Skip to content

‘భోగి’ భారీ క్లైమాక్స్ షెడ్యూల్ పూర్తి

‘చార్మింగ్ స్టార్’ శర్వా హీరోగా, ‘మాస్ మావెరిక్’ సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ,లక్ష్మి రాధామోహన్ సమర్పిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయి అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో అంచనాలను పెంచుతూనే ఉంది.

శర్వాను ఇప్పటివరకు ఎప్పుడూ చూడని పవర్‌ఫుల్ లుక్‌లో పరిచయం చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు, గ్రామీణ యువతిగా అనుపమ పరమేశ్వరన్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా చిత్ర యూనిట్ భారీగా రూపొందించిన 22 రోజుల క్లైమాక్స్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.

ప్రొడక్షన్ డిజైనర్ కిరణ్ కుమార్ మన్నె రూపొందించిన భారీ సెట్‌లో ఈ క్లైమాక్స్‌ను చిత్రీకరించారు. ఈ ఒక్క షెడ్యూల్ కోసం దాదాపు మూడు నెలల పాటు ప్రత్యేకంగా ప్రీ-ప్రొడక్షన్ పనులు నిర్వహించడం, మేకర్స్ ఈ సినిమాను ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారో తెలియజేస్తోంది.

భారీ యాక్షన్ ఎపిసోడ్‌లో 800 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. ప్రతి ఫ్రేమ్‌ను అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందించేందుకు నిర్మాత కేకే రాధామోహన్ ఎలాంటి రాజీ పడకుండా ఖర్చు పెట్టారు.

ఈ క్లైమాక్స్‌కు ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ ధిలీప్ సుబ్బరాయన్ యాక్షన్‌ను డిజైన్ చేశారు. థియేటర్లలో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ ఇచ్చే స్థాయిలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుంది. సినిమాలో ‘గంగ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్న శర్వా తన కెరీర్‌లోనే గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ పాత్ర కోసం ప్రతిరోజూ రెండున్నర గంటలకు పైగా ప్రత్యేక మేకప్ వేసుకోవడం, షూటింగ్ అనంతరం మరో గంటపాటు మేకప్ తొలగించే టఫ్ ప్రాసెస్ ను ఆయన పూర్తి అంకితభావంతో చేశారు. శర్వా ట్రాన్స్‌ఫర్మేషన్, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.

సినిమాకు టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. సినిమాటోగ్రాఫర్ కిషోర్ కుమార్ క్లైమాక్స్‌ను అద్భుతమైన విజువల్స్‌తో తెరపై ఆవిష్కరిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో తన మాస్ బీజీఎమ్, ఎమోషనల్ స్కోర్‌తో యాక్షన్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేయనున్నారు.

అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం 1960 నేపథ్యంలో తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని ఓ ఫిక్షనల్ విలేజ్ లో సాగుతుంది. గ్రామీణ నేపథ్యం, బలమైన భావోద్వేగాలు, భారీ యాక్షన్ తో రూపొందుతున్న ‘భోగి’ ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించనుంది.

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘భోగి’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. భారీ క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తవడంతో, శర్వా కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రంగా ‘భోగి’ నిలుస్తుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.

నటీనటులు: ‘చార్మింగ్ స్టార్’ శర్వా, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: కె.కె. రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్య సాయి ఆర్ట్స్
సమర్పణ: లక్ష్మి రాధామోహన్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
DOP: కిషోర్ కుమార్ అరోకియా
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.