హీరో సూర్య, మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్‌తో కలసి యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్…
అంగరంగ వైభవంగా SA ప్రొడక్షన్స్ బ్యానర్ లోగో & “చాణక్య” టీజర్ లాంచ్

SA ప్రొడక్షన్స్ బ్యానర్ లోగో అత్యంత ఘనంగా నిర్మాతలు రాజేశ్వర శర్మ కూచి, ఆదిత్య డొక్కర, గోపాల్ దాయిమ, వినోద్ గార్లపాటి లాంచ్ చేయడం జరిగింది. అలాగే జనపదం జానపదం లోగోను రాజేశ్వర శర్మ, నరసింహ లాంచ్ చేశారు. ఇదే సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన నటుడు ఘర్షణ శ్రీనివాస్ తాండవం లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రహ్లాదా చార్యులు, నాగరాజు సోమిశెట్టి కలిసి చాణక్య టీజర్ లాంచ్ చేశారు. రాజేశ్వర శర్మ స్వీయ నటనా దర్శకత్వంలో ఉన్న ఈ చిత్రంలో వైభవ్ తదితరులు నటించనున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ… “నా వ్యాపారంలో ఆంజనేయస్వామి అలాగే వెంకటేశ్వర స్వామి భాగస్వాములుగా నేను భావిస్తాను. ఆయన నాకోసం ఒక మనిషిని పంపించారు, వారి ముందు నేను దోసిలి పట్టమన్నారు వెంకటేశ్వర స్వామి” అన్నారు.
ప్రహ్లాదా చార్యులు మాట్లాడుతూ… “మనం ఏం అనుకున్న భగవంతుడి నిర్ణయం. ఆయన చెప్పినది నేను బాధ్యతగా తీసుకుంటున్నాను. ఎటువంటి వ్యాపారం చేసిన గొప్పగా అలాగే చాలా మంచిగా నలుగురికి ఉపయోగపడేలా చేయాలి” అన్నారు.
నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ… “SA ప్రొడక్షన్స్ బ్యానర్ లోగో లాంచ్ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా నమస్కారం. ఇక్కడ కళాకారులకు గొప్ప అవకాశాలు ఉన్నాయి, వాడికి ఇది మంచి ఉపాధి. ఆ కళను బయటికి తీసుకుని వచ్చే సంకల్పాన్ని శర్మ గారు తీసుకున్నారు. SA ప్రొడక్షన్స్ ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నాగరాజు సోమిశెట్టి మాట్లాడుతూ… “వేదిక పై ఉన్న మా గురువులకు, నన్ను ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన వారికి నా కృతజ్ఞతలు. ఈ కథ చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఈ కథకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాస్తున్న వ్యక్తిని నేనే. చిన్న సినిమాల ప్రారంభమై అందరూ మాట్లాడుకునేలా ఉండబోతుంది. మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు అనుకుంటున్నాను” అన్నారు.

