AI ఆధారిత డీప్ఫేక్లు, డిజిటల్ వ్యక్తిత్వ దుర్వినియోగం, అనుమతి లేకుండా కళాకారుల ముఖం, గొంతు, సృజనాత్మక…
ఘనంగా జరిగిన తేజ సజ్జా, మౌర్య నిశ్చితార్థం

యంగ్ సెన్సేషన్, సూపర్ హీరో తేజ సజ్జా, మౌర్య నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుక హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, రాజకీయ ప్రముఖులు, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు స్టార్స్ సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుక సినీ, రాజకీయ ప్రముఖుల రాకతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ ప్రత్యేక వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మంత్రి సీతక్క, హరీశ్ రావు, గంటా శ్రీనివాసరావు తదితర ప్రముఖులు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు.
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. లెజెండరీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, టీజీ విశ్వప్రసాద్, సుస్మిత కొణిదెల, సాహు గారపాటి, వెంకట్ బోయనపల్లి, నటులు శ్రీకాంత్, రవితేజ, నాని, రానా దగ్గుబాటి, అడివి శేష్, సుధీర్ బాబు, వరలక్ష్మి శరత్ కుమార్, నిధి అగర్వాల్, నిహారిక కొణిదెల, రితికా నాయక్, ఇమాన్వి ఈ వేడుకలో పాల్గొన్నారు.
అలాగే ప్రముఖ దర్శకులు బి. గోపాల్, అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, శివ నిర్వాణ, నందినీ రెడ్డి, కార్తీక్ ఘట్టమనేని, మారుతి, చందూ మొండేటి, శైలేష్ కొలను, బీవీఎస్ రవి తదితరులు హాజరై తేజ సజ్జా, మౌర్యలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆనందం, ప్రేమ, ఆప్యాయతల మధ్య తేజ సజ్జా, మౌర్య తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. డిసెంబర్‌లో డెస్టినేషన్ వివాహం జరగనుంది.

