Skip to content

‘కొరియన్ కనకరాజు’ వరుణ్ తేజ్ గారి పాత్రలోని వేరియేషన్స్ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తాయి: దర్శకుడు మేర్లపాక గాంధీ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్, నవ్వులు పంచే వినోదంతో గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఎంటర్‌టైనింగ్ టీజర్, ట్రైలర్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన రెండు పాటల సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ‘కొరియన్ కనకరాజు’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మేర్లపాక గాంధీ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

కొరియన్ కనకరాజు కథ ఎలా మొదలైంది?
-నేను కొంతమంది ఫ్రెండ్స్‌తో కలిసి అనంతపురం మీదుగా ఒక పెళ్లికి వెళ్లాను. రాత్రి సమయంలో కియా ఫ్యాక్టరీ దగ్గర ఆగాం. ఆ ప్రదేశం విజువల్‌గా చాలా బాగుంది. అక్కడ పని చేసే కొరియన్ల కోసం ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీ, వాళ్ల కల్చర్‌కు తగ్గ రెస్టారెంట్లు, మార్కెట్లు ఉన్నాయని తెలిసింది. అనంతపురం లాంటి చోట కొరియన్లు ఉండడం, వాళ్ల కోసం ప్రత్యేకమైన కల్చర్ ఏర్పడడం నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అప్పుడే అనంతపురాన్ని, కొరియాను కలిపే కథ ఏదైనా ఉంటే బాగుంటుందని అనిపించింది. ఆలోచిస్తుండగా ఒక కొరియన్ ఆత్మ అనంతపురం కుర్రాడిని ఆవహిస్తే ఎలా ఉంటుంది? అందులో నుంచి ఎలాంటి కామెడీ పుడుతుంది? అనే ఆలోచనతో ఈ కథను రాయడం మొదలుపెట్టాను.

ఈ కథను ముందుగా వరుణ్ తేజ్ కోసమే అనుకున్నారా?
-మొదట ఆయన కోసం మరో కథ అనుకున్నాను. అది చెప్పిన తర్వాత ఈ కొరియన్ పాయింట్ కూడా చెప్పాను. ఆయనకు బాగా నచ్చి దీన్ని డెవలప్ చేయమన్నారు. పూర్తి స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాత మళ్లీ వినిపించాను. ఆయనకు చాలా నచ్చింది. కొన్ని చిన్న చిన్న మార్పులు, మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు. అలా కలిసి ఈ కథను మరింత బాగా తీర్చిదిద్దాం.

-వరుణ్ తేజ్ గారు నాకు నటుడిగా చాలా ఇష్టం. కొత్త కాన్సెప్ట్స్ ట్రై చేస్తుంటారు. ఎప్పుడూ కొత్త ప్రయోగాలకు సిద్ధంగా ఉంటారు. ఈ కథలో కనకరాజు పాత్రతో పాటు కొరియన్ పాత్ర కూడా ఉంటుంది. ఈ రెండు షేడ్స్‌కు సరిపోయే నటుడు వరుణ్ తేజ్ అనిపించింది. ఆయన ఫిజిక్ కూడా ఈ పాత్రకు పర్ఫెక్ట్‌గా సరిపోయింది.

మీ సినిమాల మధ్య చాలా గ్యాప్ వస్తుంటుంది. కారణం?
-నేను ఒకేసారి చాలా కథల మీద పని చేస్తుంటాను. కొన్నిసార్లు కొంత దూరం వచ్చాక ఆ కథ నాకే నచ్చదు. అప్పుడు దాన్ని పక్కన పెట్టి మరో కథ మొదలుపెడతాను. అలాగే కథకు సరిపోయే నటులను వెతకడం, స్క్రిప్ట్‌ను పూర్తిగా సిద్ధం చేయడం వల్ల కూడా కొంత గ్యాప్ వస్తుంది.

మీ నాన్నగారు కూడా కథా రచయితే కదా. ఆయన కథతో సినిమా చేయొచ్చు కదా?
-నిజమే. మా నాన్నగారి కథతో సినిమా చేయాలనే ఆలోచన ఉంది. కానీ ఆయన టేస్ట్‌కు, నా టేస్ట్‌కు తేడా ఉంటుంది. ఆయనకు రొమాంటిక్ కథలు ఇష్టం. నాకు ఫన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ చేయడం ఇష్టం. కాకపోతే నాన్నగారి కథతో ఒక సినిమా చేయాలి.

రితిక పాత్ర గురించి చెప్పండి?
-ఈ సినిమాలో రీతిక కొరియన్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. ఆమెకు కొరియన్ కల్చర్ అంటే చాలా ఇష్టం. నిజానికి తనకి కొరియన్ భాష కూడా తెలుసు. ఆమె లుక్ కూడా ఆ కల్చర్‌కు బాగా మ్యాచ్ అవుతుంది. సినిమాలో ఆమెకు చాలా కొరియన్ డైలాగులు ఉన్నాయి. అందుకోసం కొరియా నుంచి ఒక ట్యూటర్‌ను తీసుకొచ్చి హీరో, హీరోయిన్ ఇద్దరికీ కొరియన్‌లో శిక్షణ ఇచ్చాం. అలాగే అనంతపురం యాస కోసం అక్కడి నుంచి కూడా ఒక ట్యూటర్‌ను తీసుకొచ్చాం.

మిగతా పాత్రల గురించి?
-ఇది పూర్తిగా ఫన్ ఎంటర్‌టైనర్. సత్య, మురళీధర్ గౌడ్, సునీల్ గారు… ఇలా ప్రతి పాత్ర కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. ఇందులో మాఫియా డాన్ ఉన్నా అది కూడా సీరియస్ ట్రీట్‌మెంట్‌లో కాదు. ఫన్‌తోనే నడుస్తుంది. ముఖ్యంగా కొరియన్ ఆత్మ ఆవహించిన తర్వాత హీరో కొరియన్‌లో మాట్లాడుతుంటే మిగతా వాళ్లకు ఏమీ అర్థం కాదు. అక్కడి నుంచే చాలా మంచి కామెడీ వస్తుంది.

కొరియాలో షూటింగ్‌కు పర్మిషన్స్ ఈజీగా వచ్చాయా?
-అంత ఈజీ కాదు. మేము అక్కడికి వెళ్లాలన్నా, వాళ్లు ఇక్కడికి రావాలన్నా వీసా ప్రాసెస్ చాలా కష్టమైంది. కొరియాలోని ఒక ఐలాండ్‌లో 20 రోజుల పాటు షూటింగ్ చేశాం. కథ అనుకున్నప్పుడే కొరియాలో షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. అక్కడ షూటింగ్ చాలా ఖరీదైనది. అందుకే పరిమితమైన క్రూతో వెళ్లి చిత్రీకరించాం. అలాగే కొంత భాగాన్ని కజకిస్థాన్‌లో కూడా షూట్ చేశాం.

-సినిమాలో ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి ఎమోషన్, హీరో-హీరోయిన్ మధ్య అందమైన లవ్ స్టోరీ కూడా ఉంటుంది.

దీనికి సీక్వెల్ ఆలోచన ఉందా?
-ఆలోచన అయితే ఉంది.

తమన్ మ్యూజిక్ గురించి?
-తమన్ గారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రీ-రికార్డింగ్ కూడా ఎక్స్‌ట్రా ఆర్డినరీగా ఉంటుంది.

-కచ్చితంగా ఈ సినిమాతో ప్రేక్షకులను నవ్వించి ఎంటర్‌టైన్ చేస్తామనే నమ్మకం ఉంది. నేను, వరుణ్ తేజ్ గారు ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎలాగైనా మంచి హిట్ ఇవ్వాలనే ప్యాషన్‌తో పనిచేశాం.

మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏది?
ప్రస్తుతం నా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కొరియన్ కనకరాజు’. (నవ్వుతూ)

ఏ హీరోతో పని చేయడం మీకు ఎక్కువ కంఫర్ట్‌గా ఉంటుంది?
-నేను ప్రతి హీరోతో స్క్రిప్ట్ స్టేజ్ నుంచే వాళ్లను ఇన్వాల్వ్ చేస్తాను. వాళ్ల సలహాలు, సూచనలు కూడా తీసుకుంటాను. అందుకే మొదటి నుంచే మంచి ఫ్రెండ్స్ అయిపోతాం. శర్వానంద్, నాని, వరుణ్ తేజ్ గారు… అందరితో నాకు మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది.

వరుణ్ తేజ్ గారితో ఈ సినిమా ఎలా మొదలైంది?
వరుణ్ తేజ్ గారు ఒక ఎంటర్‌టైనింగ్ జానర్ సినిమా చేయాలనుకుంటున్నారని నిర్మాత రాజీవ్ రెడ్డి గారి ద్వారా తెలిసింది. అప్పుడు ఈ కథను ఆయనకు చెప్పాను. యూవీ వంశీ గారు, రాజీవ్ రెడ్డి గారు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. కథ విన్న వెంటనే వరుణ్ తేజ్ గారు చాలా సర్‌ప్రైజ్ అయ్యారు. వెంటనే చాలా పాజిటివ్‌గా స్పందించారు.

వరుణ్ తేజ్ ఈ సినిమాలో ఎదుర్కొన్న ఛాలెంజ్ ఏమిటి?
-అనంతపురం యాస మాట్లాడటం, కొరియన్ భాష మాట్లాడటం… ఈ రెండూ ఆయనకు కొత్తే. ఆత్మ ఆవహించిన తర్వాత క్యారెక్టర్ బిహేవియర్ కూడా చాలా కొత్తగా వుంటుంది. నటుడిగా దాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని చాలా కష్టపడ్డారు. సినిమాలో కొరియన్, అనంతపురం కల్చర్‌ను మేళవించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

-అలాగే కొరియన్ డైలాగ్స్ విషయంలో కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. కొరియన్ మాట్లాడుతున్నప్పుడు ఒక లేయర్‌లో తెలుగు సబ్‌టైటిల్స్ వస్తుంటాయి.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
-ప్రస్తుతం ఓ కథపై పని చేస్తున్నాను. అది కూడా కామెడీ థ్రిల్లర్ జానర్‌లో ఉంటుంది. కామెడీ అనేది నాకు చాలా కంఫర్ట్‌గా అనిపించే జానర్.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.