యువ సామ్రాట్ నాగచైతన్య ప్రతిష్టాత్మక మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న థియేట్రికల్ రిలీజ్‌కు…
#బాలుగీత సినిమా డిసప్పాయింట్ చేయదు: నిర్మాత సుప్రియ యార్లగడ్డ

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన చిత్రం #బాలుగీత. సందీప్ సరోజ్, కేయురి, హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీకి ప్రతాప్ కొల్లారెడ్డి దర్శకత్వం వహించారు. ఆనంద్ రెడ్డి కర్నాటి, హరీష్ కోహిర్కర్ సహా నిర్మాతలు. నవంబర్ 5 నుంచి ఈ చిత్రం ETV Winలో ప్రీమియర్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్మీట్లో నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.చిన్న సినిమా అంటాం కానీ, చాలా పెద్ద కథ. ఈ కథ చెప్పినప్పుడు ఎలాగైనా సరే దీన్ని సినిమాగా తీయాలి అనిపించింది. అందరూ రిలేట్ అయ్యే కథ ఇది. చాలామంది జీవితాల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగి ఉంటాయి. ETV అనేది మంచి కంటెంట్ అందించే ప్లాట్‌ఫామ్. అన్నపూర్ణ నుంచి మేము ఈ కథ చెప్పగానే బాపినీడు గారు వెంటనే చేసేద్దాం అన్నారు. ఆయన ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చారు. చాలా యంగ్ టాలెంట్‌తో చేసిన సినిమా ఇది. తప్పకుండా మేము చాలా మంచి సినిమా తీశాం. సందీప్, కేయురి ‘బాలు’, ‘గీత’ పాత్రలకు సరైన న్యాయం చేశారు. ఆ పాత్రలకు ప్రాణం పోశారు.డైరెక్టర్ ప్రతాప్‌కు సినిమా అంటే చాలా ప్యాషన్. తను సొంత డబ్బులతో ఒక చిన్న సినిమా తీసుకుని నా దగ్గరికి వచ్చి చూపించాడు. అది నాకు చాలా నచ్చింది. తర్వాత అన్నపూర్ణతోనే చాలా రోజులు ట్రావెల్ అయ్యాడు. ఫైనల్‌గా ఈ కథ చెప్పాడు. అది మాకు చాలా నచ్చింది. పెద్ద బడ్జెట్ సినిమాలు, పెద్ద స్టార్ సినిమాలు మేము తీసినప్పుడు అవి ఇచ్చే సక్సెస్ ఒకలా ఉంటుంది. కానీ చిన్న కథలు, మనసుకు హత్తుకునే కథలు చేసినప్పుడు, కొత్తవాళ్లను పరిచయం చేసినప్పుడు వాటికి వచ్చే అభినందనలు వేరే సంతృప్తినిస్తాయి. అలాంటి మంచి సాటిస్ఫాక్షన్ ఈ సినిమా ఇచ్చింది. నవంబర్ 5న అందరూ ETV Winలో ఈ సినిమా చూడండి. ఈ సినిమాను మనసుపెట్టి తీశాము. ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు.
హీరో సందీప్ సరోజ్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన నిహారిక గారికి ధన్యవాదాలు. నన్ను పరిచయం చేసిన ప్రొడ్యూసర్ నిహారిక గారు. ఆమె సపోర్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా సుప్రియ గారితో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఇద్దరూ చాలా స్ట్రాంగ్ ప్రొడ్యూసర్స్. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్ ప్రతాప్ గారికి థాంక్యూ. ఇది మేము మరో అడుగు ముందుకు వెళ్లడానికి ఉపయోగపడే సినిమా అవుతుందని బలంగా నమ్ముతున్నాను. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వర్క్ చేయడం చాలా మెమరబుల్‌గా ఉంది. ETVతో పనిచేయడం కూడా చాలా ఆనందాన్నిచ్చింది. ETV Winలో రేపటి నుంచి ఈ సినిమా స్ట్రీమ్ కాబోతోంది. పెళ్లి తర్వాత మొదలయ్యే ప్రేమకథ ఇది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఈ సినిమా చూశాక ఒక తోడు ఉంటే బాగుంటుందని ఫీలింగ్ పక్కా కలుగుతుంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.
నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘కమిటీ కుర్రోళ్లు’లో నటించిన నటీనటులు వేరే ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు వాళ్ల ఈవెంట్స్‌కు రావడం నాకు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. నన్ను ఈవెంట్‌కు ఇన్వైట్ చేసిన సందీప్‌కు థాంక్యూ. ఈ ట్రైలర్ నేను చూశాను. చాలామందికి ట్రైలర్ గురించి చెప్పాను. ఈ ట్రైలర్ చూసినప్పుడు నాకు శేఖర్ కమ్ముల గారి సినిమా లాగా అనిపించింది. ఈ సినిమాలో భాగమైన అందరికీ పేరుపేరునా అభినందనలు. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది.
డైరెక్టర్ ప్రతాప్ కొల్లారెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ప్రేమకథలు చాలా ఉంటాయి. ఇది ఒక అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న జంట తాలూకు ప్రేమకథ. పెళ్లి తర్వాత వీళ్లిద్దరి మధ్య జరిగే ప్రేమకథ గురించి చూపించాం. కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. రిలేషన్షిప్లో ఉన్నవాళ్లు తప్పకుండా ఈ సినిమా చూడాలి. అందరూ రిలేట్ అయ్యే సినిమా ఇది.
ETV Win కంటెంట్ హెడ్ భరణ్ మాట్లాడుతూ.. ‘బాలు గీత’ చాలా బ్యూటిఫుల్ కథ. ఇందులో చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి. ప్రతాప్ ఒక అద్భుతమైన కంటెంట్‌తో వచ్చాడు. సందీప్‌తో పాటు నటీనటులందరూ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నవంబర్ 5న ETV Winలో ఈ సినిమా వస్తోంది. తప్పకుండా ఈ సినిమాను మీరందరూ చూడాలని కోరుకుంటున్నాను.
హీరోయిన్ కేయురి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అందరూ రిలేట్ అవుతారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమాను నవంబర్ 5న ETV Winలో చూడాలని కోరుతున్నాను,
సహ నిర్మాత హరీష్ మాట్లాడుతూ. అందరికీ నమస్కారం. ఈ కథ అందరి దగ్గర సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే అయింది. చాలా అద్భుతమైన టీమ్‌తో కలిసి సినిమా చేశాం. అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన అన్నపూర్ణ స్టూడియోస్‌కు, సుప్రియ మేడమ్‌కు ధన్యవాదాలు. ఇది తప్పకుండా అందరికీ రిలేట్ అయ్యే కథ. నవంబర్ 5న ETV Winలో మీరందరూ చూడండి. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.
తారాగణం:
సందీప్ సరోజ్, కేయురి, కృష్ణుడు, యశోరా, రిత్విక్, లోకేష్, ఎస్.ఎస్. కంచి, లహరి పరిచర్ల
సాంకేతిక బృందం:
ప్రొడ్యూసర్: సుప్రియ యార్లగడ్డ
రైటర్ & డైరెక్టర్: ప్రతాప్ కొల్లారెడ్డి
కో-ప్రొడ్యూసర్స్: ఆనంద్ రెడ్డి కర్నాటి, హరీష్ కోహిర్కర్
DOP: రెహాన్ షేక్
మ్యూజిక్ డైరెక్టర్: కల్యాణ్ నాయక్
ప్రొడక్షన్ డిజైనర్: శివకుమార్ మాచా
ఎడిటర్స్: నరేష్ అడుప, బొంతల నాగేశ్వర రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాహుల్ రావు

