నా జీవితం ఒక తెల్లకాగితం ఎక్కడా ఒక మచ్చ కూడా పడనివ్వను- మురళీమోహన్
ఆ నలుగురి వల్లే నేను ఇంత అభివృద్ధి అయ్యాను మాగంటి మురళీ మోహన్ ... తెలుగు రాష్ట్రాల్లో ఆ పేరు తెలియని వారుండరు. ఆయన అసలు పేరు రాజాబాబు. కానీ మురళీ మోహన్ గానే ప్రేక్షకులకు పరిచయం..ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ఆయన తనదైన ముద్ర వేశారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సందేశాత్మక చిత్రాలను అందించారు. 'జగమే మాయ' చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన మురళీ మోహన్, క్రమశిక్షణ గల నటుడిగా పేరు తెచ్చుకుని 350కి పైగా సినిమాల్లో నటించారు. చిత్ర రంగానికి ఆయన చేసిన సేవలకు గాను ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.. హీరోగా ,సహాయ నటుడిగా రాణించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు…
