సెప్టెంబర్ 3 న “డెలులు” సినిమా టీజర్
క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కొత్త చిత్రం “డెలులు”. యూత్‌లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న “డెలులు” అనే పదాన్ని టైటిల్‌గా పెట్టడంతో సినిమాపై ఆసక్తి మొదలైంది. తాజాగా నిర్వహించిన స్టూడెంట్ ఈవెంట్‌లో చిత్ర బృందం గ్రాండ్‌గా టైటిల్‌ను ప్రకటించింది. సంకీర్త్ కొండ నిర్మాతగా, ప్రీతం కస్తూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విజయ్ రాజ్‌కుమార్ కథ, అదనపు సంభాషణలు అందించగా, రెష్మిత్ ఎస్ కౌశిక స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాశారు. ఈ చిత్రానికి జై రాజ్ నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హరికృష్ణ కురపాటి ఎడిటర్‌గా, ఆది చెబ్రోలు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ రాజ్‌కుమార్, వేణి రావు, అఖిల్ జాక్సన్, సాయి ప్రసన్న, శ్రీ రామ మండవ, అభినయ్ తుల ప్రధాన…
