ మల్హోత్రా, నితేశ్ తివారీతో పాటు మొత్తం చిత్ర బృందానికి అభినందనలు” అని రాజమౌళి తన పోస్టులో పేర్కొన్నారు.

ఇప్పటికే ప్రేక్షకుల నుంచి గొప్ప స్పందన అందుకుంటున్న ‘రామాయణం’ కు రాజమౌళి ప్రశంసలు మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.