Skip to content

సెప్టెంబర్ 3 న “డెలులు” సినిమా టీజర్

క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కొత్త చిత్రం “డెలులు”. యూత్‌లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న “డెలులు” అనే పదాన్ని టైటిల్‌గా పెట్టడంతో సినిమాపై ఆసక్తి మొదలైంది. తాజాగా నిర్వహించిన స్టూడెంట్ ఈవెంట్‌లో చిత్ర బృందం గ్రాండ్‌గా టైటిల్‌ను ప్రకటించింది. సంకీర్త్ కొండ నిర్మాతగా, ప్రీతం కస్తూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విజయ్ రాజ్‌కుమార్ కథ, అదనపు సంభాషణలు అందించగా, రెష్మిత్ ఎస్ కౌశిక స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాశారు.

ఈ చిత్రానికి జై రాజ్ నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హరికృష్ణ కురపాటి ఎడిటర్‌గా, ఆది చెబ్రోలు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ రాజ్‌కుమార్, వేణి రావు, అఖిల్ జాక్సన్, సాయి ప్రసన్న, శ్రీ రామ మండవ, అభినయ్ తుల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రస్తుతం Gen-Zలో “డెలులు” అనే పదం బాగా పాపులర్‌గా మారింది. “డెలూషనల్”కు షార్ట్ ఫామ్‌గా ఉపయోగించే ఈ పదం కలలు, ప్రేమ, ఊహలు, ఆశలు, రియాలిటీకి మధ్య ఉన్న ఆసక్తికరమైన ప్రపంచాన్ని సూచిస్తుంది. అలాంటి ట్రెండింగ్ పదాన్ని టైటిల్‌గా ఎంచుకోవడం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. యూత్‌కు కనెక్ట్ అయ్యే కథ, కొత్త తరహా ట్రీట్‌మెంట్‌తో “డెలులు” ఒక ఫ్రెష్ అండ్ ఎంటర్‌టైనింగ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 3న టీజర్ విడుదల కానుంది.

తారాగణం – విజయ్ రాజ్‌కుమార్, వేణి రావు, అఖిల్ జాక్సన్, సాయి ప్రసన్న, శ్రీరామ మండవ, అభినయ్ తుల తదితరులు

బ్యానర్ – క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్
నిర్మాత – సంకీర్త్ కొండా
దర్శకుడు – ప్రీతమ్ కస్తూరి
కథ & అదనపు సంభాషణలు – విజయ్ రాజ్‌కుమార్
స్క్రీన్ ప్లే & డైలాగ్స్ – రేష్మిత్ ఎస్ కౌషిక
DOP – జై రాజ్ నాయుడు
ఎడిటర్ – హరికృష్ణ కూరపాటి
సంగీతం – ఆది చేబ్రోలు
సాహిత్యం – సుభాష్ సాకే
రంగులు – టి లావణ్య రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అభినయ్ కొండ
లైన్ ప్రొడ్యూసర్ – రుత్విక్ చిలకమర్తి
ప్రొడక్షన్ కంట్రోలర్ – చందు యనమల్ల
ఆర్ట్ డైరెక్టర్ – కంట్లం అనంతుల
అసోసియేట్ డైరెక్టర్ – క్రాంతి కంచర్ల
సహాయ దర్శకులు – నారాయణ గెరిగెడ్డ, విక్కీ ఛత్రాయిల, ఇకం సురేంద్ర కుమార్
మేకప్ – సింధు దిలీషా గుత్తుల
డబ్బింగ్ స్టూడియో – శబ్దం స్టూడియోస్
సౌండ్ ఇంజనీర్ – జీవన్ కుమార్
మార్కెటింగ్ – స్టార్ సర్కిల్
PRO – మధు VR

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.