Skip to content

నాగ చైతన్య లాంచ్ చేసిన ది రేజ్ ఆఫ్ వారాహి సాంగ్

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే ఈ కథలో ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచాయి.

తాజాగా యువ సామ్రాట్ నాగ చైతన్య ‘ది రేజ్ ఆఫ్ వారాహి’ సాంగ్ ని లాంచ్ చేశారు. అనూప్ రూబెన్స్ కంపోజిషన్ పాటకు ఇంపాక్ట్ తీసుకొచ్చింది. కడలి సత్యనారాయణ రాసిన లిరిక్స్ పవర్‌ఫుల్ గా ఉన్నాయి. నకాష్ అజీజ్ వోకల్స్ ఎనర్జిటిక్ గా ఉన్నాయి. ఈ పాట కథ, వారాహి అమ్మవారి శక్తి, సినిమాలోని ఇంటెన్స్ వరల్డ్‌ను అద్భుతంగా ఎలివేట్ చేసింది.

ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం సెప్టెంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది

నటీనటులు: సుమంత్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ.

సాంకేతిక బృందం:
దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి
నిర్మాతలు: కలిపు మధు, లక్ష్మణ్
నిర్మాణ సంస్థలు: రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిల్మ్స్
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రాఫర్: ప్రతాప్ ఆర్ కృష్ణ
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ
ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ ఆర్ట్స్
పి.ఆర్.ఓ : వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.