Skip to content

‘అనుమాన పక్షి’ కామెడీ, మిస్టరీ, థ్రిల్‌ను ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు: హీరో రాగ్ మయూర్

‘డీజే టిల్లు’తో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన విమల్ కృష్ణ.. మరో క్విర్కీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అనుమాన పక్షి’. రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా.. హ్యూమర్, క్యారెక్టర్స్, కథనంలో పూర్తిగా డిఫరెంట్ గా ఉండబోతోంది. చిలక ప్రొడక్షన్స్ సమర్పణలో రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 25న ‘అనుమాన పక్షి’ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా రాగ్ మయూర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. డైరెక్టర్ విమల్ కృష్ణ ‘డీజే టిల్లు’ ప్రభావం పడకుండా ఇందులో ఎలాంటి కేర్ తీసుకున్నారు? -విమల్…

Read more

‘ఇరుముడి’ రూ.250 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ.. నెట్‌ఫ్లిక్స్‌లో దేశవ్యాప్తంగా నంబర్ 1 ట్రెండింగ్

మాస్ మహారాజా రవితేజ, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ, ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర జనరేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఫలితాలను అందుకోవడంతో పాటు..ఇప్పటివరకు చూడని స్థాయిలో లాభాలను అందించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ సాధించి.. రవితేజ కెరీర్‌లో తొలిసారి ఎలైట్ రూ.250 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చిత్రంగా నిలిచింది. అలాగే రీజినల్ సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ ప్రపంచంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైనప్పటి నుంచి నంబర్ 1 స్థానంలో ట్రెండ్…

Read more

‘గరివిడి లక్ష్మి’ అక్టోబర్ 17న రిలీజ్

భారీ స్థాయి సినిమాలతో అలరించే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి కథని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తుంది. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది మెరుస్తోంది. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. బుర్రకథలు చెప్పడమే కాదు, ఓ ఉద్యమంగా మార్చిన లక్ష్మి జీవితాన్ని ఈ సినిమా ఆవిష్కరించనుంది. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ‘గరివిడి లక్ష్మి’ ఓ పాటతో వేలాది హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ జానపద గాయని జీవితాన్ని రిక్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అక్టోబర్ 17న సినిమా…

Read more

అజిత్ కుమార్ ‘గ్లాడియేటర్స్ – ఇన్ పర్స్యూట్ ఆఫ్ ఛాలెంజెస్’ ట్రైలర్ విడుదల

ప్యాషన్, పట్టుదల, సవాళ్లను నిరంతరం ఎదుర్కొనే తపనతో సాగిన నటుడు, రేసింగ్ డ్రైవర్ అజిత్ కుమార్ అసాధారణ మోటార్‌స్పోర్ట్స్ జర్నీని ఆవిష్కరించే డాక్యుమెంటరీ ‘గ్లాడియేటర్స్ – ఇన్ పర్స్యూట్ ఆఫ్ ఛాలెంజెస్’ ట్రైలర్ విడుదలైంది. రేసర్ వెనుక ఉన్న అజిత్ కుమార్‌ను మరింత దగ్గరగా పరిచయం చేస్తూ ఈ ట్రైలర్ సాగుతుంది. ఇప్పటివరకు లేని విధంగా ‘గ్లాడియేటర్స్’ ట్రైలర్‌ను తొలిసారిగా నేరుగా థియేటర్లలో విడుదల చేశారు. డిజిటల్ రిలీజ్‌కు ముందే బిగ్ స్క్రీన్‌పై ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే మేకర్స్ నిర్ణయానికి థియేటర్లలో భారీ స్పందన లభించింది. తమ అభిమాన స్టార్‌ను స్క్రీన్‌పై చూసిన ప్రతిసారీ అభిమానులు సందడి చేశారు. అజిత్ కుమార్ అభిమానుల సందడి థియేటర్లలో మార్మోగింది. సినిమాల్లో ఎప్పుడూ చూసే…

Read more

‘జనవరి 12 విడుదల’ నుంచి దీపుగా కృతి శెట్టి ట్రెడిషనల్ ఫస్ట్ లుక్‌ రిలీజ్

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మోస్ట్ అవైటెడ్ ఫెస్టివ్ ఎంటర్‌టైనర్ ‘జనవరి 12 విడుదల’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి ఆర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ ఆసక్తిని పెంచుతోంది. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్ర టైటిల్‌ను మేకర్స్ ఇటీవల హిలేరియస్, ఎంటర్‌టైనింగ్ వీడియో ద్వారా ప్రకటించారు. దీంతో సినిమాపై బజ్ మరింత పెరిగింది. ఇప్పటికే వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్స్‌ను పరిచయం చేసిన మేకర్స్.. తాజాగా హీరోయిన్ కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమెను ‘దీపు’…

Read more

‘హాఫ్’కు TIFFలో అరుదైన ఘనత.. మిడ్‌నైట్ మ్యాడ్‌నెస్‌లో ప్రదర్శితమైన తొలి మలయాళ చిత్రంగా రికార్డ్

టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ (TIFF)లోని ప్రతిష్ఠాత్మక మిడ్‌నైట్ మ్యాడ్‌నెస్ విభాగంలోకి మలయాళ సినిమా ఘనంగా అడుగుపెట్టింది. సమ్జాద్ పి.ఎస్. దర్శకత్వం వహించిన ‘హాఫ్’ (HALF) ఈ విభాగంలో ప్రదర్శితమైన తొలి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. చిత్ర ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. సినిమా పూర్తైన తర్వాత జరిగిన Q&A సెషన్‌లోనూ థియేటర్‌లో అదే ఉత్సాహం కొనసాగింది. ఫ్రాగ్రంట్ నేచర్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఆన్ సజీవ్, పి.కె. సజీవ్ నిర్మించిన ‘హాఫ్’.. రా, డిస్టింక్టివ్, ఇమ్మర్సివ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌తో అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా ప్రదర్శన సమయంలో పలు సందర్భాల్లో థియేటర్ మొత్తం చప్పట్లతో మార్మోగింది. చిత్రంలోని ఇంటెన్స్ వరల్డ్, డిఫరెంట్ ప్రజెంటేషన్ ప్రేక్షకులపై బలమైన ముద్ర…

Read more

‘మైసా’ కోసం నా లైఫ్ నీ ఇచేసా. మీకు కచ్చితంగా నచ్చుతుంది. – రష్మిక మందన్న

రష్మిక మందన్న, రవీంద్ర పుల్లె, అన్‌ఫార్ములా ఫిల్మ్స్ పాన్ ఇండియా మూవీ 'మైసా' గూస్‌బంప్స్ ఇంటెన్స్ టీజర్ లాంచ్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్‌లో ప్రతిష్టాత్మక పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'మైసా'లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో గోండ్ గిరిజన మహిళ పాత్ర పోషిస్తున్న రష్మిక , ఆ పాత్రలో ఒదిగిపొవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న'మైసా' ఆకట్టుకునే ఫస్ట్ గ్లింప్స్‌తో ఇప్పటికే ఆసక్తిని రేకెత్తించింది. నవంబర్ 27, 2026న ‘మైసా’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. తాజాగా మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు. “అలసిపోయాను.. ఆగిపోయాను.. ఓడిపోయాను” అంటూ రష్మిక చెప్పే డైలాగ్‌తో ఆమె పాత్రలోని ఇంటెన్సిటీని పరిచయం చేశారు. భయపడని, వెనక్కి…

Read more

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కాకా’- కదిరి కాళిదాసుగా తన పాత్ర పేరును లీక్ చేసిన మెగాస్టార్

బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి మరోసారి కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుతోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచే అప్‌డేట్ వచ్చింది. ఓ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన క్యారెక్టర్ పేరును రివీల్ చేశారు. ‘కాకా’లో చిరంజీవి ‘కదిరి కాళిదాస్’గా కనిపించబోతున్నారు. ఈ పవర్‌ఫుల్ పేరు వినగానే సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి మరింత పెరుగుతోంది. ‘కాకా’ హై-ఇంటెన్సిటీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ…

Read more

జడల్ లాంటి క్యారెక్టర్ ఇప్పటి వరకు తెలుగు సినిమాలో రాలేదు. నా కెరియర్ లోనే ఎక్కువ హాట్ చేసిన సినిమా ది ప్యారడైజ్ – నాచురల్ స్టార్ నాని

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా న్యాచురల్ స్టార్ నాని విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. సెప్టెంబర్ మీకు బాగా కలిసి వచ్చింది కదా? -నా కెరీర్ స్టార్ట్ అయిందే సెప్టెంబర్ లో. ‘అష్టా చమ్మా’ సెప్టెంబర్‌లోనే రిలీజ్ అయింది. ‘భలే భలే మగాడివోయ్’ కూడా సెప్టెంబర్‌లోనే వచ్చింది. ఇప్పుడు ఆ హిట్ సెంటిమెంట్ ‘ప్యారడైజ్’కి వర్క్ అవుట్…

Read more

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి లాంచ్ చేసిన ‘సిగ్మా’ హీస్ట్ అడ్వెంచర్‌ ట్రైలర్

సందీప్ కిషన్ యాక్షన్-అడ్వెంచర్, హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘సిగ్మా’ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాతో జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రతిష్టాత్మక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రంపై ప్రమోషనల్ కంటెంట్‌తో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాకు సంబంధించిన డిఫరెంట్ వరల్డ్‌ను, యాక్షన్‌ టచ్‌ను పరిచయం చేశాయి. కోస్తాంధ్ర, తెలంగాణలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, సీడెడ్ ప్రాంతంలో ఎన్వీఆర్ సినిమా విడుదల చేస్తుంది. తాజాగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమా తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. మోసపోయిన హీరో, జరిగిన దాన్ని మర్చిపోయి ముందుకు వెళ్లకుండా.. తనకు…

Read more