Skip to content

‘జాకీ – నో రీటేక్స్ అలౌడ్’ -స్టైలిష్ యాక్షన్ ఫస్ట్ లుక్ రిలీజ్

తెలుగు సినిమాలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్‌ను విస్తరిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేస్తోంది. తమిళంలో నిర్మిస్తున్న తమ నాలుగో చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ ధృవ్ విక్రమ్ తో తెరకెక్కిస్తోంది. నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్నమైన, ఇంటెన్స్ పాత్రల్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధృవ్ విక్రమ్.. ఇప్పుడు మరింత మంది ప్రేక్షకులను కనెక్ట్ చేసే కమర్షియల్ సబ్జెక్ట్‌తో రాబోతున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘జాకీ -…

Read more

‘ఇరుముడి’ టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. సినిమా థియేట్రికల్ సక్సెస్‌ను పురస్కరించుకుని ‘ఇరుముడి’ కోర్ టీమ్‌ను తన ఇంటికి ఆహ్వానించిన చిరంజీవి, వారిని వ్యక్తిగతంగా అభినందించారు. రవితేజతో పాటు దర్శకుడు శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సందర్భంగా వారితో కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా విడుదలైన ఫొటోల్లో చిరంజీవి, ‘ఇరుముడి’ టీమ్ మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధం కనిపించింది. బాక్సాఫీస్ వద్ద ‘ఇరుముడి’ అంచనాలను మించి అద్భుతమైన విజయాన్ని అందుకుంటూ, సరికొత్త రికార్డులను నమోదు చేసింది. అత్యధిక వసూళ్లు సాధించిన ప్రాంతీయ చిత్రాల్లో ఒకటిగా…

Read more

‘హ్యాపీ జర్నీ’కి ప్రేక్షకులే హీరోలు : డైరెక్టర్ అభిరామ్ నాయుడు

గుత్తా ప్రొడక్షన్ & కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ ‘హ్యాపీ జర్నీ’ ఫన్, ఎమోషన్స్‌తో రిఫ్రెషింగ్ ట్రైలర్ లాంచ్ ఒక్కో వ్యక్తికి ఒక్కో రకంగా అనిపించే ప్రయాణం.. ‘హ్యాపీ జర్నీ’లో అదే ఆలోచనను ఏడుగురు మహిళల జీవితాలు, అనుభవాల ద్వారా ఆసక్తికరంగా చూపించారు. ఏడు మంది మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల కీలక సహాయ పాత్రలను పోషించారు. గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ల పై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్న 'హ్యాపీ జర్నీ' చిత్రంతో అభిరామ్ నాయుడు…

Read more

నిఖిల్ ‘స్వయంభు’ 175 రోజుల షూటింగ్

నిఖిల్ సిద్ధార్థ్ ‘స్వయంభు’ సినిమాతో ప్రేక్షకులను చారిత్రక ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. మల్టీ లాంగ్వేజ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘స్వయంభు’ కోసం ఏకంగా 175 రోజుల పాటు షూటింగ్ నిర్వహించారు. ఫైనల్ ప్రొడక్ట్‌లో సుమారు 2,500 వీఎఫ్‌ఎక్స్ షాట్స్‌ను పొందుపరుస్తున్నారు. ఈ నెంబర్స్ సినిమా ఏ స్థాయిలో తెరకెక్కుతోందో, ఎంత భారీ టెక్నికల్ వర్క్ జరుగుతోందో తెలియజేస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన బిహైండ్ ది సీన్స్ పిక్చర్ సినిమా మేకింగ్‌పై…

Read more

‘మహేంద్రగిరి వారాహి’కి గ్రౌండ్ లెవల్ లో అద్భుతమైన రెస్పాన్స్ ఉంది: హీరో సుమంత్

హీరో సుమంత్ డివైన్ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్. ‘మహేంద్రగిరి వారాహి’. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ప్రత్యేక పాత్రలో నటించారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మించారు. సెప్టెంబర్ 11న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ డివైన్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో సుమంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చాలా కాలంగా కొంతమంది ఇండస్ట్రీ పీపుల్, అలాగే నా ఫ్యాన్స్ నుంచి విషెస్ అందుకోలేదు. నిన్నటి నుంచి ఆ అభినందనలు మొదలయ్యాయి. ‘మహేంద్రగిరి వారాహి’ని గురించి ప్రేక్షకులు, అభిమానులు…

Read more

నితిన్ ‘అలియాస్ రుక్మిణీ’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ అద్భుత విజయం తర్వాత న్యాచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్, నితిన్ హీరో నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణీ’ సరికొత్త ప్రాజెక్ట్‌తో వస్తోంది. తన తొలి చిత్రం ‘దండోరా’తో విమర్శకులను ఆకట్టుకున్న మురళీకాంత్ దేవసోత్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. దీప్తి గంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఒక ఆసక్తికరమైన కథతో కూడిన విలక్షణమైన ప్రపంచాన్ని ఆవిష్కరించేలా ఉంటుంది. ‘అలియాస్ రుక్మిణి’ 10 రోజుల మొదటి షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. చిత్ర బృందం ప్రధాన తారాగణంతో కూడిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. ఈ షూట్‌లో హీరో నితిన్‌తో పాటు సాయి కుమార్, హర్ష వర్ధన్, ఇతర ప్రముఖ నటులు…

Read more

ప్యారడైజ్‌లో యాక్షన్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది : ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ప్యారడైజ్‌కు ఎంతమంది ఫైట్ మాస్టర్స్ పనిచేశారు? మేము, నవకాంత్, రియల్ సతీష్ పనిచేశాం. ఇందులో మేం రెండు భారీ యాక్షన్ బ్లాక్స్ కంపోజ్ చేశాం. నాని గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నాని గారి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది…

Read more

నా కెరీర్‌లో ఎక్కువ కష్టపడి చేసిన సినిమా ప్యారడైజ్: నాని

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్‌లో న్యాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీ అందరినీ కలిసి చాలా రోజులవుతుంది. ఎప్పుడూ నా కెరీర్‌లో ఒక సినిమాకి మరో సినిమాకి ఇంత గ్యాప్ రాలేదు. ఈ ప్రెస్ మీట్‌కి వస్తూ ఉంటే నా ఫస్ట్ సినిమాకి ఎంత నెర్వస్‌గా ఉన్నానో…

Read more

‘418’ సినిమా ట్రైలర్ రిలీజ్

పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ‘418’తో డార్కర్ జానర్ లో అడుగుపెడుతోంది. సీరియస్, అన్‌సెటిలింగ్ నెరేటివ్‌తో భయాన్ని కొత్త కోణంలో చూపించబోతున్న ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ఈ సినిమాతో కీర్తన్ నాదగౌడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కథను కూడా ఆయనే రాశారు. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైత్ర ఆచార్, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఓ పాడుబడిన ఇంట్లోకి ఒక్క పక్షి కూడా వెళ్లలేదని వాచ్‌మెన్ చెప్పడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అనంతరం 18…

Read more

రామ్ పోతినేని #RAPO23 లో సంయుక్త

ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రతిష్టాత్మక #RAPO23లో ఎక్సయిటింగ్ స్టార్ చేరారు. టాలెంటెడ్ హీరోయిన్ సంయుక్త ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్.. టాలీవుడ్ లక్కీ చార్మ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ బర్త్‌డే పోస్టర్ సంయుక్తకు టీమ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు.. ఆమె ఈ సినిమాలో భాగమైన విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఆమె చేరికతో ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై మరింత క్యూరియాసిటీ పెరిగింది. #RAPO23ను నియో-నోయిర్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. #RAPO23తో రామ్ పోతినేని దర్శకుడిగా తొలిసారి పరిచయం అవుతున్నారు. తన విజన్‌ను తెరపైకి తీసుకొచ్చే బాధ్యతను ఆయనే పూర్తిగా తీసుకున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై…

Read more