‘భోగి’ సినిమాతో శర్వానంద్ గారికి నేషనల్ అవార్డు రావాలి: డైరెక్టర్ సంపత్ నంది చార్మింగ్ స్టార్…
డిసెంబర్ 11న విడుదల కానున్న ‘ది బ్రేకింగ్ న్యూస్’
తెలుగు సినిమా ‘ది బ్రేకింగ్ న్యూస్’ డిసెంబర్ 11, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత రెడ్డి, ఉమా గుటూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పవన్ కడియాల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మురళీ మోహన్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించగా, సోనియా నాయుడు, ఆర్.కె. నాయుడు, వాసుదేవ్, ప్రేమ్ కృష్ణ, రవి ప్రకాష్, వాహిని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మీడియా రంగం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆసక్తికరమైన థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. వార్తా ప్రపంచంలోని పరిణామాలు, మీడియా నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా రూపొందింది.
ఈ చిత్ర ప్రారంభోత్సవం మరియు ఫస్ట్ లుక్‌ను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించగా, నవంబర్ 20న టాలీవుడ్ నటుడు సుమంత్ ట్రైలర్‌ను విడుదల చేశారు. విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటూ, సోషల్ మీడియాలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
ఆసక్తికరమైన కథాంశం, మీడియా నేపథ్యం, ప్రతిభావంతులైన నటీనటులతో రూపొందిన ‘ది బ్రేకింగ్ న్యూస్’ డిసెంబర్ 11, 2026న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
నటీనటులు
మురళీ మోహన్, అనన్య నాగళ్ల, సోనియా నాయుడు, ఆర్.కె. నాయుడు, వాసుదేవ్, ప్రేమ్ కృష్ణ, రవి ప్రకాష్, వాహిని తదితరులు.
సాంకేతిక బృందం
* రచన – దర్శకత్వం: పవన్ కడియాల
* నిర్మాతలు: హనుమంత రెడ్డి, ఉమా గుటూర్
* బ్యానర్: ఓపెన్ స్కై క్రియేషన్స్
* సంగీత దర్శకుడు: శశి ప్రీతమ్
* ఛాయాగ్రహణం: సైనాథ్
* ఎడిటర్: శిరీష్ ప్రసాద్
* చీఫ్ అసోసియేట్ డైరెక్టర్: బి.ఎన్. గణేష్ భట్
* అసోసియేట్ డైరెక్టర్స్: సంజీవ్ ధరణి, సాయి యోగేష్
* సౌండ్ డిజైనర్: జి. పురుషోత్తం రాజు
* సహ నిర్మాతలు: రేఖ బైరి, నరేన్ కె
* ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమణ రెడ్డి తాటిరెడ్డి
* అసోసియేట్ ఎడిటర్: శ్రీనివాస్ శాములేటి
* ఆడియో హక్కులు: మధుర ఆడియో
* క్రియేటివ్ టీమ్: రాకేష్ పట్వారీ, రోహిన్ ఏటూరి, అర్చన టి.ఎన్.
* పబ్లిసిటీ డిజైనర్: మిట్టు అరెట్టి
* ఫిల్మ్ వీడియో ఎడిటర్: లూర్డు
* పీఆర్వో: వీరబాబు



