రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కు రాఖీ కట్టి పండుగ సెలబ్రేట్ చేశారు…
మహేంద్రగిరి వారాహి సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది: డైరెక్టర్ వెంకీ అట్లూరి
- మహేంద్రగిరి వారాహి పై నాకు చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని సెప్టెంబర్ 11న థియేటర్లలో చూస్తారు: హీరో సుమంత్
- సుమంత్, సిద్దు జొన్నలగడ్డ, సంతోష్ జాగర్లపూడి, లక్ష్మణ్, కలిపు మధు, రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ & బ్రిడ్జ్ ఫిల్మ్స్ ‘మహేంద్రగిరి వారాహి’ ట్రైలర్ లాంచ్
- ‘మహేంద్రగిరి వరాహి’ ట్రైలర్ లో సర్‌ప్రైజ్ చేసిన స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ
హీరో సుమంత్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఆధ్యాత్మిక మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. మహేంద్రగిరి పర్వతాల నేపథ్యంతో, వారాహి మాత దైవశక్తి చుట్టూ అల్లుకున్న ఆసక్తికరమైన కథతో రూపొందుతోంది. సంతోష్ జగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై లక్ష్మణ్, కలిపు మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
వారాహి మాత వారణాసి గ్రామదేవతగా పూజలందుకుంటుందని, పరమశివుడి ఆజ్ఞతో మహేంద్రగిరిలో కొలువుదీరిన అమ్మవారిగా కథలో చూపించారు. 150 ఏళ్లుగా మహేంద్రగిరి రాజకుటుంబానికి చెందినవారు వరుసగా మరణిస్తుంటారు. ఈ మరణాలన్నీ వారాహి మాత శాపం కారణంగానే జరుగుతున్నాయని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. ఈ శాపాన్ని ఛేదించి, వరుస మరణాల వెనుక ఉన్న అసలు నిజాన్ని తెలుసుకునేందుకు హీరో దైవశక్తినే ఎదుర్కొనే సాహసం చేస్తాడు.
ట్రైలర్ ద్వారా తొలిసారి కథలోని ప్రధాన అంశాన్ని మేకర్స్ రివీల్ చేశారు. భక్తి, విశ్వాసం, మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలను మేళవించిన కథనం ఆసక్తిని పెంచుతోంది. ఒకవైపు దైవశక్తిపై విశ్వాసం, మరోవైపు ఆ నమ్మకం వెనుక ఉన్న నిజాన్ని అన్వేషించే ప్రయత్నం మధ్య సంఘర్షణను ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. దర్శకుడు సంతోష్ జగర్లపూడి ఆధ్యాత్మిక అంశాలతో పాటు థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను చక్కగా బ్యాలెన్స్ చేశారు.
సుమంత్ తన పాత్రలో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. పాత్రలోని ఇంటెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. ఐశ్వర్య రాజేష్ వారాహి మాత పాత్రలో కనిపించనుండగా, సిద్ధు జొన్నలగడ్డ కీలకమైన పాత్రలో సర్‌ప్రైజ్ ఇచ్చారు. మినాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
టెక్నికల్‌గా ‘మహేంద్రగిరి వారాహి’ భారీ స్థాయిలో కనిపిస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ కృష్ణ ఆర్ట్స్ రూపొందించిన సెట్స్, పీరియాడికల్, ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకొచ్చాయి. సినిమాటోగ్రాఫర్ ప్రతాప్ ఆర్ కృష్ణా మహేంద్రగిరి ప్రాంతంలోని మిస్టీరియస్ ల్యాండ్‌స్కేప్‌ను, కథలోని కీలక ఘట్టాలను అద్భుతంగా చిత్రీకరించారు. అనూప్ రూబెన్స్ సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ట్రైలర్‌లోని ఉత్కంఠను మరింత పెంచింది. జునైద్ సిద్ధిఖీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ నిర్మాణ విలువలు ట్రైలర్‌లో అద్భుతంగా వున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, భారీ విజువల్స్, ఆధ్యాత్మిక అంశాలు, మిస్టరీతో కూడిన కథనం సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ‘మహేంద్రగిరి వారాహి’ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. భక్తి, మిస్టరీ, థ్రిల్‌ను కలగలిపిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా విచ్చేసిన డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అనూప్ గారి మ్యూజిక్‌కి నేను ఫ్యాన్‌ని. లక్ష్మణ్ గారు ఎక్కడుంటే అక్కడ డబ్బు ఉంటుంది. ఆయనది లక్కీ హ్యాండ్. ఈ సినిమా కూడా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. గత కొన్ని నెలలుగా ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. సినిమాలకు చాలా మంచి రన్ ఇస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. అదే కంటిన్యూ అవుతూ ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా కూడా అంతే పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ప్రతి డివైన్ సినిమా మన కల్చర్‌ని చెబుతుంది. మన కల్చర్‌తో ఏ సినిమా వచ్చినా మనం సపోర్ట్ చేయాలి, దాని నుంచి నేర్చుకోవాలి. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఇలాంటి సబ్జెక్ట్‌ని తీసుకున్న డైరెక్టర్ సంతోష్‌కి కంగ్రాజులేషన్స్. ట్రైలర్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా సుమంత్ అన్నకి ‘గోదావరి’ కంటే చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. ఇంకా ఎక్కువ పేరు రావాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీలో సుమంత్ అన్న లాంటి జెన్యుస్ వ్యక్తిని చూడలేదు. సార్ సినిమాలో తనతో నాలుగైదు రోజులు పనిచేశాను. అప్పటినుంచి నేను ఏదైనా రాసినా ముందు సుమంత్ అన్న దగ్గరకు తీసుకెళ్తాను. ఆయన సూచనలు, ఎంపికలు, ఆయన గురి చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఆయనకి ఈ సినిమా మీద నమ్మకం ఉందంటే కచ్చితంగా హిట్ అవుతుంది. సుమంత్ అన్నతో మళ్లీ పనిచేయాలని ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.
హీరో సుమంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ట్రైలర్ మీ అందరికీ నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా టీజర్ ఇప్పటికే చాలా వైరల్ అయింది. దానికంటే పది రెట్లు ఈ ట్రైలర్ మా సినిమాని ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నాను. ‘సుబ్రహ్మణ్యపురం’ తర్వాత డైరెక్టర్ సంతోష్‌తో ఇది నా రెండో సినిమా. ఈ సినిమా దాదాపు మూడేళ్ల జర్నీ. ఇది చాలా పెద్ద బడ్జెట్‌లో, పెద్ద స్థాయిలో తీయాల్సిన సినిమా. అలాంటి సమయంలో మా నిర్మాతలు మధు గారు, లక్ష్మణ్ గారు ముందుకు వచ్చారు. సినిమాని చాలా అద్భుతంగా తీశారు. ప్రేక్షకులందరి సపోర్ట్ కావాలి. ఈ సినిమా మీద నాకు చాలా మంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకం మీకు కూడా ఈ ట్రైలర్ ద్వారా కలిగిందని ఆశిస్తున్నాను. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ‘సార్’ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేశాను. తను వరుసగా హ్యాట్రిక్ సాధించాడు. చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో మా డీజే టిల్లు కూడా ఉన్నాడు. ఫస్ట్ టైమ్ మేము ట్రైలర్‌లో రివీల్ చేశాము. తను చాలా కీలకమైన పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా సిద్ధుకి థాంక్యూ. ఈ సినిమా మీద నాకు బలమైన నమ్మకం ఉంది. సెప్టెంబర్ 11న ఆ నమ్మకాన్ని మీరు చూడబోతున్నారు.
డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసిన వెంకీ అట్లూరి గారికి థాంక్యూ. ఆయన చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ కావడం చాలా ఆనందంగా ఉంది. మేమందరం ఒక టీమ్ వర్క్‌లా చేశాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకు కృతజ్ఞతలు. నాపై ఇంత నమ్మకం ఉంచిన మా హీరో సుమంత్ గారికి థాంక్యూ. ఈ సినిమాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా కచ్చితంగా థియేటర్లలో చాలా అద్భుతమైన అనుభూతిని అందించబోతుంది.
నిర్మాత మధు మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసిన వెంకీ అట్లూరి గారికి థాంక్యూ సో మచ్. ట్రైలర్ చూసిన తర్వాత మాకు మరింత గొప్ప విశ్వాసం కలిగింది. డైరెక్టర్ గారు చాలా ప్యాషన్‌తో పనిచేశారు.
ఈ ప్రయాణంలో వారాహి అమ్మవారు మాతోనే ఉన్నారని మా విశ్వాసం. ఒక తెలియని ఎనర్జీ మాతో ఉంది. షూటింగ్ సమయంలో ఎన్నో మిరాకిల్స్ జరుగుతుండేవి. మేము వాటిని ఎక్స్‌పీరియన్స్ చేశాం.
సెప్టెంబర్ 11న సినిమా రిలీజ్ అవుతుంది. మీ అందరి ఆశీస్సులతో సినిమా చాలా అద్భుతమైన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. చాలా గ్రాండ్‌గా చేయబోతున్నాం.
అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. సంతోష్ చాలా ప్యాషన్ ఉన్న డైరెక్టర్. సినిమాని అద్భుతంగా తీశాడు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇది థియేటర్లలో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన సినిమా. సుమంత్ గారు ఒక కథను ఎంచుకున్నారు అంటే కచ్చితంగా అది చాలా కొత్తగా ఉంటుంది. మా నిర్మాతలు నాకు చాలా సపోర్ట్ చేశారు. సెప్టెంబర్ 11న సినిమా వస్తుంది. తప్పకుండా అందరూ థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను.
మీనాక్షి గోస్వామి మాట్లాడుతూ.. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 11న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. అందరూ సినిమా చూసి సపోర్ట్ చేయండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’అన్నారు. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.
తారాగణం: సుమంత్, ఐశ్వర్య రాజేష్, సిద్దు జోనలగడ్డ, మీనాక్షి గోస్వామి, మాల్విక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ.
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి
నిర్మాతలు: లక్ష్మణ్, కలిపు మధు
ప్రొడక్షన్ బ్యానర్స్: రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిల్మ్స్
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రాఫర్: ప్రతాప్ ఆర్ కృష్ణ
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ
ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ ఆర్ట్స్
PRO: వంశీ-శేఖర్

