నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన…
“సమ్మర్ హాలిడేస్” సినిమా ఫ్యామిలీతో కలిసి చూడండి – హీరో శ్రీవిష్ణు
- నవంబర్ 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “సమ్మర్ హాలిడేస్”
కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై “సమ్మర్ హాలిడేస్” అనే చిల్డ్రన్ మూవీని నిర్మిస్తున్నారు. “సమ్మర్ హాలిడేస్” సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 6న “సమ్మర్ హాలిడేస్” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ హీరో శ్రీవిష్ణు అతిథిగా ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
రైటర్ కొండల్ రావు మాట్లాడుతూ – కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ శ్రీ విష్ణు మా సినిమా ట్రైలర్ లాంఛ్ చేయడం హ్యాపీగా ఉంది. మా సినిమాను చిన్న పిల్లల సినిమా అంటున్నారు. నోల్టాల్జిక్ మూవీ అంటున్నారు. నేను మాత్రం ఇది ప్యూర్ ఎమోషన్స్ చూపించే సినిమా అని చెప్పగలను. అన్నారు.
నటి వాసుకి మాట్లాడుతూ – ఈ సినిమాలో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నా. నేను బాగా ఇష్టపడిన స్క్రిప్ట్ ఇది. ఇలాంటి పిల్లల సినిమాలు చూసే అవకాశం మనకు తరుచూ రాదు. ఈ సినిమాలో స్వచ్ఛమైన ఎమోషన్స్ చూస్తాం. ఈ కథను అంతే ప్యూర్ గా డైరెక్టర్ శ్రీకర్ తెరకెక్కించారు. ప్రస్తుత ట్రెండ్ లో ఇలాంటి సినిమాలు నేను చూడలేదు. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి మాట్లాడుతూ – “సమ్మర్ హాలిడేస్” సినిమాకు మ్యూజిక్ కు సంబంధించిన వర్క్స్ ఫినిష్ చేస్తున్నాను. మూవీ చాలా బాగా వచ్చింది. లీడ్ యాక్టర్స్ అంతా సూపర్బ్ గా పర్ ఫార్మ్ చేశారు. శ్రీ విష్ణు గారు మా లిటిల్ హార్ట్స్ సినిమా ఈవెంట్ కు వచ్చారు మంచి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు “సమ్మర్ హాలిడేస్” సినిమా ఈవెంట్ కు కూడా వచ్చారు. ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నా. అన్నారు.
బేబి ఖుషి మాట్లాడుతూ – మా మూవీ ట్రైలర్ మీకు నచ్చిందని నమ్ముతున్నాను. ట్రైలర్ లో ఉన్న ఫ్రెండ్షిప్, ఎమోషన్స్, ఫన్నీ వంటి ఎలిమెంట్స్ అన్నీ ఆకట్టుకున్నాయి. మేము ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశామో, థియేటర్స్ లో చూస్తూ మీరూ అలాగే ఫీల్ అవుతారు. ఈ బ్యూటిఫుల్ మూవీలో నటించే అవకాశం కల్పించిన మా డైరెక్టర్ శ్రీకర్, మా ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి థ్యాంక్స్. అన్నారు.
మాస్టర్ అరుణ్ మాట్లాడుతూ – “సమ్మర్ హాలిడేస్” సినిమా చూస్తున్నప్పుడు మీరు కూడా ఆ కథలోని ఒక ఫ్యామిలీ మెంబర్ అనే అనుభూతికి లోనవుతారు. నా క్యారెక్టర్ తో మీరు బాగా కనెక్ట్ అవుతారు. ఈ పాత్రకు న్యాయం చేసేందుకు పూర్తి ప్రయత్నం చేశాను. ఆ క్యారెక్టర్ ఎలా ఉందో మీరు చూసి చెప్పాలి. ఈ మధ్య పిల్లలు అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లడం తగ్గిపోయి, వెకేషన్స్, టూర్స్ కు వెళ్తున్నారు. కానీ మా సినిమా చూశాక అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లి ఆ వాతావరణంలో ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. అన్నారు.
మాస్టర్ రోహన్ రాయ్ మాట్లాడుతూ – ప్రీ వెడ్డింగ్ షో కంప్లీట్ అయ్యాక నాకు వచ్చిన అవకాశం ఇది. ఆఫర్ వచ్చినప్పుడు ఈ మూవీలో ఏదో ఒక క్యారెక్టర్ ఇస్తారని అనుకున్నా. కానీ లీడ్ రోల్ చేసే అవకాశం వస్తుందని అనుకోలేదు. మా మూవీ ప్రొడ్యూసర్ ధీరజ్ ఎంతో ప్యాషన్ తో ఈ సినిమాను నిర్మించారు. అనుభవం గల, ఎంతోమంది మంచి నటీనటులతో కలిసి ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. మా మూవీలోని ప్రతి క్యారెక్టర్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.
డైరెక్టర్ శ్రీకర్ మాట్లాడుతూ – మా మూవీ ట్రైలర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ట్రైలర్ చూసినప్పుడు మీకు కలిగిన అనుభూతే సినిమా చూస్తున్నప్పుడు కూడా కలుగుతుంది. మా ప్రొడ్యూసర్ ధీరజ్ గారి ప్యాషన్ వల్లే మా సినిమా ఇక్కడిదాకా వచ్చింది. ఆయన ఈ స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. మా మూవీ నుంచి రిలీజ్ చేసిన 3 పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మా చిల్డ్రన్ తో పాటు జయసుధ గారు, వాసుకి, హర్షవర్థన్..ఇలా ప్రతి యాక్టర్ ఎంతో ఇన్వాల్వ్ అయి పర్ ఫార్మ్ చేశారు. ఇడియట్ లో రవితేజలా మా సినిమాలో రోహన్ ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు. అరుణ్ సూపర్బ్ గా నటించాడు. థియేటర్స్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడి గుండెను తాకేలా మా సినిమా ఉంటుంది. మరికొన్నేళ్ల పాటు మా సినిమా గురించి మాట్లాడుకుంటారు. ఎక్కడా బోర్ ఫీల్ కాకుండా ప్రతి సీన్ ఎంజాయ్ చేసే చిత్రమిది. అన్నారు.
ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – “సమ్మర్ హాలిడేస్” కథ విన్నప్పటి నుంచి ఈ మూవీని క్వాలిటీగా చేయాలని అనుకున్నాం. అమ్మమ్మ పాత్రలో జయసుధ గారు ఒదిగిపోయారు. వాసుకి గారి క్యారెక్టర్ చూస్తుంటే మా మదర్ గుర్తుకువచ్చారు. హర్షవర్థన్, రాజీవ్ కనకాల, హర్షిణి..ఇలా ప్రతి ఆర్టిస్ట్ తమ నటనతో మా సినిమాకు మరింత వ్యాల్యూ తీసుకొచ్చారు. చిన్నపిల్లల సినిమా ఎందుకు చేస్తున్నావని, థియేటర్స్ కు జనం వస్తారా అని మిత్రులు అంటున్నారు. ఇలాంటి సినిమా హిట్ అయితే వందమంది శ్రీకర్ లు ఇండస్ట్రీకి వస్తారు. ఇలాంటి కథలు ఇంకా ఉన్నాయి కానీ ఎవరూ చేసేందుకు ముందుకురావడం లేదు. ఇలాంటి సినిమా ఇతర భాషల్లో వస్తే చూసి ఎంజాయ్ చేస్తున్నాం. మా సినిమా సక్సెస్ అవుతుందనే సూపర్ కాన్ఫిడెన్స్ తో మేమంతా ఉన్నాం. దీని తర్వాత ఇలాంటి సినిమాలు నెలకొకటి చొప్పున రిలీజ్ అవుతాయి. మీరంతా ఫ్యామిలీస్ తో కలిసి థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారు. ఇది పిల్లలు నటించిన పెద్దల సినిమా. మా సినిమాను పిల్లల కంటే అనేక రెట్లు పెద్దలు ఎంజాయ్ చేస్తారు. “సమ్మర్ హాలిడేస్” ఏమాత్రం బోర్ కొట్టదు, నిర్మాతగా ఇది నా ప్రామిస్. వెంకటేష్ సంక్రాంతి మూవీ సంక్రాంతికి రాలేదు, నాని దసరా సినిమా దసరాకు రాలేదు, తమిళంలో దీపావళి అనే సినిమా ఉంది అది దీపావళికి రిలీజ్ కాలేదు. ఎస్వీ కృష్ణారెడ్డి గారు ఉగాది సినిమా ఉగాదికి రాలేదు. అలాగే మా “సమ్మర్ హాలిడేస్” కూడా సమ్మర్ కు రాలేదు. కానీ ఆ చిత్రాల్లా మా సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుంది. అన్నారు.
కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ – “సమ్మర్ హాలిడేస్” సినిమా ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు నేను చిన్నప్పుడు సెలవుల్లో ఊరెళ్లిన మెమొరీస్ గుర్తుకువచ్చాయి. ఈ సినిమాను నేను తప్పకుండా చూస్తాను. ఈ దీపావళి పండక్కి నవంబర్ 6న మీరంతా ఫ్యామిలీతో కలిసి “సమ్మర్ హాలిడేస్” సినిమాను థియేటర్స్ లో చూడాలని కోరుతున్నా. పిల్లలంతా బాగా నటించారు. ఈ యంగ్ టీమ్ ను మీరంతా బ్లెస్ చేయండి. రోహన్ నాతో కలిసి నటించాడు. సినిమా మీద బాగా ఇష్టం ఉన్న యాక్టర్ తను. అలాగే అరుణ్ ను చూస్తుంటే నేషనల్ అవార్డ్ ను చాలా దగ్గరగా చూస్తున్నట్లు ఉంది. ఖుషి బాగా పర్ ఫార్మ్ చేసింది. సమ్మర్ వస్తే అమ్మమ్మ, తాతయ్య ఊరికి వెళ్లడం అనేది మనం మర్చిపోయాం. కానీ ఈ సినిమా చూస్తే ఒకప్పుడు మనం సమ్మర్ ఎలా ఉండేది అని గుర్తుచేసుకుంటారు. వాసుకి గారిని చూస్తుంటే తొలి ప్రేమ సినిమానే గుర్తుకొస్తుంది. నవంబర్ 6న ఈ చిన్న పిల్లల సినిమాను పెద్ద మనసుతో పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ చేసే ధైర్యం ధీరజ్ గారిలో ఉంది. అన్నారు.
నటీనటులు – రోహన్ రాయ్, అరుణ్, ఖుషి, జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్థన్, తదితరులు
టెక్నికల్ టీమ్
——————–
డీవోపీ – సాయి ప్రకాశ్
మ్యూజిక్ డైరెక్టర్ – సింజిత్ యెర్రమల్లి
బ్యానర్ – ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)
ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని
స్టోరీ, డైరెక్టర్ – శ్రీకర్

