Skip to content

‘భోగి’ నుంచి రాఖీ స్పెషల్ పోస్టర్ రిలీజ్

‘చార్మింగ్ స్టార్’ శర్వా హీరోగా, ‘మాస్ మావెరిక్’ సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ,లక్ష్మి రాధామోహన్ సమర్పిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయి అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో అంచనాలను పెంచుతూనే ఉంది. శర్వాను ఇప్పటివరకు ఎప్పుడూ చూడని పవర్‌ఫుల్ లుక్‌లో పరిచయం చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు, గ్రామీణ యువతిగా అనుపమ పరమేశ్వరన్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

రాఖీ పండుగను పురస్కరించుకుని ‘భోగి’ నుంచి రాఖీ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ స్పెషల్ పోస్టర్‌లో శర్వా పల్లెటూరి కుర్రాడి అవతార్ లో కనిపించారు. పోస్టర్‌లో పల్లెటూరి వాతావరణం, ఆత్మీయమైన కుటుంబ అనుబంధాలు ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. శర్వా తన తోబుట్టువులతో కలిసి కూర్చుని తాటికాయలను కొట్టి అందరికీ పంచుతూ కనిపించడం ప్రత్యేకంగా నిలిచింది. తోబుట్టువుల మధ్య ప్రేమ, అనుబంధంతో పాటు పల్లె జీవనశైలిని ప్రతిబింబించేలా ఈ పోస్టర్‌ను అందంగా డిజైన్ చేశారు. రాఖీ పండుగ స్ఫూర్తిని చూపించిన ఈ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంది.

ఈ సినిమాకు టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. సినిమాటోగ్రాఫర్ కిషోర్ కుమార్ క్లైమాక్స్‌ను అద్భుతమైన విజువల్స్‌తో తెరపై ఆవిష్కరిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో తన మాస్ బీజీఎమ్, ఎమోషనల్ స్కోర్‌తో యాక్షన్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేయనున్నారు.

అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం 1960 నేపథ్యంలో తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని ఓ ఫిక్షనల్ విలేజ్ లో సాగుతుంది. గ్రామీణ నేపథ్యం, బలమైన భావోద్వేగాలు, భారీ యాక్షన్ తో రూపొందుతున్న ‘భోగి’ ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించనుంది.

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘భోగి’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

నటీనటులు: ‘చార్మింగ్ స్టార్’ శర్వా, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: కె.కె. రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్య సాయి ఆర్ట్స్
సమర్పణ: లక్ష్మి రాధామోహన్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
DOP: కిషోర్ కుమార్ అరోకియా
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.