Skip to content

కొరియన్ కనకరాజు’కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది : ప్రిన్స్ వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఆగస్టు 6న జరిగిన ప్రీమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 7న వరల్డ్ వైడ్ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. “నిన్న సాయంత్రం ప్రీమియర్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా అనిపించింది. మొదటి నుంచి ఈ సినిమాపై మాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన ప్రేక్షకుల నుంచి వచ్చింది. ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాలోని ప్రతి ఎపిసోడ్‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. సత్య కామెడీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. రానున్న రోజుల్లో సినిమా ఇంకా గొప్ప ముందుకు వెళ్తుంది. శిరీష్ గారు ఎడిటింగ్ దశలోనే సినిమా చూసి, ‘మీరు మంచి సినిమాతో వస్తున్నారు’ అని మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆయన నమ్మకం ఈరోజు నిజమైంది. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోవాలని ఈ సినిమా చేశాం. ఇప్పుడు థియేటర్లలో వాళ్లు అలా ఎంజాయ్ చేస్తుంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది. తమన్‌తో పాటు మా టెక్నికల్ టీమ్ మొత్తం ఒక కుటుంబంలా కలిసి పని చేసింది. బాబు పుట్టిన తర్వాత ఈ సక్సెస్ రావడం నాకు మరింత స్పెషల్‌గా అనిపిస్తోంది.

దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ: నాకు కావాల్సిన హిట్ ‘కొరియన్ కనకరాజు’గా వచ్చింది. మొదటి నుంచి వరుణ్ తేజ్ గారు ఈ సినిమాకు బ్యాక్‌బోన్‌లా నిలబడి ప్రతి విషయంలో అండగా ఉన్నారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ తర్వాత ప్రేక్షకులు థియేటర్లలో ఇంతగా నవ్వుతూ ఎంజాయ్ చేయడం మళ్లీ ఈ సినిమాతో చూడడం చాలా ఆనందంగా ఉంది. వరుణ్ తేజ్ గారి కటౌట్‌కు తగ్గ సినిమా ఇది. కనకరాజు, కొరియన్ పాత్రల్లో ఆయన అద్భుతంగా నటించారు. సత్యతో ఆయన కాంబినేషన్ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. రితిక కూడా తన పాత్రను చాలా చక్కగా చేసింది. నిర్మాత రాజీవ్ రెడ్డి గారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించడానికి ఎంతో కష్టపడ్డారు. శిరీష్ గారి సపోర్ట్‌కు కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన మాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది.

హీరోయిన్ రితిక నాయక్ మాట్లాడుతూ: తెలుగు ప్రేక్షకులు ఇస్తున్న ప్రేమ, ఆదరణకు చాలా ఆనందంగా ఉంది. ప్రీమియర్స్ సమయంలో థియేటర్‌లో ప్రేక్షకులు సినిమాను హిలేరియస్‌గా ఎంజాయ్ చేయడం చూసి చాలా సంతోషం వేసింది. వరుణ్ తేజ్ గారికి, సత్య గారికి, మా దర్శకుడు గాంధీ గారికి, నిర్మాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు. మేమంతా నమ్మి చేసిన ఒక మంచి ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఆదరిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

నిర్మాత శిరీష్ మాట్లాడుతూ: “‘కొరియన్ కనకరాజు’ టీమ్ మొత్తానికి అభినందనలు. నిన్నటి నుంచి ఈ సినిమా ప్రభంజనం మొదలైంది. ఇదే జోరు ముందుకూ కొనసాగుతుంది. వరుణ్ తేజ్ ప్రతి విజయంలోమేము భాగం కావడం చాలా ఆనందంగా ఉంది.

నిర్మాత రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ: “చాలా రోజుల తర్వాత మాకు ఒక పెద్ద విజయం దక్కింది. ‘గమ్యం’ సినిమా సమయంలో థియేటర్ల దగ్గర హౌస్‌ఫుల్ బోర్డులు చూసిన ఆనందం ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు’తో మళ్లీ కనిపిస్తోంది. థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.