‘హనుమాన్ అంశ్’ తెలుగులో కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది: శోభినవ్ సత్య
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా, భక్తులు ప్రేమగా మహారాజ్-జీ అని పిలుచుకునే ఆయన జీవితం, బోధనల స్ఫూర్తితో రూపొందిన హనుమాన్ అంశ్ చిత్రం..ఈ ఏడాది డివైన్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. విశ్వాసం, భక్తి, ఆధ్యాత్మిక పరివర్తన వంటి అంశాలు అన్ని తరాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. డాక్టర్ విశాల్ చతుర్వేది రచన, దర్శకత్వంలో ‘హనుమాన్ అంశ్’ తెరకెక్కింది. నీమ్ కరోలి బాబా పాత్రలో శోభినవ్ సత్య నటించారు. చందన్ ఆనంద్, పూర్ణిమా తివారీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. హిందీలో విజయవంతమైన థియేట్రికల్ జర్నీ అనంతరం ఇప్పుడు ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హోంబలే…
