‘ఫౌజీ’ ఇండిపెండెన్స్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
రెబెల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'ఫౌజీ' డిసెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హను రాఘవపుడి దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ ననిర్మాణంలో టి-సిరీస్ సమర్పిస్తున్న ఈ భారీ పీరియడ్ యాక్షన్ చిత్రానికి నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. టైటిల్ పోస్టర్ నుండి ప్రీ-లుక్, ఫస్ట్ లుక్ వరకు, ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. 'ఫౌజీ' చిత్ర నిర్మాతలు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బలమైన భావోద్వేగ, చారిత్రక నేపథ్యం ఉన్న పోస్టర్ను విడుదల చేశారు. భారతదేశం నేడు జరుపుకుంటున్న స్వాతంత్ర్యం వెనుక ఉన్న త్యాగానికి నివాళిగా నిలిచిన ఈ పోస్టర్ అందరినీ కట్టిపడేసింది. స్వాతంత్ర్య దినోత్సవం…
