Skip to content

‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అక్టోబర్ 9న విడుదల

హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బాబు డెగాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చవాన్, శ్రీధర్ చెని, దీపక్ ముస్త్యాల నిర్మించారు. రాజ్ సుహాస్, ప్రమదేశ్వి వి క్రియేటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. అక్టోబర్ 9 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ETV Winలో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ బ్యాచలర్ పార్టీ ఈవెంట్ నిర్వహించారు.

ప్రీ బ్యాచిలర్ పార్టీ ఈవెంట్‌లో వైవా హర్ష మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈటీవీ అంటే మనకి ఇంటితో సమానం. చిన్నప్పటి నుంచి మనం ఈటీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ చూస్తూనే పెరిగాము. నాలుగు నెలల్లో ఒక ప్రాజెక్ట్‌ను ఫినిష్ చేసి రిలీజ్ చేయడం అనేది ఒక కేస్ స్టడీ. షూటింగ్ అంతా చాలా కంఫర్టబుల్‌గా జరిగింది. ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి ఎమోషన్ కూడా ఉంది. చాలా గ్రాండ్‌గా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎక్కడా రాజీ పడకుండా ఈ వెబ్ సిరీస్ చేశాం. ఫస్ట్ రెండు ఎపిసోడ్లు ఫ్రీగా ఇస్తున్నాము. ఆ తర్వాత మీరు కచ్చితంగా సబ్‌స్క్రైబ్ చేసుకుని చూస్తారని నమ్మకం ఉంది. సందీప్‌కి థాంక్యూ. తనే ఈ టైటిల్‌ను సజెస్ట్ చేశాడు. అక్టోబర్ 9న ఈ సిరీస్ రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూడండి. త్వరలోనే సీజన్ 2 కూడా చేస్తాం.

ఈటీవీ సాయి కృష్ణ మాట్లాడుతూ.. సందీప్‌కి థాంక్యూ. ఈ టైటిల్ పెట్టింది తనే. చవాన్ ప్రొడ్యూస్ చేశారు. నాలుగు నెలల్లో పూర్తి చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సిరీస్‌లో ఈ క్యారెక్టర్ చేయడం అంత ఈజీ కాదు. హర్ష చాలా అద్భుతంగా చేశాడు. ఈ సినిమాలో నటించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది మంచి కామెడీ సిరీస్. అందరూ చూడాలని కోరుకుంటున్నాను. థాంక్యూ. అలాగే హర్షకి థాంక్యూ. అక్టోబర్ 9న ఈ సిరీస్ రిలీజ్ అవుతుంది. ఈటీవీ విన్ ఎంతోమంది కొత్త దర్శకులను, టెక్నీషియన్లను పరిచయం చేసింది. మా నుంచి పరిచయం అవుతున్న 20వ దర్శకుడు బాబు. ఈ సిరీస్ తర్వాత తనకి మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. సీజన్ 2 కూడా తీయాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ బాబు మాట్లాడుతూ.. అందరికీ థాంక్యూ సో మచ్. ముందుగా ఈటీవీ సాయి గారికి థాంక్యూ. ఈ జర్నీలో నాకు చాలా సపోర్ట్ చేశారు. ‘మంత్ అఫ్ మధు’ సినిమా చూసి హర్ష గారికి అభిమానిగా మారిపోయారు. ఆయన ఎక్కడా కూడా నటిస్తున్నట్టుగా కనిపించలేదు. అలాంటి నటుడు అయితే బాగుంటుందని అనుకున్నాను. ఆయన దగ్గరికి వెళ్లాను. ఆయన వెంటనే ఒప్పుకున్నారు. నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అలాగే ఆది ఎంత హెల్ప్ చేశాడో నాకు తెలుసు. ఇది ఈటీవీ విన్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా, అన్ని భాషల్లో వస్తుందని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. సాయి గారు నాకు చాలా హెల్ప్ చేశారు. నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసే వెబ్ సిరీస్ ఇది.

ప్రొడ్యూసర్ చవాన్ మాట్లాడుతూ..ఈటీవీ విన్ ఏది పట్టుకున్నా బంగారమే. ప్రతిదీ చాలా జాగ్రత్తగా, క్రియేటివ్‌గా చూసుకుంటారు. చాలా కష్టపడతారు. ఇందులో మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్స్ కూడా ఉన్నాయి. అందరూ చాలా సపోర్ట్ చేశారు. హర్ష, ఆది, ఐశ్వర్య అందరూ చాలా సపోర్ట్ చేశారు. సాయి గారికి థాంక్యూ. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అక్టోబర్ 9న ఈటీవీ విన్‌లో రిలీజ్ అవుతుంది. 8న శ్రీరాములులో ప్రీమియర్ కూడా వేస్తున్నాము. అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.

దీపక్ మాట్లాడుతూ.. ఈటీవీ విన్ వాళ్లు మాకు ఇచ్చిన పెద్ద అవకాశం ఇది. హర్ష గారు, హైపర్ ఆది గారు, జీవన్ ఈ సిరీస్ కలర్ మార్చేశారు. చాలా అద్భుతమైన ఎంటర్‌టైనర్‌గా వచ్చింది. అక్టోబర్ 9న ఈటీవీ విన్‌లో రిలీజ్ అవుతుంది. అందరూ చూడాలని కోరుకుంటున్నాను.

హైపర్ ఆది మాట్లాడుతూ.. ఇది చాలా మంచి ఎంటర్‌టైనర్. మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. వెబ్ సిరీస్ చాలా అద్భుతంగా వచ్చింది. డైరెక్టర్ తనకి కావాల్సిన పర్ఫార్మెన్స్ అందరితో చేయించుకున్నాడు. ఐశ్వర్య చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసింది. హర్ష చాలా మంచి ఎమోషన్ పండించారు. అదంతా మీరు ఈ సిరీస్‌లో చూడబోతున్నారు. మా ప్రొడ్యూసర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గకుండా అద్భుతంగా చేశారు. మంచి కంటెంట్‌కి కేరాఫ్ అడ్రస్ ఈటీవీ. అందరూ ఈ సిరీస్‌ను చూసి సూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను.

హీరోయిన్ ఐశ్వర్య మాట్లాడుతూ.. అక్టోబర్ 9న ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రిలీజ్ కాబోతోంది. ఇది చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. నేను ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో హీరోయిన్‌గా నటించడం చాలా మంచి అనుభూతి. మా డైరెక్టర్‌కి, ప్రొడ్యూసర్స్‌కి థాంక్యూ సో మచ్. అందరికీ థాంక్యూ. చాలా మంచి వెబ్ సిరీస్ ఇది. తప్పకుండా మీరందరూ ఎంజాయ్ చేస్తారు.

క్రియేటివ్ ప్రొడ్యూసర్ సుహాస్ మాట్లాడుతూ.. హర్ష గారు ఆది గారు చాలా హెల్ప్ చేశారు. స్క్రిప్ట్ విషయంలో ఇంకా ఇంప్రూవ్ చేశారు. అద్భుతంగా వచ్చింది. నటించిన నటీనటులకు, టెక్నీషియన్స్ అందరికీ థాంక్యూ. అక్టోబర్ 9న ఈటీవీ విన్‌లో తప్పకుండా ఈ సిరీస్ చూడాలని కోరుకుంటున్నాను. సరదాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి.

ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ.. ఈటీవీతో నాకు 20 ఏళ్ల అనుబంధం ఉంది. ఈ వెబ్ సిరీస్‌లో మంచి క్యారెక్టర్ చేశాను. ఇది ఎంటర్‌టైన్ చేస్తోంది. ఈ సిరీస్ కూడా అందరూ చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. హర్ష గారు, ఆది గారు అద్భుతంగా చేశారు. తప్పకుండా ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులందరినీ అలరిస్తుంది. ఈ వేడుకలో యూనిట్ అందరూ పాల్గొన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.