‘రామాయణ’లో రావణుడిగా నటిస్తున్నానని చెప్పినప్పుడు…
‘నువ్వు విలన్ పాత్ర ఎందుకు చేస్తున్నావ్?’.. రావణుడి పాత్రపై తన కుమారుడి స్పందనను వెల్లడించిన యశ్! ‘రామాయణ’లో నాన్న రావణుడిగా నటిస్తున్నాడని నమ్మలేకపోయిన యశ్ కుమారుడు.. ‘అలా ఎలా చేస్తావ్?’ అంటూ ప్రశ్న! ‘నటుడిగా నన్ను చూసి చప్పట్లు కొట్టొచ్చు.. కానీ ఆ పాత్రనే ఆదర్శంగా భావించొద్దు’.. రావణుడి పాత్ర గురించి కుమారుడికి వివరించిన యశ్! రాకింగ్ స్టార్ యశ్ ‘రామాయణ’లో రావణుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్ఠాత్మక రెండు భాగాల ఇతిహాస చిత్రానికి మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ ద్వారా ఆయన సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కోసం సిద్ధమవుతున్న సమయంలో తనకు ఎదురైన ఓ ఆసక్తికరమైన అనుభవాన్ని యశ్ పంచుకున్నారు. తాను రాముడి పాత్రలో…
