Skip to content

‘రాజిగాడు రాజయ్యాడు’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

“బట్టల రామస్వామి బయోపిక్కు” సినిమా ద్వారా తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అల్తాఫ్ హసన్. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తూ “రాజిగాడు రాజయ్యాడు” అనే కొత్త చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను శర్మాస్ ఫిలింస్ బ్యానర్ పై బత్తుల పర్విన్, మనోజ్ అర్రోల, చిన్ని నిర్మిస్తున్నారు. “రాజిగాడు రాజయ్యాడు” మూవీలో అను శ్రీ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రముఖ కవి, గాయకుడు డా. గోరటి వెంకన్న కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ రోజు “రాజిగాడు రాజయ్యాడు” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉందో చూస్తే – ఒక గఢీ బయట ఒంటిపై గాయాలతో ఒక పంది పిల్లను చేతిలో పట్టుకుని కుర్చీలో హీరో కూర్చుని ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. అలాగే చుట్టుపక్కల కుల వృత్తులకు సంబంధించిన పని ముట్లు ఉండటం ఆలోచన రేకెత్తిస్తుంది . ఆ పెద్ద గఢీ లోని వారికి హీరోకు ఉన్న సంబంధం ఏంటి ?, పంది పిల్లను ఆయన ఎందుకు చేతిలో పట్టుకుని ఉన్నారు ?, ఆయన ఒంటిపై గాయాలకు, గొడవలకు కారణం ఏంటి ? వంటి అంశాలతో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. సినిమా టైటిల్ లోనే మంచి నేటివిటీ కనిపిస్తోంది. రాజిగాడు ఎవరు ఎలా రాజయ్యాడు అనేది సినిమాలో చూడాల్సిందే.

నటీనటులు – అల్తాఫ్ హసన్, అను శ్రీ, డా. గోరటి వెంకన్న, గీతా అగర్వాల్, రాజేంద్ర మోహన్ నను, శ్రీవర్ధన్ త్రివేది, సుజాత దీక్షిత్, గోవర్ధన్ రెడ్డి, సంజయ్ గౌడ్, డా. శివకుమార్ కాముని, తదితరులు

టెక్నీషియన్స్
——————-
ప్రొడ్యూసర్స్ – బత్తుల పర్విన్, మనోజ్ అర్రోల, చిన్ని
డైరెక్టర్ – అల్తాఫ్ హసన్
స్టోరీ రైటర్ – డా. విజయ్ భాస్కర్
స్క్రిప్ట్ అనలిస్ట్ – కైలాష్ బాలన్
అసోసియేట్ స్క్రీన్ రైటర్స్ – కమల్ నభ్, అనిల్ గొడుగుల, ప్రొ. శ్రీపర్తి రాముడు
డైలాగ్ రైటర్ – రమేష్ సామల
మ్యూజిక్ డైరెక్టర్ – జగదీశ్ సత్యన్
ఎడిటర్ – ఎ. సతీష్ రాజా
డీవోపీ – పి. మణికర్ణన్
ఆర్ట్ డైరెక్టర్ – సాయి కధిర
కాస్ట్యూమ్ డిజైనర్ – శ్రీకాంత్ కనగండ్ల
యాక్షన్ కొరియోగ్రాఫర్ – వెంకట నదురి
పబ్లిసిటీ డిజైన్ – ధని ఏలే
పీఆర్ఓ – గాండ్ల శ్రీనివాస్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.