‘భోగి’ భారీ క్లైమాక్స్ షెడ్యూల్ పూర్తి
'చార్మింగ్ స్టార్' శర్వా హీరోగా, 'మాస్ మావెరిక్' సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా 'భోగి'. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ,లక్ష్మి రాధామోహన్ సమర్పిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయి అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో అంచనాలను పెంచుతూనే ఉంది. శర్వాను ఇప్పటివరకు ఎప్పుడూ చూడని పవర్‌ఫుల్ లుక్‌లో పరిచయం చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు, గ్రామీణ యువతిగా అనుపమ పరమేశ్వరన్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా చిత్ర యూనిట్ భారీగా రూపొందించిన 22 రోజుల క్లైమాక్స్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రొడక్షన్ డిజైనర్ కిరణ్ కుమార్ మన్నె రూపొందించిన భారీ సెట్‌లో ఈ క్లైమాక్స్‌ను చిత్రీకరించారు. ఈ…
