Skip to content

‘హనుమాన్ అంశ్’ తెలుగులో కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది: శోభినవ్ సత్య

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా, భక్తులు ప్రేమగా మహారాజ్-జీ అని పిలుచుకునే ఆయన జీవితం, బోధనల స్ఫూర్తితో రూపొందిన హనుమాన్ అంశ్ చిత్రం..ఈ ఏడాది డివైన్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. విశ్వాసం, భక్తి, ఆధ్యాత్మిక పరివర్తన వంటి అంశాలు అన్ని తరాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. డాక్టర్ విశాల్ చతుర్వేది రచన, దర్శకత్వంలో ‘హనుమాన్ అంశ్’ తెరకెక్కింది. నీమ్ కరోలి బాబా పాత్రలో శోభినవ్ సత్య నటించారు. చందన్ ఆనంద్, పూర్ణిమా తివారీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. హిందీలో విజయవంతమైన థియేట్రికల్ జర్నీ అనంతరం ఇప్పుడు ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హోంబలే ఫిల్మ్స్ తమ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సౌత్ ఇండియన్ భాషల థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుని.. ఈ చిత్రాన్ని దక్షిణాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. అక్టోబర్ 9న ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో హీరో శోభినవ్ సత్య మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. జై సీతారాం. విశాల్ గారు మన భారతీయ సంస్కృతికి చాలా కీలకమైన, ముఖ్యమైన సినిమాని తీశారు. ఆయన వల్లే ఈ సినిమా ఎక్కడ వరకు చేరింది. అలాగే రాగిణి గారు మాకు ఎంతగానో ప్రోత్సహించారు. నిజాయితీగా ఈ సినిమాని నిర్మించారు. హనుమంతుల వారి ఆశీర్వాదంతోనే ఈ సినిమా ఇంత గొప్ప విజయాన్ని అందుకుందని నమ్ముతున్నాము. ఇది భారతీయల సినిమా. ప్రజలందరూ తమ సినిమాగా ప్రమోట్ చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు. తెలుగులో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇక్కడ కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ అందుతుందని నమ్మకం ఉంది. ఇది ప్రతి ఒక్కరి మనసులో చేరాల్సిన సినిమా. అందరూ కూడా ఈ సినిమాని చూసి సినిమా గురించి అందరితో పంచుకుంటారని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ విశాల్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. జై సీతారాం. హైదరాబాద్ రావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు సినిమాని తెలుగులో విడుదల చేయాలని కోరుకున్నారు. ఇందులో హోంబలే ఫిలిమ్స్ భాగస్వామి అయినందుకు చాలా ఆనందంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సరే భారీ భారీ హనుమంతుల వారి విగ్రహాలు కనిపిస్తాయి. మనందరం కూడా బజరంగ్‌బలి భక్తులమే. హనుమంతుల వారు అన్నిచోట్ల ఉంటారు. జై హనుమాన్. మీరందరూ థియేటర్లలో ఆస్వాదించాలని కోరుకుంటున్నాను.

ప్రొడ్యూసర్ రాగిణి మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. హోంబలే ఫిల్మ్స్‌కి థాంక్యూ. ఇది నార్త్ ఇండియాలో ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో, ఇక్కడ కూడా అదే గొప్ప విజయాన్ని సాధిస్తుందని నమ్మకం ఉంది. ఇది అందరూ చూసే సినిమా. తప్పకుండా సినిమా చూసిన తర్వాత ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. హోంబలే ఫిల్మ్స్‌. కాంతార, మహావతార్ ఇలాంటి అద్భుతమైన సినిమాలు చేస్తోంది. వాళ్లందరికీ చాలా మంచి డివైన్ కనెక్షన్ ఉంది. ఇలాగే మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమాని మీరందరూ థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా హిందీలో ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. ఇందులో కథానాయకుడిగా చేసిన సత్య గారు అద్భుతంగా నటించారు. అందరూ కూడా ఆయన పెర్ఫార్మెన్స్‌ని ప్రశంసిస్తున్నారు. రాగిణి గారు చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ చేశారు. ఇది వారికి ఎంతో గర్వకారణం. అలాగే విశాల్ గారు అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించారు హనుమంతుడు ఉన్న ప్రతి సినిమా కూడా అద్భుతమైన విజయం సాధిస్తుంది. రెండు కోట్లు పెట్టి సినిమా తీస్తే 400 కోట్లు కలెక్ట్ చేసిందంటే మామూలు విషయం కాదు. ఇది ఆల్రెడీ బ్లాక్‌బస్టర్ అయ్యి మన దగ్గరికి వచ్చింది. ఈ సినిమా కూడా తెలుగులో చాలా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది. ఇలాంటి సినిమాలు వస్తే సొసైటీకి ఎంతో మంచి జరుగుతుంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఇచ్చిన హోంబలే ఫిల్మ్స్‌ కి థాంక్యూ. ఈ సినిమాలో పనిచేస్తున్న అందరికీ కూడా అభినందనలు. సెలవుల్లో వస్తున్న సినిమా ఇది. పిల్లలందరితో కలిసి సినిమా చూడండి. ఇది అందరూ తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన సినిమా.

మైత్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాని హిందీలో చూసిన ప్రేక్షకులు తెలుగులో ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూశారు. అందరూ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. మాకు ఈ అవకాశం ఇచ్చిన హోంబలే ఫిల్మ్స్‌ కి ధన్యవాదాలు. ‘హనుమాన్’ సినిమా మేమే రిలీజ్ చేశాము. అలాగే కాంతార’, ‘ఇరుముడి’.. ఇలా దైవ అనుగ్రహం ఉన్న సినిమాలన్నింటికీ కూడా ప్రేక్షకులు ఎంతో గొప్పగా ఆదరించారు. అక్టోబర్ 9న ఈ సినిమాని చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. సెలవుల్లో ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది. ఈ సినిమా నుంచి ఒక మంచి నీతిని ఇంటికి తీసుకెల్తారు. జై హనుమాన్. ఈ ప్రెస్ మీట్ లో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.