Skip to content

“చంద్రయాన్” సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్

త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న హిలేరియస్ అడ్వెంచర్ మూవీ

రాజు వెడ్స్ రాంబాయి సూపర్ హిట్ తర్వాత నిర్మాత వేణు ఊడుగుల తన సమర్పణలో “చంద్రయాన్” టైటిల్ తో మరో ఇంట్రెస్టింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్ పై ప్రవీణ్ మొలక నిర్మిస్తున్నారు. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. హిలేరియస్ అడ్వెంచర్ స్టోరీతో తెరకెక్కిన “చంద్రయాన్” సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

ఈ రోజు మేకర్స్ ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. మందమర్రి అనే ఊరిలోని ముగ్గురు యువకులు బైక్ టైర్లు, కుక్కర్, డంబెల్..ఇలా తమకు దొరికిన వస్తువులతో సొంతంగా మా ఊరి రాకెట్ తయారు చేసుకుని చందమామ దగ్గరకు వెళ్లడం ఈ మోషన్ పోస్టర్ లో ఆసక్తి కలిగిస్తోంది. ముగ్గురు యువకుల చంద్రయాన్ యాత్రను ఎందుకు చేపట్టారు. ఈ సాహసం చేయడం వెనక కారణాలు ఏంటి, శాస్త్రవేత్తలకే సవాలు విసిరే చంద్రయాన్ లో ఈ ముగ్గురు యువకులు విజయం సాధించారా లేదా వంటి అంశాలతో మోషన్ పోస్టర్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఈ మోషన్ పోస్టర్ కు హర్ష ప్రవీణ్ కంపోజిషన్ లో శ్రీనాథ్ చంద్రశేఖర్ సాహిత్యాన్ని అందించగా కనకవ్వ, శ్రీనిజ భడూరి, లాస్య పాడిన రామ రామ రామ ఉయ్యాలో పాట మరింత ఆకర్షణను తీసుకొచ్చింది.

మనవైన కథలు టాలీవుడ్ బాక్సాఫీస్ మీద జెండా ఎగరేస్తున్న ప్రస్తుత ట్రెండ్ లో మరో లోకల్ కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు “చంద్రయాన్” సినిమా రెడీ అవుతోంది.

నటీనటులు – శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ, తదితరులు

టెక్నీషియన్స్
—————
కాస్ట్యూమ్ డిజైనర్ – శశి కోసూరి
ఎడిటర్ – పుల్లారావు దాసరి
ప్రొడక్షన్ డిజైనర్స్ – శ్రీధర్ మేస్త్రి, మందర్ పస్నేకర్
డీవోపీ – శ్రీనివాస. బి.
మ్యూజిక్ – హర్ష ప్రవీణ్
సమర్పణ – వేణు ఊడుగుల
ప్రొడ్యూసర్ – ప్రవీణ్ మొలక
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ – శ్రీనాథ్ చంద్రశేఖర్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.