ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ కంటెంట్ తో సబ్ స్క్రైబర్స్ ను ఎంగేజ్ చేస్తోన్న ఆహా ఓటీటీ ఇప్పుడు…
విజయ్ దేవరకొండ “రణబాలి” ట్రైలర్ నేడు రిలీజ్
ఈ విజయదశమి సెలబ్రేషన్స్ ను మరింత ప్రత్యేకంగా మారుస్తూ ఈ నెల 16న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది విజయ్ దేవరకొండ “రణబాలి” సినిమా. రిలీజ్ కు దగ్గరవుతున్నా కొద్దీ ప్రమోషన్స్ ను ఇంటెన్స్ గా చేస్తున్నారు మూవీ టీమ్. సినిమా ప్రమోషన్ లో ఎంతో ఇంపార్టెంట్ గా భావించే ట్రైలర్ రేపు (ఈనెల 8వ తేదీన) సాయంత్రం 6.03 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. “రణబాలి” ట్రైలర్ ను 3 నిమిషాల 47 సెకన్ల నిడివితో సర్ ప్రైజింగ్ కంటెంట్ తో తీసుకురాబోతున్నారు. ఇలాంటి ప్రెస్టీజియస్ మూవీకి ఇంత లెంగ్తీ ట్రైలర్ కట్ చేయడం చూస్తుంటే సినిమా కంటెంట్ మీద, మూవీ సాధించబోయో సక్సెస్ మీద టీమ్ కు గట్టి నమ్మకం ఉన్నట్లు తెలుస్తోంది.
భారీ ట్రైలర్ రిలీజ్ చేస్తూ “రణబాలి” టీమ్ తమ కాన్ఫిడెంట్ ను, గట్స్ ప్రూవ్ చేసుకుంటున్నారు. రా, రూటెడ్, స్టోరీటెల్లింగ్ తో వస్తున్న ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలు మరింత పెంచబోతోంది. ఇప్పటికే డాక్యు సిరీస్ ద్వారా ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. సాంగ్స్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. విజయ్, రశ్మిక, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ చేస్తున్న కాంబో ఇంటర్వ్యూస్ సినిమాను ఆడియెన్స్ లోకి బాగా తీసుకెళ్లాయి. విజయ్, రశ్మిక ఫస్ట్ హిందీ పాడ్ కాస్ట్ వ్యూస్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇలా కంప్లీట్ పాజిటివ్ మోడ్ లో “రణబాలి” రిలీజ్ కు రెడీ అవుతోంది.

