రోషన్ మేక హీరోగా నూతన చిత్రం ఆరంభం
టాలీవుడ్లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న అశోక క్రియేషన్స్ మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రం సంస్థకు ప్రొడక్షన్ నెం.3. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి, యంగ్ సెన్సేషన్ రోషన్ మేక ఈ ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. విభిన్నమైన కథలు, సరికొత్త కథనాలతో సినిమాలు తెరకెక్కించే మోహనకృష్ణ ఇంద్రగంటి.. ఈ చిత్రంలో రోషన్‌ను సరికొత్త కోణంలో చూపించనున్నారు. తన స్క్రీన్ ప్రెజెన్స్,ఆకట్టుకునే నటనతో ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్న రోషన్.. ఈ భారీ చిత్రంతో మరో కొత్త అవతార్‌లో ప్రేక్షకులను అలరించనున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం నేడు…
