Skip to content

నిర్మాతల మండలికి క్షమాపణ తెలిపిన సుమలత

వివాదంపై క్లారిటీ ఇస్తూ ఫిలిం ఛాంబర్లోని నిర్మాతల మండలి హల్ లో జానీ మాస్టర్ భార్య సుమలత గారు, తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ గారు, వైవిఎస్ చౌదరి గారు అలాగే ఇతర కీలక వ్యక్తులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా…

జానీ మాస్టర్ భార్య సుమలత గారు మాట్లాడుతూ… “మా యూనియన్ లో జరిగిన అవకతవకలపై వివాదం మొదలయ్యాయి. మా యూనియన్ కు ఫెడెరేషన్ మాకు గొడవలు అయ్యాయి. మా సభ్యుడు నాన్ కొపరేషన్ అడగటం కోసం ఛాంబర్ మీటింగ్ వచ్చాం. పల్లి కేశవరావు పై దాడి జరగటం మనస్పూర్తిగా క్షమాపణాలు. ఛాంబర్ సభ్యులు ప్రతి ఒక్కరికీ సారీ చెబుతున్నాము. ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనీల్ గారికి క్షమాపణలు. వ్యక్తిగతంగా మాకు ఎలాంటి గొడవలు లేవు. అలానే ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో మీటింగ్ జరిగిన టైమ్ లో జరిగిన ఘటనలపై కూడా క్షమాపణలు కోరుతున్నాను. ఇకమీదట ఇలాంటివి రిపీట్ అవకుండా చూసుకుంటాము. బాలకృష్ణ గారి లాంటి పెద్దల వల్లే ఇండస్ట్రీ బాగుంది. వారి గురించి తప్పుగా మాట్లాడే అర్హత దైర్యం మాకు లేదు. నేను మాట అన్నందుకు బాధపడుతున్నాను. ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలన్నది తెలుసుకున్నాను. మా వివాదాన్ని పరిష్కరించమని చెప్పిన బాలయ్య బాబు కు కృతజ్ఞతలు
ఫెడరెషన్ తో కలిసి పని చేయాలనుకుంటున్నాము” అన్నారు.

తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ… “చిత్రపురి కి ఛాంబర్ కు కౌన్సిల్ కు ఎలాంటి సంబందం లేదు
ఫెడరేషన్ చాంబర్ కు కూడా కోర్డినేషన్ కమిటి ఉంటుంది, దాని వరకే సంబందం. ఏ యూనియన్ గొడవలను ఛాంబర్ కౌన్సిల్ చూడదు. ఫెడరెషన్ లోనే యూనియన్ లు ఉంటాయి. సుమలత ను రాంగ్ రూట్ లో తీసుకువెళ్లారు. నాడు దొమ్మి వాతావరణంలో ఛాంబర్ ఈసి మీటింగ్ లోకి వచ్చారు. అనీల్ పై చర్యలు తీసుకొవాలన్నారు, ఇలాంటివి మరలా జరిగితే ఉపేక్షించేది లేదు. ఛాంబర్ లో నాటి వివాదంపై, సభ్యులు దీనిపై చర్యలు తీసుకొవాలని నిర్ణయించారు. సుమలతకు సమస్య జటిలం అయింది. అందుకే చివరికి సుమలత తన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పారు. ఛాంబర్ కు, కౌన్సిల్ కి, ఫెడరెషన్, వ్యక్తిగతంగా అనీల్ గారికి కూడా సుమలత క్షమాపణలు తెలిపెందుకు ముందుకొచ్చారు. క్లోజ్ అయిపోయిందనుకున్న డాన్సర్స్ యూనియన్ వివాదం అనసరంగా మరలా రిపీట్ అయింది. జానీ టాలెంట్ కి స్కిల్స్ కు అవార్డులు రావచ్చు, కానీ అందరు కలిసికట్టుగా ముందుకువెళ్లాలి. ఇది జానీ సుమలత డాన్సర్స్ యూనియన్ గొడవ, ఇది పవన్ కల్యాణ్ జనసేన టిడిపి వైసిపి లకు సంబంధం లేదు. టీ కప్పులో తుఫాన్ లాంటి ఇష్యూ అని క్లోజ్ చేయమని, నాడు బాలయ్య బాబు చెప్పటం వల్లే చదలవాడ గారు, నేను ముందుకు వచ్చాము. ఈ వివాదంలో కొందరు తమ వ్యక్తిగత లబ్ది కోసం సుమలతను ముందుకు తోశారు. ఇప్పుడు సుమలత తెలుసుకుని వ్యక్తిగతంగా‌ క్షమాపణల లేటర్స్ రాశారు. డాన్సర్స్ యూనియన్ లోని వివాదాన్ని సుమలత వారి యూనియన్ లోనే పెడరేషన్ తో కలిసి తెల్చుకోవాలి. ఇకముందు ఛాంబర్ పై సభ్యులపై దాడులు లాంటివి చెస్తే ఐదెళ్ళ పాటు సహాయనిరాకరణ చేస్తాము” అన్నారు.

సెక్రటరీ వైవిఎస్ చౌదరి గారు మాట్లాడుతూ… “జానీ మాస్టర్ ప్రతిభావంతుడు. సమాఖ్య సంఘాల గౌరవం కాపాడాలి. వాటి పరిమితుల్లో ఉండి వర్క్ చేసుకొవాలి. జానీ ఎదుగుతోన్న టైమ్ లో హర్డిల్స్ వస్తున్నాయి. ఒక నిర్మాతగా, దర్శకుడిగా జానీ మాస్టర్ మరలా అడ్డంకులను తొలగించుకుని వారి వర్క్ చేసుకోవాలి. జానీ పాన్ ఇండియా లెవెల్ లో మంచి పాటలు చేస్తున్నారు” అన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.