Skip to content

అడివి శేష్ చేతుల మీదుగా ‘అ’ ఫస్ట్ లుక్ విడుదల

రాహుల్ విజయ్ ఇంటెన్స్ అవతార్‌తో ఆకట్టుకుంటున్న థ్రిల్లర్!

ప్యాషనేట్ ప్రొడక్షన్ హౌస్‌లు స్టార్ బాక్స్ స్టోరీస్, రిప్పుల్ స్లైడ్ స్టూడియోస్ తొలిసారిగా ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కనకరావు తొనంగి, అభిషేక్ , ప్రముఖ ఎడిటర్-డైరెక్టర్ గ్యారీ BH నిర్మిస్తున్నారు. సాయి బాలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మోస్ట్ అవైటెడ్ టైటిల్, ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేయడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

ఈ చిత్రానికి ‘అ’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను హిట్ మెషీన్ అడివి శేష్ ఆవిష్కరించారు. టైటిల్‌ను ఇంట్రెస్టింగ్‌గా ప్రజెంట్ చేయడంతో విడుదలైన వెంటనే అందరి దృష్టిని ఆకర్షించింది. టైటిల్ చుట్టూ ‘అమ్మాయి, అదృశ్యం, అన్వేషణ’ అనే పదాలను పొందుపరిచారు. అమ్మాయిలు అదృశ్యం కావడం, ఆ తర్వాత జరిగే దర్యాప్తు చుట్టూ కథ తిరుగుతుందని ఈ పదాలు సూచిస్తున్నాయి. ఇక ‘అనుమానం, అసాంఘికం, అమానుషం’ వంటి పదాలు కథలో కనిపించేదానికంటే మరింత ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయనే క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

ఆలోచింపజేసే పదాలతో రూపొందించిన ఈ ఇంట్రెస్టింగ్ టైటిల్ డిజైన్ విడుదలకు ముందే సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇక ఫస్ట్ లుక్ ఈ క్యూరియాసిటీని మరింత పెంచింది. రాహుల్ విజయ్ ఓ ప్రదేశంలో చేతిలో లాఠీ పట్టుకుని కూర్చుని కనిపిస్తున్నారు. ఆయన చుట్టూ నేలంతా రక్తపు మరకలతో కనిపిస్తోంది. ఈ ఇంటెన్స్ విజువల్‌కు బ్యాక్‌గ్రౌండ్‌లో చార్మినార్ కనిపించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో ఈ థ్రిల్లర్ కథ హైదరాబాద్ నేపథ్యంగా సాగుతుందని అర్థమవుతోంది.

రాహుల్ విజయ్ స్ట్రైకింగ్ లుక్, ఫస్ట్ లుక్‌లో కనిపిస్తున్న డార్క్ అండ్ సస్పెన్స్‌ఫుల్ వాతావరణం సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. అర్చన అయ్యర్ రాహుల్ విజయ్ సరసన కథానాయికగా నటిస్తున్నారు. సాయి బాలి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. అభినవ్ వి. కునపరెడ్డి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూ ఎడిటింగ్ బాధ్యతలను గ్యారీ BHతో కలిసి నిర్వహిస్తున్నారు.

ఇంట్రెస్టింగ్ టైటిల్, క్యూరియాసిటీని పెంచే టైటిల్ డిజైన్, ఆకట్టుకునే ఫస్ట్ లుక్‌తో పాటు సాధారణ మిస్సింగ్ గర్ల్స్ థ్రిల్లర్‌కు భిన్నంగా, వైవిధ్యమైన కథ, కథనాలతో మరింత లోతైన కథను చెప్పబోతున్నట్లు ‘అ’ ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తోంది. మిస్టరీ, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్‌తో పాటు ఫస్ట్ లుక్ ద్వారా పరిచయం చేసిన ఇంటెన్స్ విజువల్ వరల్డ్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. త్వరలోనే ‘అ’ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ ఆసక్తికరమైన థ్రిల్లర్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నటీనటులు: రాహుల్ విజయ్, అర్చన అయ్యర్, జాన్ విజయ్, సుధర్శన్, మిర్చి కిరణ్, బిత్తిరి సత్తి, దయానంద్ రెడ్డి.

సాంకేతిక బృందం:
దర్శకుడు: సాయి బాలి
నిర్మాతలు: కనకరావు తొనంగి, అభిషేక్, గ్యారీ BH
బ్యానర్లు: స్టార్ బాక్స్ స్టోరీస్, రిప్పుల్ స్లైడ్ స్టూడియోస్
కో-ప్రొడ్యూసర్: అభినవ్ వి. కునపరెడ్డి
సంగీత దర్శకుడు: శ్రీచరణ్ పాకాల
డీఓపీ: మోనిష్ భూపతి రాజు
ఎడిటర్లు: అభినవ్ వి. కునపరెడ్డి, గ్యారీ BH
డీఐ: సారథి స్టూడియోస్
వీఎఫ్‌ఎక్స్: జాయింట్ ఫ్యామిలీ ఫిల్మ్స్
పీఆర్వో: మడూరి మధు – ధీరజ్ -ప్రసాద్
డిజిటల్ మీడియా: విష్ణు తేజ్ పుట్టా

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.