‘మహేంద్రగిరి వారాహి’ సినిమా అద్భుతంగా వచ్చింది : నిర్మాత మధు కలిపు
సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్. ‘మహేంద్రగిరి వారాహి’. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత మధు కలిపు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీ సినీ ప్రయాణం గురించి చెప్పండి? -నాకు ముందేం సినిమా నేపథ్యం లేదు. దర్శకుడు శేఖర్ కమ్ముల గారితో 'హ్యాపీడేస్' సమయం నుంచి పరిచయం ఉంది. అలాగే…
