Skip to content

‘సీన్’తో ఈ దీపావళికి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ: హీరో సూర్య

హీరో సూర్య, మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్‌తో కలసి యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘సీన్’ చేస్తున్నారు. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నస్లేన్, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్యోతిక, సూర్య అగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎన్వీఆర్ సినిమా ద్వారా గ్రాండ్ రిలీజ్ కానుంది. ‘సీన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 నవంబర్ 6న దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్య మాట్లాడుతూ.. అందరికీ థాంక్యూ. లవ్ యు. మనందరం ఒక్కటే. వి ఆర్ వన్ ఫ్యామిలీ. మీరందరూ నాకు అన్‌కండిషనల్ లవ్ ఇచ్చారు. ఈ ఏడాదిలో మిమ్మల్ని కలవడం ఇది మూడోసారి. దీన్ని ఒక బ్లెస్సింగ్‌గా భావిస్తున్నాను. ఈ ఏడాది చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా గురించి మాట్లాడుతున్నారు. కానీ నాగార్జున గారు ఇంతకుముందే ఇతర భాషల డైరెక్టర్స్‌తో కలిసి పనిచేశారు. అన్ని ఇండస్ట్రీలను కలుపుకుంటూ వర్క్ చేసేవారు. మణిరత్నం గారు, ప్రియదర్శన్ గారు, మహేష్ భట్ గారు.. ఇలా ఎంతోమంది దర్శకులతో కలిసి పనిచేశారు. అది ఎప్పుడూ నా మనసులో ఉంటుంది. ‘విశ్వనాథన్ అండ్ సన్స్’లో చాలా భాషలకు చెందిన నటీనటులు కలిసి పనిచేశారు. ఎక్కడికి వెళ్లినా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వెంకీ చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇచ్చాడు. ఇప్పుడు జిత్తుతో కలిసి ‘సీన్’ చేశాను. తన ‘రోమాంచం’, ‘ఆవేశం’ సినిమాలను మీరు చూసే ఉంటారు. ‘సీన్’ కూడా అలాంటి ఒక బ్యూటిఫుల్ సినిమా. తనతో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ‘వీరభద్రుడు’, ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ తర్వాత మరోసారి మిమ్మల్ని కలవడం హ్యాపీగా ఉంది. మీ అందరి ప్రేమకు థాంక్యూ. మా టీమ్ సభ్యులు అద్భుతమైన వర్క్ ఇచ్చారు. మేమందరం కలిసి ఒక బ్యూటిఫుల్ సినిమాను అందిస్తున్నాం. ఇందులో మర్డర్ మిస్టరీ, మ్యాడ్‌నెస్, నవ్వులు.. అన్నీ ఉన్నాయి. రాకేందు మౌళి తెలుగులో చాలా చక్కని మాటలు, పాటలు రాశారు. చాలా కమిట్‌మెంట్‌తో పనిచేశారు. ఈ సినిమాలో చాలా ఫ్రెష్ టాలెంట్ కూడా ఉంది. నజ్రియాతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది. తను చాలా అద్భుతమైన నటి. తను నేచురల్ స్టార్. ఈ సినిమాలో తను స్టంట్స్ కూడా చేసింది. ఇది చాలా స్పెషల్ ఫిల్మ్. ఇందులో ఒక డైలాగ్ ఉంది. అది నిజంగా మీ జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. మనపై మనం నమ్మకం ఉంచి ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు. ‘సీన్’ చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కూడా. కుటుంబ సభ్యులందరూ కలిసి వచ్చి ఈ సినిమాను చూడొచ్చు. ఈ సినిమాతో దీపావళిని సెలబ్రేట్ చేసుకుందాం. లవ్ యు ఆల్.

హీరోయిన్ నజ్రియా నజీమ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘అంటే సుందరానికి’ సినిమా తర్వాత మరోసారి మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ప్రేమ, ఆదరణ, అభిమానానికి ధన్యవాదాలు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు చేశాను. ఈ సందర్భంగా మాస్టర్స్‌కు థాంక్స్ చెబుతున్నాను. వాళ్లు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. నాకు మాయ లాంటి క్యారెక్టర్ ఇచ్చిన జిత్తు మాధవన్‌కు థాంక్యూ. క్యారెక్టర్ చాలా యూనిక్‌గా ఉంటుంది. అలాగే మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సూర్య గారితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నవంబర్ 6న అందరూ థియేటర్లలో ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అందరూ సూర్య గారిని హ్యాట్రిక్ హిట్ కొట్టాలని అడుగుతున్నారు. నేను కూడా తోటి ఫ్యాన్‌గా అదే అడుగుతున్నాను. కచ్చితంగా హిట్ కొట్టాలి. అభిమానులుగా మీ అందరం ప్రామిస్ చేస్తున్నాం.. ఇది హ్యాట్రిక్ హిట్ అవుతుంది. ఆయన ఈ ఏడాది మూడో సినిమాతో వస్తున్నారు. మరో రెండు సినిమాలు ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. ఇంకో సినిమా స్టార్ట్ కాబోతోంది. ఆయన ఎందుకంత హార్డ్ వర్క్ చేస్తున్నారంటే, ఆయనకు సినిమా అంటే ఇష్టం. సంవత్సరంలో 365 రోజులు ఆయన సినిమా కోసమే పనిచేస్తారు. మనం సూర్య గారికి సెల్యూట్ చెప్పాలి. ఈ టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా అందరినీ అలరిస్తుంది.

లిరిక్ రైటర్ రాకేందు మౌళి మాట్లాడుతూ.. ‘వీరభద్రుడు’, ‘విశ్వనాథన్ అండ్ సన్స్’తో సూర్య గారు రెండు బ్లాక్‌బస్టర్లు కొట్టారు. ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. ఈ సినిమాలో సూర్య గారు చేస్తున్న క్యారెక్టర్.. ‘సింగం’, ‘శివపుత్రుడు’ క్యారెక్టర్లను మిళితం చేసినట్టుగా ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్, మాస్ రెండూ ఉంటాయి. ఈ సినిమాకు అన్ని పాటలు, డైలాగ్స్ రాశాను. ఇవి వింటున్నప్పుడు ఒక తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ మీకు కలుగుతుంది. నవంబర్ 6న ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. ఇందులో చాలా కామెడీ ఉంటుంది. పొట్ట చెక్కలయ్యేలా నవ్వులు ఉంటాయి. ఒక క్రేజీ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.

ప్రొడ్యూసర్ జయశ్రీ దామోదరన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అగరం స్టూడియోస్‌లో మేము చేస్తున్న తొలి సినిమా ఇది. సూర్య గారి వల్ల ఇది సాధ్యపడింది. ఈ దీపావళికి అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది. మా డిస్ట్రిబ్యూటర్ ఎన్వీఆర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. అందరూ ఈ సినిమాను థియేటర్లలో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.

నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సూర్య గారి కెరీర్‌లో ఎన్నో బిగ్ హిట్స్ ఉన్నాయి. ఈ ఏడాది ‘వీరభద్రుడు’, ‘విశ్వనాథన్ అండ్ సన్స్’, ఇప్పుడు ‘సీన్’.. ఈ మూడు సినిమాలు బ్లాక్‌బస్టర్ విజయాలతో ప్రేక్షకులను అలరిస్తాయని ఆశిస్తున్నాను. కచ్చితంగా ఈ సినిమా సూర్య గారికి హ్యాట్రిక్ అవుతుంది. అలాగే డైరెక్టర్ గారికి కూడా ఇది హ్యాట్రిక్ సినిమా అవుతుంది. నజ్రియా, నస్లేన్, రాజశేఖర్‌తో పాటు ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఈ దీపావళికి ఈ సినిమా అందరినీ ఎంతో ఎంటర్‌టైన్ చేస్తుంది. సూర్య గారి కెరీర్‌లో ఇది చాలా కొత్త సినిమా అవుతుంది. సూర్య గారు అగరం ఫౌండేషన్ ద్వారా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన సేవలను తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తే మేమందరం ఎంతో సంతోషిస్తాం.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.