‘కొరియన్ కనకరాజు’ రెండు డైమెన్షన్స్ ఉన్న పాత్రలో నటించడం చాలా సంతృప్తినిచ్చింది: వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్, నవ్వులు పంచే వినోదంతో గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఎంటర్టైనింగ్ టీజర్, ట్రైలర్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన రెండు పాటల సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. 'కొరియన్ కనకరాజు' ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈరోజు (ఆగస్టు 6) రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేస్తున్నారు. ప్రీబుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. కొరియన్ కనకరాజు…
