Skip to content

మూడు రోజుల్లో రూ.13 కోట్ల తో దూసుకుపోతోన్న ‘ఓం చాప్టర్ 1 – రుధిరం’

జాతీయ అవార్డు గ్రహీత ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల నటించిన పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘ఓం చాప్టర్ 1 – రుధిరం: ది బ్లడ్ వుడ్’ తెలుగు వర్షెన్ బాక్సాఫీస్‌ వద్ద సంచలనాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ.13 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసి తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి తెలుగు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఆసక్తికరమైన కథాంశం, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, ఆర్టిస్టుల అద్భుతమైన పర్ఫామెన్స్ ప్రధానాంశాలుగా అభిమానులు, ప్రేక్ష‌కుల‌కు మెప్పించ‌టంతో ప్రేక్ష‌కుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ ద‌క్కుతోంది. కమర్షియల్ మాస్ సినిమాలకు ప్రేక్షకుల నుండి లభించే బలమైన ఆదరణతో వసూళ్లు మరింత పెరుగుతూ వస్తున్నాయి.

‘అమరన్’ వంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. ఇందులో ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా, ఇంద్రాన్స్, చైతు జొన్నలగడ్డ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలను పోషించారు. సాయి అభ్యంకర్ అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతం, ఆకట్టుకునే విజువల్స్, పాత్రలను ఎలివేట్ చేసిన విధానం ఈ చిత్రానికి మరింత బలంగా మారాయి.

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌టేక్ స్టూడియోస్ బ్యానర్లపై ధనుష్, శ్రద్ధా అగర్వాల్, అజ్మత్ జగ్మగ్ నిర్మించారు. వివిధ పరిశ్రమల నుంచి వచ్చే ఆసక్తికరమైన కంటెంట్ ఆధారిత చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ విజయవంతంగా దూసుకుపోతున్న ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే రూ.13 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘ఓం: చాప్టర్ 1 – రుధిరం’ తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.