Skip to content

‘మహేంద్రగిరి వారాహి’ మంచి డివోషనల్ థ్రిల్లర్ – హీరో సుమంత్

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే కథతో రూపొందుతోంది. ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది. ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘వాట్ ఏ లాజిక్ సర్ జీ’ పాటను లాంచ్ చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సుమంత్…

Read more

‘సహ'(లైఫ్ ఆఫ్ సంజు) సెప్టెంబర్ 4న రిలీజ్

నిశాంత్ దోటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎమోషనల్ డ్రామా ‘సహా (లైఫ్ ఆఫ్ సంజు)’ ప్రస్తుతం ప్రమోషన్స్ తో సందడి చేస్తోంది. శివ కుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ప్రేమ, అనుబంధాలు, జ్ఞాపకాలు, జీవితంలో ఎదురయ్యే భావోద్వేగ సంఘర్షణల చుట్టూ సాగనుంది. సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజ వెల్పుచర్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌తో ఆసక్తి పెంచుకున్న ‘సహా’ సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్‌లో శివ కుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్‌ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ జర్నీలో ఆత్మీయంగా కనిపించారు. ఈ విజువల్ ఇద్దరి మధ్య ప్రేమ, అనుబంధాన్ని సహజంగా…

Read more

చిరంజీవి ‘కాకా’ 2027 జనవరి 13న రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీ #Mega158 / #ChiruBobby2, వెంకట్ కే నారాయణ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా ప్రకటన నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన టైటిల్ గ్లింప్స్ స్టైల్, యాక్షన్, రా మాస్ అప్పీల్‌తో ఆ అంచనాలను మరింత పెంచింది. కె. సత్యం, సూపర్‌వైజర్‌గా చిరంజీవి ఆక్వా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. చెన్నై టీమ్‌కు ఫోన్ చేసి లోడ్ సమయానికి వస్తుందని చెబుతూ అందరినీ పలకరిస్తారు. సునీల్ లీవ్ అడగగా, తమ టార్గెట్ ఫెస్టివల్ అని చెప్పి లీవ్‌ను తిరస్కరిస్తారు. గెటప్ శ్రీను స్కూటర్ కీస్ గురించి చెప్పగా సత్యం వాటిని విసరమని చెబుతారు. ఆ…

Read more

‘కామ్రేడ్ కళ్యాణ్’ నుంచి ‘సరస్వతమ్మ’గా రాధిక ఫస్ట్ లుక్ రిలీజ్

‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’తో అలరించబోతున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆసక్తికరమైన పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌తో పాటు రొమాన్స్, ఎమోషన్స్ తో రూపొందిస్తున్నారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మిస్తున్నారు. 1992లో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌తో పాటు తొలి రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ‘సరస్వతమ్మ’గా ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల…

Read more

షావుకారు జానకి గారు ఇకలేరనే వార్త ఎంతో బాధ కలిగించింది: మెగాస్టార్ చిరంజీవి

‘షావుకారు’ చిత్రంతో మొదలైన ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానం తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో దాదాపు ఏడు దశాబ్దాలపాటు కొనసాగింది. వైవిధ్యమైన పాత్రలకు తన సహజమైన నటనతో ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి ఆమె. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం. షావుకారు జానకి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి 🙏

Read more

జానకిగారితో మా అనుబంధం ప్రత్యేకం – నందమూరి బాలకృష్ణ

మహానటి షావుకారు జానకిగారు తుదిశ్వాస విడిచారన్న వార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యాను. జానకిగారితో మా నందమూరి కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. నాన్నగారు హీరోగా రిలీజైన తొలి చిత్రం 'షావుకారు'తోనే ఆమె 'షావుకారు జానకి'గా సుప్రసిద్ధులయ్యారు. అలా నాన్నగారికి జానకిగారు తొలి హీరోయిన్, అలాగే ఆమె తొలి కథానాయకుడు ఆయన. నాన్నగారితో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జానకిగారు. మా యన్.ఏ.టి. బ్యానర్ లో రూపొందిన తొలి చిత్రం 'పిచ్చిపుల్లయ్య'లో కీలక పాత్ర ధరించారు. 'పాండురంగ మహాత్మ్యం' నుంచీ యన్.ఏ.టి. బ్యానర్ లోగోలో శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహానికి కుడివైపును జానకిగారు కూర్చుని తెరపై కనిపించడం విశేషం. నేను 'తాతమ్మకల'లో మహానటి భానుమతి మునిమనవడిగా నటిస్తూ పరిచయమయ్యాను. ఆ తరువాత "రామ్ -…

Read more

‘ఇట్లు అర్జున’ అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్

స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. ఈ సినిమాతో అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, డెబ్యూ దర్శకుడు మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్, ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, ఇతర ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘ఇట్లు అర్జున’ అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో అనీష్ స్టైలిష్ లుక్‌లో ఓ భవనం పైకప్పు నుంచి దూకుతూ ఏదో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుండగా,…

Read more

‘ఇరుముడి’ సినిమాను తప్పకుండా ఇష్టపడతారు: బేబీ నక్షత్ర

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఇరుముడి'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్, ట్రైలర్, పాటలతో ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తించింది. ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎమోషన్స్, యాక్షన్‌తో కూడిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన బేబీ నక్షత్ర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. -నా పేరు నక్షత్ర. మాది కేరళ. నేను ఏడో క్లాస్ చదువుకుంటున్నాను. ఇప్పటివరకు కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో కలిపి ఆరు సినిమాలు చేశాను. ‘ఇరుముడి’ అవకాశం ఎలా వచ్చింది? -దర్శకుడు…

Read more

‘రంభ ఊర్వశి మేనక’ నుంచి ‘బ్యాడ్ టైం బ్యాండ్ బాజా’ సాంగ్ రిలీజ్

కామెడీ సినిమాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ మరోసారి తనకు బాగా కలిసొచ్చిన జానర్‌లో సందడి చేయబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ‘నా కంటి మీద కనులే’, టీజర్‌ సినిమా పై అంచనాలు పెంచాయి. తాజాగా బ్యాడ్ టైం బ్యాండ్ బాజా సాంగ్ రిలీజ్ చేశారు. ‘బ్యాడ్ టైం బ్యాండ్ బాజా’ పేరుకు తగ్గట్టుగానే పాట ఆద్యంతం ఫుల్ ఎనర్జీ, ఫన్‌తో సాగుతుంది. హీరో జీవితంలో ఎదురయ్యే బ్యాడ్…

Read more

‘రంభ ఊర్వశి మేనక’ ఫుల్ లెంత్ ఎంటర్ టైనర్: దర్శకుడు చంద్ర మోహన్ చింతాడ

అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ‘నా కంటి మీద కనులే’ పాట, టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చంద్ర మోహన్ చింతాడ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘రంభ ఊర్వశి మేనక’ టైటిల్ చాలా గమ్మత్తుగా ఉంది. ఈ టైటిల్ వెనుక ఉన్న కథ ఏమిటి? -సక్సెస్ కోసం ప్రతి ఒక్కరం చాలా ఆత్రుతగా…

Read more