Skip to content

అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘ఓ..! సుకుమారి’ హిలేరియస్ థియేట్రికల్ ట్రైలర్‌

టీజర్, ఫస్ట్ సింగిల్‌తో అంచనాలను పెంచిన ‘ఓ..! సుకుమారి’ ఇప్పుడు గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. తిరు వీర్, ఐశ్వర్య రాజేష్‌ కలసి నటిస్తున్న ఈ చిత్రం, రొమాన్స్, కామెడీ, పల్లెటూరి అందాలతో కంప్లీట్ వినోదాన్ని అందిస్తుందని వాగ్దానం చేస్తోంది. భరత్ దర్శన్ రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని, ‘శివం భాజే’ విజయం తర్వాత గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఈరోజు, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

దామిని గురించి ఊరంతా భయపడుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే… ఆమెను ఎవరైనా తాకితే వారికి కరెంట్ షాక్ తగులుతుంది. ఈ విచిత్రమైన రహస్యాన్ని దాచిపెట్టి ఆమెకు హీరోతో పెళ్లి చేస్తారు. పెళ్లి తర్వాత అసలు విషయం తెలిసిన హీరో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? ఈ సమస్యను భార్యాభర్తలు కలిసి ఎలా ఎదుర్కొన్నారు? చివరకు వారి జీవితంలో ప్రేమ, ఆనందం ఎలా చోటుచేసుకున్నాయి? అన్నదే సినిమా ప్రధాన కథాంశం.

దర్శకుడు భరత్ దర్శన్ ఈ విభిన్నమైన కాన్సెప్ట్‌ను వినోదాత్మకంగా చూపిస్తూ, ఎమోషన్స్‌ను చక్కగా మేళవించినట్లు ట్రైలర్ ప్రజెంట్ చేస్తోంది.

తిరు వీర్ మరోసారి కొత్త తరహా కథను ఎంచుకుని, అమాయకమైన పల్లెటూరి యువకుడి పాత్రలో సహజంగా కనిపించారు. ఐశ్వర్య రాజేష్ కూడా తన పాత్రలో ఆకట్టుకుంటూ, అందం, నటన రెండింటిలో అలరించారు. మురళీధర్ గౌడ్, విష్ణు ఓయ్, ఝాన్సీ, ఆమని, ఆనంద్‌కోట జయరామ్ తదితరులు తమ పాత్రలతో వినోదాన్ని మరింత పెంచారు.

సినిమాటోగ్రాఫర్ సీహెచ్ కుషేందర్ పల్లెటూరి అందాలను అందంగా చూపించారు. భరత్ మంచిరాజు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మంచి ఎనర్జీని తీసుకొచ్చింది. ‘బలగం’ ఫేమ్ తిరుమల ఎం. తిరుపతి ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేయగా, శ్రీ వరప్రసాద్ ఎడిటింగ్ నిర్వహించారు. అను రెడ్డి అక్కటి కాస్ట్యూమ్స్ డిజైన్ చేయగా, పూర్ణాచారి పాటలకు సాహిత్యం అందించారు.

‘ఓ..! సుకుమారి’ ట్రైలర్ కామెడీ, ప్రేమ, భావోద్వేగాలను కలిపిన వినోదాత్మక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమాపై అంచనాలను పెంచింది. ఈ చిత్రం జూలై 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తారాగణం: తిరు వీర్, ఐశ్వర్య రాజేష్, మురళీధర్ గౌడ్, విష్ణు ఓయి (మ్యాడ్ ఫేమ్), ఝాన్సీ, ఆమని, ఆనందకోట జయరామ్

సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: మహేశ్వర రెడ్డి మూలి
దర్శకత్వం: భరత్ దర్శన్
డీవోపీ: CH కుషేందర్
సంగీతం: భరత్ మంచిరాజు
ఆర్ట్ డైరెక్టర్: తిరుమల ఎం తిరుపతి
ఎడిటర్: శ్రీ వరప్రసాద్
కాస్ట్యూమ్ డిజైనర్: అను రెడ్డి అక్కటి
లిరిక్ రైటర్: పూర్ణాచారి
ఫైట్స్: అంజి
కొరియోగ్రఫీ: జెడి మాస్టర్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.