Skip to content

యష్, తారా సుతారియా ‘టాక్సిక్’ నుంచి ‘మనసాగదే..’ రిలీజ్

రాకింగ్ స్టార్ యష్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ నుంచి విడుదలైన తొలి పాట ‘తబాహీ’ రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ తో చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అదే జోష్‌ను కొనసాగిస్తూ మేకర్స్ రెండో పాట ‘మనసాగదే’ (తెలుగు వెర్షన్)ను విడుదల చేశారు. మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్, జీ మ్యూజిక్ కంపెనీ కలిసి ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాయి.

‘తబాహీ’ ప్రేమలోని ఉప్పొంగే ఉద్వేగాలను చూపిస్తే, ‘మనసాగదే’ మాత్రం ప్రేమలోని మరో కొత్త కోణాన్ని ప్రజెంట్ చేసింది. మనసులో దాచుకున్న భావాలు, తీరని తపన, మౌనంగా మిగిలిపోయిన ప్రేమను ఈ పాట ఎంతో అందంగా పలికిస్తుంది. ప్రతి ప్రేమకథలో ఎన్నో భావోద్వేగాల పొరలు ఉంటాయని, ప్రతి దశ ప్రేమకు కొత్త అర్థాన్ని ఇస్తుందని ఈ పాట చెబుతోంది.

ఈ పాటలో యష్, తారా సుతారియా రాయా, రెబెకా పాత్రల మధ్య బంధాన్ని పూర్తిగా కొత్త కోణంలో చూపించారు. వీరిద్దరి మధ్య కనిపించే కెమిస్ట్రీ, ఎమోషన్స్ కట్టిపడేసింది. ‘తబాహీ’ లో కనిపించిన రాయా పాత్ర ఈసారి మనసులో నడుస్తున్న సంఘర్షణను కూడా సూచిస్తుంది.

తనిష్క్ బాగ్చి, అర్స్లాన్ నిజామీ, ఫహీమ్ అబ్దుల్లా స్వరపరిచిన ఈ రొమాంటిక్ మెలోడీకి సిద్ధార్థ్ బస్రూర్ తన వోకల్స్ టప్ ప్రాణం పోశారు. ఐదు భాషల్లో విడుదలైన ఈ పాట తెలుగు వెర్షన్‌కు ‘మనసాగదే’ టైటిల్‌ తో రిలీజ్ చేశారు.

తెలుగు సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి అందించారు. హిందీలో ‘మధోష్’, కన్నడలో ‘మనమోహక’, తమిళంలో ‘తడుమారుధేయ్’, మలయాళంలో ‘మధుమోహిని’ పేర్లతో ఈ పాట విడుదలైంది.

ఈ చిత్రంలో యష్, నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ పాట గురించి సంగీత దర్శకుడు తనిష్క్ బాగ్చి మాట్లాడుతూ, “‘మధోష్” మా ముగ్గురికీ ఎంతో ప్రత్యేకమైన పాట. అర్స్లాన్, ఫహీమ్, నేను మరోసారి కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ‘టాక్సిక్’లాంటి భారీ చిత్రానికి సంగీతం అందించడం మరింత సంతోషంగా అనిపించింది. సిద్ధార్థ్ బస్రూర్ ఈ పాటకు తన గాత్రంతో అద్భుతమైన భావోద్వేగాన్ని తీసుకొచ్చారు. రాయా, రెబెకా పాత్రల ప్రేమ, తపన, రొమాన్స్‌లోని అందమైన భావాలను ఈ పాట అందంగా చూపించింది. ప్రేక్షకులు ఇందులో భావోద్వేగాలకు కనెక్ట్ అవుతారని ఆశిస్తున్నాం” అన్నారు.

ప్లేబ్యాక్ సింగర్ సిద్ధార్థ్ బస్రూర్ మాట్లాడుతూ.. “‘మధోష్’ ఇద్దరి మధ్య చెప్పలేకపోయిన భావాల గురించి చెప్పే పాట. ఇందులో ప్రేమ, తపన అన్నీ కలిసి ఉంటాయి. ఆ నిజాయితీ నా వాయిస్ లో వినిపించాలని ప్రయత్నించాను. పాటలో భావోద్వేగాలతో పాటు క్రమంగా పెరిగే ఇంటన్సిటీ వుంటుంది. అదే ఈ పాటను నాకు మరింత ప్రత్యేకంగా మార్చింది”

యష్, గీతు మోహన్‌దాస్ కలిసి కథను అందించగా, గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళంతో పాటు పలు భాషల్లో డబ్ వెర్షన్లు విడుదల కానున్నాయి. ఈ చిత్రం 2026 ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.