Skip to content

‘గీతాంజలి’ సినిమా నవంబర్ 13న రీ-రిలీజ్‌

కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలై ఎన్నేళ్లు గడిచినా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తుంటాయి. అలాంటి ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో కింగ్ నాగార్జున ‘గీతాంజలి’ ఒకటి. ఇప్పుడు ఈ లవ్‌ఫుల్ క్లాసిక్ మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. నవంబర్ 13న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 4K వెర్షన్‌లో ‘గీతాంజలి’ గ్రాండ్‌గా రీ-రిలీజ్ కానుంది.

ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రం అద్భుతమైన కథనం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు, గొప్ప సంగీతంతో ప్రేక్షకులపై ప్రత్యేకమైన ముద్ర వేసింది. నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఈ సినిమా ప్రేమ, భావోద్వేగాలు, అందమైన అనుభూతులను ప్రత్యేకమైన శైలిలో ఆవిష్కరించింది.

ఇప్పటివరకు ‘గీతాంజలి’ని ప్రేమించిన ప్రేక్షకులకు ఈ 4K రీ-రిలీజ్ మరోసారి ఆ మధురానుభూతిని థియేటర్‌లో అందించనుంది. పిక్చర్ క్వాలిటీ, విజువల్ డీటెయిలింగ్‌తో సినిమా మరింత గ్రాండ్‌గా కనిపించనుంది. అదే సమయంలో ఒరిజినల్ సినిమా అందించిన ఎమోషన్, చార్మ్‌ను ఎలాంటి మార్పు లేకుండా ప్రేక్షకులకు అందించనున్నారు.

మాస్ట్రో ఇళయరాజా అందించిన సంగీతం ‘గీతాంజలి’కి ఇప్పటికీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఆయన స్వరపరిచిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎవర్ గ్రీన్.

బూర్లె శివ ప్రసాద్ నేతృత్వంలోని శ్రీ పద్మిని సినిమాస్ ఈ ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌ను మరోసారి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకొస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను ప్రేమించిన అభిమానులతో పాటు, కొత్త తరం ప్రేక్షకులకు కూడా ‘గీతాంజలి’ని బిగ్ స్క్రీన్‌పై ఎక్స్ పీరియన్స్ చేసే అవకాశం లభించనుంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.