మలయాళ సూపర్‌స్టార్స్, మమ్ముట్టి, మోహన్ లాల్ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘పేట్రియాట్’.. జూన్ 5 నుంచి జీ5లో స్ట్రీమింగ్
జీ5 లో మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘పేట్రియాట్’ జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ దర్శకుడు మహేష్ నారాయయణన్ తెరకెక్కించారు. 18 ఏళ్ల తర్వాత మలయాళ సినీ దిగ్గజాలు మమ్ముట్టి, మోహన్ లాల్ ఈ చిత్రంలో కలిసి నటించారు. నయనతార, ఫహాద్ ఫాజిల్, కున్‌చాకో బొబన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. పేట్రియాట్ మూవీ మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. గూఢచర్యం, రాజకీయాలు, టెక్నాలజీ, భావోద్వేగాలు, నాటకీయతలను కలిపి రూపొందించిన ఈ సినిమాలో అధికారం ఆధారంగా నడిచే వ్యవస్థలో నియంత్రణలేని నిఘా ఎంత ప్రమాదకరంగా మారుతుందో చూపించారు. కథలో ప్రధాన పాత్రధారి దేశ భద్రత కోసం ఒక అత్యాధునిక ప్రభుత్వ నిఘా…
