Skip to content

సాయి దుర్గ తేజ్ ‘SYG’ (సంబరాల ఏటి గట్టు) షూటింగ్ పూర్తి

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సంబరాల ఏటి గట్టు’ (ఎస్‌వైజీ) షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం, థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్న క్రమంలో కీలక మైలురాయిని చేరుకుంది. బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’ చిత్రాన్ని నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలో ఇప్పటివరకు తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇది. ఈ సుదీర్ఘమైన, కష్టతరమైన ప్రయాణం ముగిసిన సందర్భంగా మేకర్స్ ఓ బిహైండ్ ద సీన్స్ వీడియోను విడుదల చేశారు. సినిమా కోసం రూపొందించిన భారీ సెట్స్, రా అగ్రెషన్‌తో కూడిన యాక్షన్ సన్నివేశాలు, టీమ్ మధ్య…

Read more

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా సినిమా ‘స్పిరిట్’ 2027 అక్టోబర్ 29న వరల్డ్ వైడ్ రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్, బ్లాక్‌బస్టర్ ఫిల్మ్‌మేకర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంది. భారీ అంచనాలున్న ఈ యాక్షన్ డ్రామా 2027 అక్టోబర్ 29న దీపావళి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో వచ్చే ఏడాది బిగ్గెస్ట్ రిలీజ్‌లలో ఒకటిగా ఈ సినిమా నిలవనుంది. మేకర్స్ తాజాగా విడుదల చేసిన కొత్త రిలీజ్ పోస్టర్ ద్వారా విడుదల తేదీని ప్రకటించారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ ఇంటెన్స్, స్టైలిష్, మిస్టీరియస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. బ్లాక్ క్యాప్, డార్క్ సన్‌గ్లాసెస్, గడ్డంతో క్లోజప్ ప్రొఫైల్ షాట్‌లో ఆయన లుక్ ఆకట్టుకుంటోంది. డ్రామాటిక్ లైటింగ్‌తో ప్రభాస్ రఫ్ లుక్‌ను మరింత హైలైట్ చేశారు…

Read more

గరివిడి లక్ష్మి’ సినిమాపై ప్రేమను కురిపిస్తున్న అందరికీ థాంక్స్: నిర్మాత కృతి ప్రసాద్

‘గరివిడి లక్ష్మి’ సినిమా ద్వారా నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన నిర్మాత కృతి గారికి, డైరెక్టర్ గౌరికి ధన్యవాదాలు. ప్రేక్షకులు, నా అభిమానులు అందరూ ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నాను: జానపద గాయని గరివిడి లక్ష్మి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన లేటెస్ట్ సూపర్ హిట్ ‘గరివిడి లక్ష్మి’. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి కథని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది నటించారు. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ రోజు ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సినిమా…

Read more

‘డోంట్ స్లీప్’ టీజర్ పై కమల్ హాసన్ ప్రశంసలు

ఇంద్ర రామ్ హీరోగా షామ్‌దత్ దర్శకత్వంలో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘డోంట్ స్లీప్’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. మమ్ముట్టి నటించిన మలయాళం–తమిళ ద్విభాషా థ్రిల్లర్ ‘స్ట్రీట్ లైట్స్’తో దర్శకుడిగా పరిచయమైన సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్ .. ఈ చిత్రంతో తెలుగులో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు. ‘చౌర్య పాఠం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇంద్ర రామ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. వీ డ్రీమ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై వీ చుడామణి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆ సంస్థకు ప్రొడక్షన్ నంబర్ 2. ఇటీవలే విడుదలైన టీజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఉలగనాయగన్ కమల్ హాసన్ #DontSleep టీజర్‌ను అభినందించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. విభిన్నమైన కథాంశం, విజువల్స్, ఉత్కంఠభరితమైన కథనంతో ‘డోంట్…

Read more

‘స్లమ్ డాగ్’ షూటింగ్ పూర్తి.. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్

డైనమిక్ ఫిల్మ్‌మేకర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్' షూటింగ్ పూర్తయింది. హైదరాబాద్‌లో ఈరోజు జరిగిన చివరి షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ మొత్తం ముగిసింది. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది. పవర్ ఫుల్ కథలు, తనదైన స్క్రీన్ ప్రజెంటేషన్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పూరి జగన్నాథ్‌.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఇప్పటివరకు విడుదలైన పాత్రల పరిచయ వీడియోలు సినిమాలోని విభిన్న పాత్రల స్వభావాలను పరిచయం చేశాయి. త్వరలోనే సినిమాను థియేటర్లలోకి…

Read more

డీవోపీ విజయ్ కార్తీక్ కన్నన్ ను అభినందించిన చిరంజీవి

బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి మరోసారి కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుతోంది. టైటిల్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి విజయ్ కార్తీక్ డీవోపీ పని చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, విజయ్ కార్తీక్, ఆయన టీమ్‌ను అభినందించారు. విజయ్ కార్తీక్ డీవోపీ గా పని చేసిన జైలర్ 2 ఇటీవలే విడుదలై విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా జైలర్ 2 కోసం వారు చేసిన అద్భుతమైన వర్క్ ను ప్రశంసించారు మెగాస్టార్. ప్రస్తుతం కాకా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో…

Read more

‘ఆకాశంలో ఒక తార’ ఎమోషనల్ రోలర్‌కోస్టర్ రైడ్‌ టీజర్ రిలీజ్

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘ఆకాశంలో ఒక తార’తో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. విభిన్నమైన కథలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పవన్ సాధినేనితో దుల్కర్ సల్మాన్ తొలిసారి కలిసి పనిచేస్తున్న సినిమా ఇది. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. కల్పన జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ప్రతిభావంతురాలైన విద్యార్థిని. అయితే చదువులో ఎంత ప్రతిభ చూపించినా, ఆమెను ప్రోత్సహించేవారు ఎవరూ ఉండరు. చివరికి తల్లిదండ్రులు కూడా ఆమెను నిరుత్సాహపరుస్తూ…

Read more

‘జనవరి 12 విడుదల’ నుంచి కీర్తి సురేష్ రస్టిక్, ట్రెడిషనల్ ఫస్ట్ లుక్ రిలీజ్

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘జనవరి 12 విడుదల’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఇప్పటికే వెంకటేష్, కల్యాణ్ రామ్, కృతిశెట్టి ఫస్ట్ లుక్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. తాజాగా, హీరోయిన్ కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆమె పోషిస్తున్న లతారెడ్డి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో కీర్తి సురేష్…

Read more

సెన్సార్ బోర్డు తీరు పై ఆర్ నారాయణ మూర్తి ఆగ్రహం!

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీ విష్ణు నవ్వుల బ్లాక్‌బస్టర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పించగా, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించారు. మహిమా నంబియార్ కథానాయికగా నటించారు. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం దసరా ఫన్ డగ బ్లాక్ బస్టర్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీం అందరికీ మేకర్స్ షీల్డ్స్ బహూకరించారు. ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు ఆర్ నారాయణ మూర్తి, హరీష్ శంకర్, విఎన్ ఆదిత్య పాల్గొన్నారు. ‘దసరా ఫన్…

Read more

‘రియాలిటీ’ నుంచి ఆలోచనగా దేవికా భట్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

హీరో కిరణ్ అబ్బవరం వరుస విజయాల తర్వాత మరో విభిన్నమైన ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'క', 'కె-రాంప్' చిత్రాల విజయాల తర్వాత ఆయన తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకం రియాలిటీ' తో అలరించనున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు కూడా కిరణ్ అబ్బవరం స్వయంగా చేపట్టడంతో పాటు హీరోగా నటిస్తున్నారు. జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి నిర్మిస్తుండగా, సురేష్ యెర్రా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్‌ గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ నటిస్తున్న దేవికా భట్‌ను ‘ఆలోచన’ గా పరిచయం చేస్తూ మేకర్స్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో దేవికా భట్ అందంగా,…

Read more