Skip to content

నందమూరి మోక్షజ్ఞ తేజ, వశిష్ఠ, మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మక చిత్రం అనౌన్స్‌మెంట్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ తెలుగు చిత్రసీమలో తన తొలి అడుగు వేయడానికి సిద్ధమయ్యారు. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డెబ్యూ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నందమూరి కుటుంబానికి, అభిమానులకు ఇది మరో గొప్ప అధ్యాయానికి నాంది పలకనుంది. తన డెబ్యూ కోసం సరైన కథను ఎంచుకునేందుకు మోక్షజ్ఞ కావాల్సిన సమయం తీసుకున్నారు. పలు కథలను విన్న తర్వాత తనకు నచ్చిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ చేస్తున్న దర్శకుడు వశిష్ఠ ఈ కథను సిద్ధం చేశారు. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ మైత్రీ మూవీ…

Read more

#NBK111 పవర్‌ఫుల్ టైటిల్ ‘దాదా’, మాస్ ను మెస్మరైజ్ చేసిన టైటిల్ గ్లింప్స్

గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #NBK111, బాలయ్య పుట్టినరోజున "ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా" అనే టైటిల్‌తో గ్లింప్స్ విడుదలైనప్పటి నుండి భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ను పోస్టర్, పవర్ ఫుల్ గ్లింప్స్ ద్వారా ప్రకటించారు. #NBK111కు ‘దాదా’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. బాలకృష్ణ పోషిస్తున్న పాత్ర స్వభావాన్ని ప్రజెంట్ చేసేలా ఈ టైటిల్‌ ఉంది. పోస్టర్‌లో బాలకృష్ణ మాస్ అవతార్‌లో కనిపించారు. సన్‌గ్లాసెస్‌, లెదర్ జాకెట్‌, మెడలో భారీ గోల్డ్ చైన్‌తో స్టైలిష్‌గా కనిపించిన ఆయన.. భుజంపై వెపన్‌తో…

Read more

‘కామ్రేడ్ కళ్యాణ్’ వెరైటీ ఫన్ రైడ్‌లా ఉంటుంది : శ్రీ విష్ణు

శ్రీ విష్ణు, జనకిరామ్ మారెళ్ల, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP 'కామ్రేడ్ కళ్యాణ్' టీజర్ లాంచ్ ‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీ విష్ణు పీరియడ్ ఎలిమెంట్స్, హ్యూమర్, రొమాన్స్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ‘కామ్రేడ్ కళ్యాణ్’ తో అలరించబోతున్నారు. జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 9న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే గ్లింప్స్, పాటలతో ఆసక్తిని పెంచిన మేకర్స్.. తాజాగా సినిమా టీజర్‌ను విడుదల చేశారు. 1992లో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు నేపథ్యంలో ‘కామ్రేడ్ కళ్యాణ్’ కథ సాగుతుంది. ఇందులో శ్రీ విష్ణు థియేటర్ ఓనర్‌గా…

Read more

‘సర్దార్ 2’ యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది: హీరో కార్తి

హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘సర్దార్ 2’ తో థియేటర్లలోకి వస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 10న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో కార్తి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు. సర్దార్ సినిమా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. వాటర్ బాటిల్ చూస్తే ఆ సినిమానే గుర్తొచ్చింది. సర్దార్ 2 కథ ఎలా ఉండబోతుంది? -ఇండియాలో…

Read more

మోహన్‌లాల్ పాన్ ఇండియా మూవీ టైటిల్ ‘ఆపరేషన్ గంగా’

సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై గోకులం గోపాలన్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ టైటిల్‌ను ప్రకటించారు. ఎల్367గా తెరకెక్కుతున్నఈ చిత్రానికి విష్ణు మోహన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఆపరేషన్ గంగా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బైజు గోపాలన్, వి.సి. ప్రవీణ్ కో-ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తుండగా, కృష్ణమూర్తి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో, గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. విష్ణు మోహన్ దర్శకత్వం వహిస్తున్న మూడో సినిమా ఇది. ఆయన తొలి చిత్రం ‘మెప్పడియాన్’తోనే నేషనల్ అవార్డు అందుకుని గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ఆపరేషన్ గంగా’ ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో భారత్ చేపట్టిన…

Read more

రజనీకాంత్ ‘ధర్మన్’ రెండవ షెడ్యూల్ పూర్తి

సూపర్ స్టార్ రజనీకాంత్ 'ధర్మన్' షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 'ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా మేకర్స్ రెండవ షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో సూపర్ స్టార్ తనదైన చరిస్మా, ప్రజెన్స్ తో అదరగొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ మధ్య ఉన్నంత స్నేహబంధం చాలా అరుదు. భారతీయ చలనచిత్ర రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ఈ ఇద్దరు దిగ్గజాలు, 'ధర్మన్' చిత్రం ద్వారా నిర్మాత-నటుడిగా మొదటిసారిగా…

Read more

‘రంభ ఊర్వశి మేనక’ కామెడీని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు: హీరో అల్లరి నరేష్

అల్లరి నరేష్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్‌తో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్‌లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘రంభ ఊర్వశి మేనక’ ఈరోజు రిలీజ్ అయింది. సింగిల్ స్క్రీన్స్, బి, సి సెంటర్స్‌లో చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. శని, ఆదివారాలు ఏ సెంటర్స్‌లో కూడా పికప్ అవుతుంది. చాలా రోజుల తర్వాత చేసిన కామెడీ సినిమా ఇది. ప్రేక్షకులు…

Read more

నాగ చైతన్య లాంచ్ చేసిన ది రేజ్ ఆఫ్ వారాహి సాంగ్

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే ఈ కథలో ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా యువ సామ్రాట్ నాగ చైతన్య ‘ది రేజ్ ఆఫ్ వారాహి’ సాంగ్ ని లాంచ్ చేశారు. అనూప్ రూబెన్స్ కంపోజిషన్ పాటకు ఇంపాక్ట్ తీసుకొచ్చింది. కడలి సత్యనారాయణ రాసిన లిరిక్స్ పవర్‌ఫుల్ గా ఉన్నాయి. నకాష్ అజీజ్ వోకల్స్ ఎనర్జిటిక్ గా ఉన్నాయి. ఈ పాట కథ, వారాహి…

Read more

‘కాకా’ సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్ ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీ కాకా. వెంకట్ కే నారాయణ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు పెంచింది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో ‘కాకా’ నెక్స్ట్ భారీ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ లెన్తీ షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన వర్కింగ్ స్టిల్‌లో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి షూటింగ్ లొకేషన్ లో డిస్కస్ చేస్తూ కనిపించారు. ఈ బిహైండ్ ద సీన్ పిక్ సోషల్…

Read more

కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్న రామ్ చరణ్, ఉపాసన

శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామ్ చరణ్, ఉపాసన కొణిదెల తమ ముగ్గురు చిన్నారులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. శ్రీకృష్ణుడు, రాధారాణి వేషధారణలో తమ చిన్నారులను ముస్తాబు చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారి కృష్ణుడు, రాధారాణి కొణిదెల వారి ఇంట్లోకి అడుగుపెట్టినట్టుగా ఉన్న ఈ అందమైన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఆకట్టుకునే ఈ ఫోటోలపై సోషల్ మీడియాలో అభిమానులు స్పందిస్తూ..''చిరంజీవి గారి ఇంట్లోకి చిన్నారి కృష్ణుడు అడుగుపెట్టాడు 🦚💙” అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 31న రామ్ చరణ్, ఉపాసన రెండోసారి తల్లిదండ్రులయ్యారు. వారికి ఒక బాబు, ఒక పాప జన్మించారు. బాబుకి శివరామ్, పాపకి అన్వీరా అని పేరు పెట్టారు.

Read more