Skip to content

‘ఇట్లు అర్జున’ నుంచి చిన్ని చిన్ని సాంగ్ రిలీజ్

స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా, అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్, ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే ఆసక్తి పెంచుకున్న ఈ సినిమా నుంచి తాజాగా రెండో సింగిల్ ‘చిన్ని చిన్ని’ను మేకర్స్ విడుదల చేశారు. ఎస్. థమన్ కంపోజ్ చేసి, ప్రోగ్రామ్ చేసి, అరేంజ్ చేసిన ఈ పాట ఫ్రెష్, మెలోడీయస్ రొమాంటిక్ నంబర్‌గా ఆకట్టుకుంటోంది. అకౌస్టిక్ సౌండ్స్‌కు ఎనర్జిటిక్ ఎలక్ట్రానిక్ బీట్స్‌ను జోడించిన థమన్.. ఎలక్ట్రిక్ మాండలిన్, రిథమ్ గిటార్స్, సాఫ్ట్ సింథ్స్‌తో పాటకు మంచి రిచ్ సౌండ్ తీసుకొచ్చారు. మోహిత్…

Read more

‘RaPo23’ కోసం 24 గంటలు పాటు ఏకధాటిగా షూట్ చేసిన రామ్ పోతినేని

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దర్శకుడిగా పరిచయం అవుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘RaPo23’ కోసం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ఈ సినిమా కోసం ఇటీవల పుదుచ్చేరి శివార్లలో రామ్ ఏకంగా 24 గంటల పాటు నిర్విరామంగా షూట్ చేశారు. విశేషం ఏమిటంటే రామ్ కేవలం డైరెక్టర్‌గా కెమెరా వెనుక ఉండటమే కాకుండా హీరోగా కూడా నటిస్తున్నారు. పుదుచ్చేరిలో ఈ సినిమా కోసం భారీ సెటప్ వేశారు. దాదాపు 9 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్‌లో రామ్ నటుడిగా తనపై ఉన్న బాధ్యతతో పాటు, దర్శకుడిగా సినిమా ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తూ శ్రమిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘RaPo23’ ప్రస్తుతం అందరిలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే అనూహ్యంగా కురిసిన వర్షాల కారణంగా…

Read more

‘పళ్ళ బురుసు’ పై ప్రశంసలు కురిపించిన ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్

అన్నపూర్ణ స్టూడియోస్ లేటెస్ట్ హిట్ ‘పళ్ళ బురుసు’. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మించిన ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించారు. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. తాజాగా బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ‘పళ్ళ బురుసు’ సినిమాను ప్రశంసిస్తూ తన రివ్యూను సోషల్ మీడియాలో పంచుకున్నారు. “బ్యూటిఫుల్ ఫిల్మ్. చాలా సింపుల్‌గా ఉంటుంది.. మీ ముఖంపై చిరునవ్వును అలాగే ఉంచుతుంది. ఒకదానికొకటి కాపీలా అనిపించే నాన్‌స్టాప్ యాక్షన్ సినిమాల నుంచి ఇది చాలా ఫ్రెష్‌గా అనిపించింది” అంటూ సినిమాపై…

Read more

‘ఇరుముడి’ మీకు తెగ నచ్చేస్తుంది: మాస్ మహారాజా రవితేజ

-మాస్ మహారాజా రవి తేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ 'ఇరుముడి' చిత్రం నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మల్లెపూల పల్లకి' సాంగ్ రిలీజ్- గూస్‌బంప్స్ తెప్పించేలా అదిరిపోయిన పాట మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆసక్తికరమైన గ్లింప్స్, మెలోడీతో పాటు ఎనర్జిటిక్ సాంగ్స్‌తో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. ‘ఇరుముడి’లోని భక్తి భావానికి మరింత ఎనర్జీని జోడిస్తూ మేకర్స్ మోస్ట్ అవైటెడ్ ‘మల్లెపూల పల్లకి’ పాటను…

Read more

అత్యంత ఘనంగా జరిగిన నిర్మాత బండ్ల గణేశ్‌ కుమార్తె జనని-సూర్యతేజ వివాహం

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహం సూర్యతేజతో అత్యంత ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో జరిగిన ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో పాటు సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి దంపతులు, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, నాగచైతన్య దంపతులు, గోపీచంద్, తేజ సజ్జ, కిరణ్ అబ్బవరం, శ్రీకాంత్, నటి జయప్రద, దర్శకులు కె రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీను వైట్ల, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, నిర్మాతలు అల్లు అరవింద్, నాగవంశీ, అనిల్ సుంకర, శిరీష్, సాహు గారపాటి తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను…

Read more

సుమంత్ మహేంద్రగిరి వారాహి చిత్రం నుంచి బ్రహ్మానందం డివైన్ గింప్స్ రిలీజ్

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే ఈ కథలో ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది. ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా మేకర్స్ బ్రహ్మానందం పాత్రని పరిచయం చేస్తూ పవర్ఫుల్ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. గ్లిమ్స్ లో బ్రహ్మానందం అమ్మవారిని ప్రార్థిస్తున్న భక్తుని పాత్రలో డివైన్ ఫుల్ గా కనిపించారు. అమ్మ వారాహి మా మహేంద్రగిరిని కాపాడు తల్లి…

Read more

‘ఫౌజీ’ ఇండిపెండెన్స్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

రెబెల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'ఫౌజీ' డిసెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హను రాఘవపుడి దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ ననిర్మాణంలో టి-సిరీస్ సమర్పిస్తున్న ఈ భారీ పీరియడ్ యాక్షన్ చిత్రానికి నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. టైటిల్ పోస్టర్ నుండి ప్రీ-లుక్, ఫస్ట్ లుక్ వరకు, ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. 'ఫౌజీ' చిత్ర నిర్మాతలు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బలమైన భావోద్వేగ, చారిత్రక నేపథ్యం ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. భారతదేశం నేడు జరుపుకుంటున్న స్వాతంత్ర్యం వెనుక ఉన్న త్యాగానికి నివాళిగా నిలిచిన ఈ పోస్టర్ అందరినీ కట్టిపడేసింది. స్వాతంత్ర్య దినోత్సవం…

Read more

సంబరాల ఏటిగట్టు 2027 జనవరి 12 సంక్రాంతికి రిలీజ్

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా చిత్రం సంబరాల ఏటిగట్టు (SYG) షూటింగ్ మొత్తం విజయవంతంగా పూర్తయింది. నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో, ప్రతిష్టాత్మక ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన యాక్షన్ డ్రామా, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశను వేగంగా పూర్తి చేసుకుంటోంది. 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ పండుగ విడుదల ప్రాజెక్ట్‌పై ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది. విడుదలైన పోస్టర్‌లో సాయి దుర్గ తేజ్ ఇంటెన్స్ రఫ్ అవతార్‌లో కనిపిస్తున్నారు. రక్తంతో, గాయాలతో నిండిన శరీరంతో, మంటల్లో చిక్కుకున్న ప్రదేశంలో, చేతిలో ఆయుధం…

Read more

‘డార్క్ చాక్లెట్’ సినిమా అద్భుతంగా వచ్చింది : హీరో విశ్వదేవ్ రాచకొండ

రానా దగ్గుబాటి ప్రెజెంట్స్, విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి, శశాంక్ శ్రీవాస్తవయ, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ & స్పిరిట్ మీడియా డార్క్ చాక్లెట్ నుంచి కల్లో కల్లోలం సాంగ్ లాంచ్ రానా దగ్గుబాటి, స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో కలిసి 'డార్క్ చాక్లెట్‌' చిత్రాన్ని ను సగర్వంగా అందిస్తున్నారు. విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. శశాంక్ శ్రీవాస్తవయ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ కల్లో కల్లోలం సాంగ్ లాంచ్ చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో విశ్వదేవ్ మాట్లాడుతూ. ‘కల్లో కల్లోలం’ పాట ఈ సినిమాలో చాలా ముఖ్యమైన సందర్భంలో వస్తుంది. ఈ సాంగ్ సినిమాకు…

Read more

శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 9న రిలీజ్

‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’తో అలరించబోతున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆసక్తికరమైన పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌తో పాటు రొమాన్స్, ఎమోషన్స్ తో రూపొందిస్తున్నారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మిస్తున్నారు. 1992లో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌తో పాటు తొలి రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దసరా పండుగకు…

Read more