Skip to content

‘కొరియన్ కనకరాజు’ ఆగస్టు 7న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్ హారర్-కామెడీ ‘కొరియన్ కనకరాజు’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఇంతకుముందు విడుదలైన టైటిల్ గ్లింప్స్, హారర్, కామెడీ, కొరియన్ కల్చర్ ఎలిమెంట్స్ కూడిన ఈ చిత్రంలోని వినోదాత్మకంగా చూపిస్తూ భారీ బజ్‌ను సృష్టించింది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘కంసంనిదా’ కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.

చిత్ర నిర్మాతలు ఆగస్టు 7వ తేదీని ప్రపంచవ్యాప్త థియేట్రికల్ విడుదల తేదీగా అధికారికంగా ఖరారు చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్ ఆటిట్యూడ్, ఇంటెన్స్ ని ప్రజెంట్ చేస్తోంది. వరుణ్ తేజ్ ఒక చేతిలో రక్తం మరకలున్న కత్తి, మరో చేతిలో గ్రెనేడ్‌తో కుర్చీలో హుందాగా కూర్చుని, రఫ్ అండ్ అల్ట్రా-స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తున్నారు. భయపెట్టే కొరియన్ గ్యాంగ్‌స్టర్ల గ్యాంగ్ చుట్టుముట్టి ఉన్నప్పటికీ, అతను ఏమాత్రం బెదరనట్లు కనిపించారు. కళ్లు చెదిరే నియాన్ లైటింగ్ బ్యాక్ డ్రాప్, గ్యాంగ్‌స్టర్ నేపథ్యం మరింత ఆసక్తిని పెంచింది.

రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, కమెడియన్ సత్య కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రంలో అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందించగా, మనోజ్ రెడ్డి కటసాని డీవోపీగా పని చేస్తున్నారు.

విలక్షణమైన కథాంశం ఆకట్టుకునే వినోదంతో ‘కొరియన్ కనకరాజు’ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది. చిత్ర నిర్మాతలు విడుదల తేదీని ఖరారు చేయడంతో వరుసగా అప్డేట్స్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తారాగణం: వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య

రచన, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
బ్యానర్లు: యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్
సంగీతం: ఎస్ థమన్
DOP: మనోజ్ రెడ్డి కటసాని
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.