సూర్య ‘సీన్’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్
వరుస బ్లాక్‌బస్టర్స్‌తో దూసుకెళ్తున్న స్టార్ హీరో సూర్య.. మలయాళ దర్శకుడు జితు మాధవన్‌తో కలిసి తన 47వ చిత్రాన్ని చేస్తున్నారు. ‘ఆవేశం’ ఫేమ్ జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘సీన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తుండగా.. ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని జఘరం స్టూడియోస్, 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై జ్యోతిక, సూర్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జయశ్రీ దామోదరన్ కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ‘సీన్’ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. అలాగే ఈ సినిమాను దీపావళి సందర్భంగా నవంబర్ 6, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. టైటిల్…
