Skip to content

‘పళ్ళ బురుసు’ సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు: దర్శకుడు ఉదయ్ చౌహాన్

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న చిత్రం పళ్ళబురుసు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ‘పళ్ళ బురుసు’ ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఉదయ్ చౌహాన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీ నేపథ్యం గురించి చెప్పండి? ‘పళ్ళ బురుసు’ ఎలా మొదలైంది? మాది మహబూబ్‌నగర్ జిల్లా. అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. నాకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే చాలా ఇష్టం. ఇంట్లో డాక్టర్ చదవని చెప్పారు. కానీ సినిమాలపై…

Read more

‘కొరియన్ కనకరాజు’ మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు: మెగాస్టార్ చిరంజీవి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'కొరియన్ కనకరాజు'. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఆగస్టు 6న జరిగిన ఈ సినిమా ప్రీమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 7న వరల్డ్ వైడ్ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఒక సినిమా విజయం సాధిస్తే…

Read more

‘సెయాన్’ రెండవ షెడ్యూల్ ప్రారంభం

వెర్సటైల్ స్టార్ శివకార్తికేయన్, కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తున్న 'సెయాన్'' ప్రాజెక్ట్ కోసం దర్శకుడు శివకుమార్ మురుగేశన్‌తో చేతులు కలిపారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకున్న 'అమరన్' తర్వాత రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో శివకార్తికేయన్ చేస్తున్న చిత్రమిది. శివకార్తికేయన్ పుట్టినరోజున విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ రోజు రెండవ షెడ్యూల్ ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో శివకార్తికేయన్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని భారీ రూరల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఎమోషన్స్, మాస్ అప్పీల్,…

Read more

‘రంభ ఊర్వశి మేనక’ నాన్‌స్టాప్‌గా నవ్విస్తుంది: హీరో అల్లరి నరేష్

అల్లరి నరేష్, చంద్ర మోహన్ చింతడ, అన్నపూర్ణ స్టూడియోస్ & హాస్య మూవీస్ ‘రంభ ఊర్వశి మేనక’ ఫాంటసీ కామెడీతో కడుపుబ్బా నవ్వించే టీజర్ లాంచ్ కామెడీ సినిమాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ మరోసారి తనకు బాగా కలిసొచ్చిన జానర్‌లో సందడి చేయబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ‘నా కంటి మీద కనులే’ పాట సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్…

Read more

‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రిలీజ్ డేట్ పోస్టర్

సెప్టెంబర్ 18 నుంచి ఈవిన్ లో స్ట్రీమింగ్ హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బాబు డెగాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చవాన్, శ్రీధర్ చెని, దీపక్ ముస్త్యాల నిర్మించారు. రాజ్ సుహాస్, ప్రమదేశ్వి వి క్రియేటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. సెప్టెంబర్ 18 నుంచి నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ETV Winలో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ స్ట్రీమింగ్ కానుంది. ఈ డేట్ లాంచింగ్ పోస్టర్ ని స్టార్ బాయ్ సిద్దుజొన్నలగడ్డ లాంచ్ చేశారు. ఈ చిత్రంలో హైపర్ ఆది, జీవన్ కుమార్, ఐశ్వర్య హోలక్కల్, శ్రావ్య చౌదరి, శ్రీ విద్యా, మహేందర్, ప్రేమ్ సాగర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అజయ్…

Read more

‘ఓ మై డాగ్’ అందరూ సెలబ్రేట్ చేసుకునే సినిమా: డైరెక్టర్ శశికిరణ్ తిక్క

అమిత్ రాయ్ దర్శకత్వంలో పంకజ్ త్రిపాఠి, రాజేష్ కుమార్, గీతా అగర్వాల్ శర్మ, పవన్ మల్హోత్రా, శ్రీధర్ దూబే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ మై డాగ్’. రాజేష్ భరద్వాజ్, అమిత్ రాయ్, సనా వార్సీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7న విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని అభినందిస్తూ దర్శకుడు శశికిరణ్ తిక్క ముఖ్య అతిథిగా పాల్గొని విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్ లో దర్శకుడు అమిత్ రాయ్ మాట్లాడుతూ..“నేను హైదరాబాద్‌కు ఎన్నోసార్లు వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, దిల్ రాజు గారితో పాటు ఎంతోమందిని కలిశాను. కొన్ని ప్రాజెక్టులు కూడా…

Read more

‘పళ్ళ బురుసు’ సినిమా చూస్తున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాను: కింగ్ నాగార్జున

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న చిత్రం పళ్ళబురుసు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ‘పళ్ళ బురుసు’ ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు కింగ్ నాగర్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రెస్ మీట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ: “అందరికీ నమస్కారం. అన్నపూర్ణ స్టూడియోస్‌కు ఇది 50వ సంవత్సరం. నాన్నగారు ప్రారంభించిన ఈ సంస్థలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించాం. జాతీయ అవార్డులు…

Read more

‘ఐ యామ్ గేమ్’ నుంచి ఫస్ట్ సింగిల్ ఎవరే నువ్వే రిలీజ్

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఎవరే నువ్వే పేరుతో విడుదలైన ఈ పాటకు జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. అర్మాన్ మాలిక్ ఆలపించిన ఈ పాట తెలుగు వెర్షన్‌కు సనారే సాహిత్యం అందించారు. ఈ పాటను తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ పాటను విడుదల చేశారు. తమిళ వెర్షన్‌కు విఘ్నేష్ రామకృష్ణ, హిందీ వెర్షన్‌కు నుమాన్ ఖోకర్, కన్నడ వెర్షన్‌కు హృదయ శివ సాహిత్యం అందించారు. కన్నడ వెర్షన్‌ను అనిరుద్ధ్ సుస్వరం ఆలపించారు. విడుదలైన వెంటనే ‘మళవిల్లాయే’ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ పాట వైరల్‌గా మారింది…

Read more

‘హై’ నుంచి ఫస్ట్ సింగిల్ ఫనా రిలీజ్

హిట్ మేకర్ అనిల్ రావిపూడి అసోసియేట్, అతని అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సహ రచయితగా పని చేసిన ఎస్ కృష్ణ 'హై' అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నటుడు , సహ నిర్మాతగా కూడా పనిచేస్తున్నారు. ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్ పై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైనన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘హై’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఫనా’ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. వికాస్ బడిస…

Read more

‘స్లమ్ డాగ్’ నుంచి పవర్‌ఫుల్ ఆఫీసర్ గౌరీ హెగ్డేగా టబు గ్లింప్స్ రిలీజ్

డైనమిక్ ఫిల్మ్‌మేకర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి మొదటిసారిగా కలసి చేస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్'. రా ఎమోషన్స్, పవర్‌ఫుల్ యాక్షన్, మిస్టరీ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే టబు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన మేకర్స్.. తాజాగా ఆమె పాత్రకు సంబధించిన పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. నగరంలోని స్లమ్ ఏరియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ గ్లింప్స్.. అక్కడి రఫ్ అండ్ గ్రిటీ వాతావరణాన్ని పరిచయం చేస్తూ మొదలవుతుంది. ఆ తర్వాత కారు దిగుతూ, సిగరెట్ వెలిగించి, పరిస్థితులను తన కంట్రోల్‌లోకి తీసుకునే గౌరి హెగ్డేగా టబు ఎంట్రీ ఇచ్చారు. స్థానిక గూండాకు వార్నింగ్ ఇచ్చి, ఆ వెంటనే చెంపదెబ్బ…

Read more