ఏగన్, శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి…
మైసూరులో ‘దాదా’ షూటింగ్ పునః ప్రారంభించిన బాలకృష్ణ
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దాదా’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఎంట్రీ ఆఫ్ యాన్ ఎరా’ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. అనంతరం విడుదలైన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఈ సినిమాలో బాలకృష్ణ రగ్గడ్, స్టైలిష్, పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించనున్నారు. ఆయన లుక్, పాత్ర మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేశాయి
‘దాదా’ సినిమా షూటింగ్ నేటి నుంచి మైసూరులో పునఃప్రారంభమైంది. ఇటీవల గాయపడిన బాలకృష్ణ కోలుకుని తిరిగి షూటింగ్ సెట్స్‌లోకి అడుగుపెట్టారు. కీలకమైన, లెన్తీ షెడ్యూల్‌లో ఆయన చిత్రబృందంతో కలిసి పాల్గొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో ప్రధానంగా టాకీ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నారు. బాలకృష్ణతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్‌లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ తర్వాత మరోసారి వస్తున్న సినిమా కావడంతో దాదాపై భారీ అంచనాలు ఉన్నాయి. గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని స్టైలిష్ కమర్షియల్ యాక్షన్ స్పెక్టకిల్‌గా తెరకెక్కిస్తున్నారు. ‘ది కింగ్ ఆఫ్ కెయాస్’గా బాలకృష్ణను పరిచయం చేసిన టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పనిచేస్తోంది. అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాశారు. రామ్ లక్ష్మణ్, రవి వర్మ, వెంకట్ యాక్షన్ సీక్వెన్స్‌లను కొరియోగ్రఫీ చేస్తున్నారు.
‘దాదా’ డిసెంబర్ 24న థియేటర్లలోకి రానుంది. క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం భారీ స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అలరించేందుకు సిద్ధమవుతోంది.
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్, కాజల్ అగర్వాల్
రచన, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
బ్యానర్: వృద్ధి సినిమాస్
సంగీతం: ఎస్. థమన్
డీవోపీ: అరవింద్ ఎస్ కశ్యప్ ISC
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాశ్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, రవి వర్మ, వెంకట్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ & ట్రెండ్స్

