‘మహేంద్రగిరి వారాహి’కి గ్రౌండ్ లెవల్ లో అద్భుతమైన రెస్పాన్స్ ఉంది: హీరో సుమంత్
హీరో సుమంత్ డివైన్ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్. ‘మహేంద్రగిరి వారాహి’. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ప్రత్యేక పాత్రలో నటించారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మించారు. సెప్టెంబర్ 11న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ డివైన్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో సుమంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చాలా కాలంగా కొంతమంది ఇండస్ట్రీ పీపుల్, అలాగే నా ఫ్యాన్స్ నుంచి విషెస్ అందుకోలేదు. నిన్నటి నుంచి ఆ అభినందనలు మొదలయ్యాయి. ‘మహేంద్రగిరి వారాహి’ని గురించి ప్రేక్షకులు, అభిమానులు…
