మైసూరులో ‘దాదా’ షూటింగ్ పునః ప్రారంభించిన బాలకృష్ణ
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దాదా’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఎంట్రీ ఆఫ్ యాన్ ఎరా’ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. అనంతరం విడుదలైన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఈ సినిమాలో బాలకృష్ణ రగ్గడ్, స్టైలిష్, పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించనున్నారు. ఆయన లుక్, పాత్ర మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేశాయి ‘దాదా’ సినిమా షూటింగ్ నేటి నుంచి మైసూరులో పునఃప్రారంభమైంది. ఇటీవల గాయపడిన బాలకృష్ణ కోలుకుని తిరిగి షూటింగ్ సెట్స్‌లోకి అడుగుపెట్టారు. కీలకమైన, లెన్తీ షెడ్యూల్‌లో…
