Skip to content

#బాలుగీత సినిమా డిసప్పాయింట్ చేయదు: నిర్మాత సుప్రియ యార్లగడ్డ

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన చిత్రం #బాలుగీత. సందీప్ సరోజ్, కేయురి, హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీకి ప్రతాప్ కొల్లారెడ్డి దర్శకత్వం వహించారు. ఆనంద్ రెడ్డి కర్నాటి, హరీష్ కోహిర్కర్ సహా నిర్మాతలు. నవంబర్ 5 నుంచి ఈ చిత్రం ETV Winలో ప్రీమియర్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్‌మీట్‌లో నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.చిన్న సినిమా అంటాం కానీ, చాలా పెద్ద కథ. ఈ కథ చెప్పినప్పుడు ఎలాగైనా సరే దీన్ని సినిమాగా తీయాలి అనిపించింది. అందరూ రిలేట్ అయ్యే కథ ఇది. చాలామంది జీవితాల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగి ఉంటాయి. ETV అనేది మంచి…

Read more

‘వృషకర్మ’ ఫస్ట్ సింగిల్ 7న రిలీజ్

యువ సామ్రాట్ నాగచైతన్య ప్రతిష్టాత్మక మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ‘వృషకర్మ’ మ్యూజికల్ జర్నీ మొదలుపెడుతున్నారు మేకర్స్. ఫస్ట్ సింగిల్ స్వాగ్ ఆఫ్ అర్జున్ నవంబర్ 7న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆసక్తిని పెంచుతోంది. నాగచైతన్య సైడ్ ప్రొఫైల్‌లో బ్లాక్ గాగుల్స్, ఇయర్‌ఫోన్స్‌తో చాలా ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. భుజంపై గాయం, డార్క్ బ్యాక్‌డ్రాప్ పోస్టర్‌కు…

Read more

ఎన్టీఆర్ లాంచ్ చేసిన ‘ఇట్లు అర్జున’ ట్రైలర్‌

కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న ‘ఇట్లు అర్జున’ చిత్రంతో కొత్త హీరో అనీష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్‌ వేదికగా ఆయన స్పందిస్తూ.. “ ఒక్క మాట కూడా మాట్లాడకుండా డెబ్యూ సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించడం అనీష్ రియల్ గట్స్ కి నిదర్శనం. నీ…

Read more

‘దొంగ నా కొడుకు’ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే ఫన్ ఎంటర్‌టైనర్: సుష్మితా శెట్టి

పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న చిత్రాలను కూడా ప్రోత్సహిస్తోంది. ఈ బ్యానర్‌పై రూపొందుతున్న క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘దొంగ నా కొడుకు’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. నవంబర్ 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సుష్మితా శెట్టి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీ నేపథ్యం.. సినిమాల్లోకి రావాలనే ఆసక్తి ఎలా కలిగింది? -నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. కాకపోతే మా గ్రాండ్ పేరెంట్స్ కన్నడ నుంచి 40 ఏళ్ల క్రితం…

Read more

రజనీకాంత్ ‘ధర్మన్’ లో శ్రీలీల గ్లింప్స్‌ రిలీజ్

సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘ధర్మన్’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలోకి మరో స్టార్ ను మేకర్స్ పరిచయం చేశారు. హీరోయిన్ శ్రీలీలకు స్వాగతం పలుకుతూ, ఆమెను సరికొత్త, ఆకట్టుకునే అవతార్‌లో పరిచయం చేసే గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో శ్రీలీ ఆకట్టుకునే అవతార్‌లో కనిపిస్తూ, సినిమాపై ఆసక్తిని మరింత పెంచారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన క్లాసికల్ మ్యూజిక్ ఆమె పరిచయ సన్నివేశాలకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఆమె పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ ““She’s the spark and she’s the pataka” అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చారు. దీంతో సినిమాలో శ్రీలీల పోషించబోయే పాత్ర ఎంతో సందడిగా ఉండబోతోందనే సంకేతాలు ఇచ్చారు. రాజ్ కమల్ ఫిల్మ్స్…

Read more

‘కింగ్ 100’ నుంచి మహంతి ఝాన్సీ రాణిగా టబు బర్త్‌డే గ్లింప్స్ రిలీజ్

కింగ్ నాగార్జున అక్కినేని తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ‘కింగ్ 100’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుండగా, రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. టబు పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె మహంతి ఝాన్సీ రాణిగా కనిపించనున్నారు. టబు పవర్‌ఫుల్ వాయిస్‌ఓవర్‌తో ఈ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. “ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. లక్ కు నమ్మేవాళ్లు ఒకరు, హార్డ్ వర్క్ ని నమ్మేవాళ్లు మరొకరు. ఐ హేట్ లక్” అనే డైలాగ్‌తో ఆమె పాత్రలోని ఆత్మవిశ్వాసం, పవర్ ను…

Read more

‘టైసన్ నాయుడు’ నుంచి మదరాసి రబ్బరు బొమ్మ సాంగ్ 6న రిలీజ్

యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘టైసన్ నాయుడు’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టైటిల్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ను కిక్‌స్టార్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ ను నవంబర్ 6న విడుదల చేయనున్నారు. ఇది మాస్ ఫోక్ సాంగ్‌గా అలరించనుంది. తాజాగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో హీరో, హీరోయిన్ సంప్రదాయ ఫోక్ లుక్‌లో కనిపిస్తూ, కలర్ ఫుల్ బ్యాక్ డ్రాప్ లో సందడి చేయడం పాటపై మరింత ఆసక్తిని పెంచుతోంది…

Read more

‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ ఎంజాయ్ చేస్తారు: డైరెక్టర్ తరుణ్ భాస్కర్

‘ఈఎన్ఈ రిపీట్’ తరుణ్ ప్రాణం పెట్టి చేశారు. మీరందరూ నవ్వుతారు, ఆనందంతో కన్నీళ్లు పెడతారు, సినిమాలో చాలా జరుగుతాయి: హీరో విశ్వక్ సేన్ విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి, తరుణ్ భాస్కర్ ధాస్యం, సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ లాంచ్ ఈ నగరానికి ఏమైంది’ సినిమాలోని క్రేజీ గ్యాంగ్ మళ్లీ కలుసుకోబోతున్న సమయం ఆసన్నమైయింది. ఈ కల్ట్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ‘ఈఎన్ఈ రిపీట్’ నవంబర్ 19న విడుదల కానుంది. తరుణ్ భాస్కర్ ధాస్యం రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌లో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి మరోసారి కలిసి నటిస్తున్నారు. ప్రేక్షకులకు ఎంతో…

Read more

ఈ దీపావళిని ‘సీన్’తో సెలబ్రేట్ చేసుకుందాం: హీరో సూర్య

హీరో సూర్య, మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్‌తో కలసి యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘సీన్’ చేస్తున్నారు. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నస్లేన్, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్యోతిక, సూర్య అగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎన్వీఆర్ సినిమా ద్వారా గ్రాండ్ రిలీజ్ కానుంది. ‘సీన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 నవంబర్ 6న దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా…

Read more

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన చిరంజీవి, రాంచరణ్ ఏఐ, డీప్‌ ఫేక్‌లను అరికట్టాలని వినతి

కళాకారులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన, మార్ఫింగ్ చేసిన వీడియోలను రూపొందించడంపై ఇటీవల ఎక్స్‌ వేదికగా తన ఆందోళనను వ్యక్తం చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ఈ అంశంపై మరో కీలక అడుగు వేశారు. ఈ రోజు హైదరాబాద్‌లో గౌరవ కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసి, ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్ సమస్యలను వివరించారు. ఈ భేటీలో చిరంజీవి గారితో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్ టెక్నాలజీలను దుర్వినియోగం చేస్తున్న తీరును స్వయంగా వివరించేందుకు చిరంజీవి ఈ భేటీకి అపాయింట్‌మెంట్ కోరారు. ఈ సాంకేతికతల దుర్వినియోగం కళాకారుల హక్కులు, గౌరవం, క్రియేటివ్ కంటెంట్‌కు ముప్పుగా మారుతోందని ఆయన వివరించారు. ఈ సమస్యను కేవలం సోషల్ మీడియా వేదికకే…

Read more