Skip to content
అందుకే టాక్సిక్‌ చిత్రాన్ని మరోసారి వాయిదా వేశాం – యశ్‌ Telugu News

అందుకే టాక్సిక్‌ చిత్రాన్ని మరోసారి వాయిదా వేశాం – యశ్‌

కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ విడుదల తేదీని మళ్లీ మార్చినట్లు మేకర్స్ ఈరోజు ప్రకటించారు. జూన్ 4, 2026న విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం రిలీజ్ డేట్ మారనుంది. త్వరలోనే ఈ కొత్త డేట్‌ను ప్రకటించనున్నారు. సినిమాకాన్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించిన తర్వాత మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ప్రపంచవ్యాప్త డిస్ట్రిబ్యూటర్స్, పరిశ్రమ భాగస్వాముల నుండి ‘టాక్సిక్’కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ స్పందనను చూసిన మేకర్స్ ఈ చిత్రాన్ని మరింత విస్తృత అంతర్జాతీయ విడుదలకు అవకాశాలను కల్పించాలని, తమ ప్లానింగ్స్‌ను, రిలీజ్ డేట్‌లను పునఃసమీక్షించుకుంటున్నారు. ‘టాక్సిక్’ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకులందరికీ చేరేలా నిర్మాతలు ప్లానింగ్ చేస్తున్నారు…

Read more
గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ – యశ్ Telugu News

గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ – యశ్

లాస్ వెగాస్‌లో నిర్వహించిన సినిమాకాన్ 2026 కార్యక్రమంలో రాకింగ్ స్టార్ యశ్ సందడి చేశారు. ‘టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ గురించి వేదికపై యశ్ మాట్లాడిన మాటలు, చెప్పిన విషయాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ‘రామాయణ’ సహ నిర్మాత నమిత్ మల్హోత్ర, యశ్ ఇద్దరూ కలిసి ‘టాక్సిక్’ గురించి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. గ్యాంగ్ స్టర్ జానర్ చిత్రాలకు ఇకపై అడ్రస్‌గా, గైడ్‌గా ‘టాక్సిక్’ ఉంటుందని అభివర్ణించారు. అంతర్జాతీయ వేదికపై.. యశ్ మాట్లాడుతూ.. ‘మొదటిసారిగా ఇంగ్లీష్‌లో మేం సినిమాని చిత్రీకరించాం. ‘టాక్సిక్’లో ఎన్నో లేయర్స్‌ ఉంటాయి. ఇది రెగ్యులర్ యాక్షన్, గ్యాంగ్ స్టర్ చిత్రం కాదు. పైకి చూస్తుంటే.. ఇదొక యాక్షన్, గ్యాంగ్ స్టర్ మూవీలా మాత్రమే కనిపిస్తుంది…

Read more
‘టాక్సిక్’ కోసం హాలీవుడ్ టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జె.జె. పెర్రీ Telugu News

‘టాక్సిక్’ కోసం హాలీవుడ్ టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జె.జె. పెర్రీ

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘టాక్సిక్’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని హాలీవుడ్‌ స్థాయికి ధీటుగా తెరకెక్కిస్తున్నారు. అందుకే ‘టాక్సిక్’ టీం ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం ‘జాన్ విక్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’, ‘డే షిఫ్ట్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు వర్క్ చేసిన టాప్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌ను జె.జె. పెర్రీని రంగంలోకి దించారు. హాలీవుడ్ టీంతో ఇప్పటి వరకు ‘టాక్సిక్’లో అబ్బుర పరిచే యాక్షన్ సీక్వెన్స్‌లను జె.జె. పెర్రీ చిత్రీకరించారు…

Read more