Skip to content

‘సైరాబాను’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్

ఆది సాయికుమార్ మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘సైరాబాను’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. విభిన్నమైన ప్రేమకథ, ఆసక్తికరమైన పాత్రలు, వినోదంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. కృష్ణకాంత్ పరుచూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. “A Fun Filled Journey of Love, Faith & Destiny” అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మేకర్స్ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆది సాయికుమార్ సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకునే లుక్‌లో కనిపిస్తున్నారు. తెల్లటి సంప్రదాయ దుస్తులు ధరించి, నుదుటిపై విభూది, మెడలో…

Read more

‘ఇరుముడి’ సినిమా యూనివర్సల్‌గా కనెక్ట్ అవుతుంది: ప్రియా భవానీ శంకర్

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఇరుముడి'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్, ట్రైలర్, పాటలతో ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తించింది. ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎమోషన్స్, యాక్షన్‌తో కూడిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇరుముడిలో కావేరి పాత్ర ఎలా ఉండబోతుంది? -మీరు ట్రైలర్ చూస్తే కథ గురించి ఇప్పటికే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. కావేరి సింపుల్ ఫ్యామిలీ ఉమెన్. భర్త, కూతురు ఇద్దరే తన ప్రపంచం. ఫ్యామిలీని ఎంతో…

Read more

#VenkyAnil5 #NkrAR2 నుంచి విక్టరీ వెంకటేష్ ఫస్ట్ లుక్ రిలీజ్

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న #VenkyAnil5 #NKRAR2 భారీ వినోదాత్మక చిత్రంగా రూపుదిద్దుకుంటూ శరవేగంగా ముందుకు సాగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ పుట్టినరోజున విడుదల చేసిన ఆయన ఫస్ట్-లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఇండస్ట్రీలో వెంకటేష్ 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో వెంకటేష్ ఇండియన్ ఆర్మీ క్యామోఫ్లేజ్ యూనిఫామ్‌లో, సన్‌గ్లాసెస్, స్కార్ఫ్ ధరించి పవర్ ఫుల్ గా కనిపించారు. ఓ రగ్గడ్ SUV పక్కన నిల్చున్న…

Read more

‘జార్జ్ క్రిష్’ సినిమా గ్రాండ్ గా లాంచ్

'నారి నారి నడుమ మురారి', 'బైకర్' వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న 'చార్మింగ్ స్టార్' శర్వా, తొలిసారిగా దర్శకుడు శ్రీను వైట్లతో జతకట్టారు. ATV సమర్పణలో, అనిల్ సుంకర AK ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అజయ్ సుంకర సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు 'జార్జ్ క్రిష్' అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. ప్రత్యేకమైన డిజైన్‌తో వెంటనే దృష్టిని ఆకర్షించేలా ఉన్న కలర్ ఫుల్ పోస్టర్ ద్వారా చిత్ర బృందం టైటిల్, విడుదల తేదీని ప్రకటించింది. 'శతమానం భవతి', 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'నారి నారి నడుమ మురారి' వంటి చిత్రాలతో పండుగ సీజన్‌లో గుర్తుండిపోయే విజయాలను అందుకున్న శర్వాకు…

Read more

‘శనార్తి’ సినిమా గ్రాండ్ గా లాంచ్

బ్లాక్‌బస్టర్ దర్శకుడు సంపత్ నంది విజయవంతమైన నిర్మాణ సంస్థ సంపత్ నంది టీమ్‌వర్క్స్, శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ అధినేత, అభిరుచి గల నిర్మాత కె.వి. శ్రీధర్ రెడ్డితో కలిసి తన రెండవ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమవుతోంది. ప్రతిష్టాత్మక ఆదిత్య మూవీస్ బ్యానర్ సమర్పిస్తోంది. 'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అఖిల్ రాజ్, యంగ్ ట్యాలెంటెడ్ నాగ దుర్గ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ తెలంగాణ జానపద గీతాలలో తన ఉత్సాహభరితమైన నటనతో పేరుపొందిన నాగ దుర్గకు ఇది తెలుగులో తొలి సినిమా. సంపత్ నంది శిష్యుడైన రాజ్ గణేష్ ఉప్పునూతి ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి 'శనార్తి' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు…

Read more

‘నేను రెడీ’లో ఎంటర్‌టైన్‌మెంట్ అదిరిపోతుంది: హీరో హవీష్

హవీష్, కావ్య థాపర్ ‘నేను రెడీ’ నుంచి ఎనర్జిటిక్ సాంగ్ ‘మస్తుగుందిరా యవ్వారం’ లాంచ్ యంగ్ హీరో హవీష్ ‘నేను రెడీ’ ప్రమోషనల్ కంటెంట్‌తో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించే దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు మంచి స్పందన రాగా, నర్గీస్ ఫక్రీ ప్రత్యేక పాత్రలో కనిపించిన ఈ పాటలో హవీష్, కావ్య థాపర్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. అలాగే రెండో సింగిల్ ‘మెరుపులే మెరుపులే’…

Read more

‘ధర్మన్’ రెండవ షెడ్యూల్ ప్రారంభం

సూపర్ స్టార్ రజనీకాంత్ 'ధర్మన్' షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 'ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా మేకర్స్ రెండవ షెడ్యూల్ ప్రారంచారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో సూపర్ స్టార్ ప్రజెన్స్ అదిరిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ మధ్య ఉన్నంత స్నేహబంధం చాలా అరుదు. భారతీయ చలనచిత్ర రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ఈ ఇద్దరు దిగ్గజాలు, 'ధర్మన్' చిత్రం ద్వారా నిర్మాత-నటుడిగా మొదటిసారిగా కలిసి పనిచేస్తున్నారు. రాజ్ కమల్…

Read more

‘ఐ యామ్ గేమ్’ సెప్టెంబర్ 3న గ్రాండ్ వరల్డ్‌వైడ్ రిలీజ్

దుల్కర్ సల్మాన్‌ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఐ యామ్ గేమ్’ కొత్త విడుదల తేదీని ఖరారు చేశారు. తొలుత ఆగస్టు 20న ఓనం కానుకగా విడుదల చేయాలని ప్రకటించిన ఈ చిత్రం.. ఇప్పుడు రెండు వారాలు వాయిదా పడి సెప్టెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో విడుదల తేదీని మార్చినట్లు మేకర్స్ తెలిపారు. దుల్కర్ సల్మాన్‌ వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్‌కు నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్నారు. సజీర్ బాబా, ఇస్మాయిల్ అబూబకర్, బిలాల్ మొయిదు స్క్రీన్‌ప్లే అందించగా.. సజీర్ బాబా, ఆదర్శ్ సుకుమారన్, షబాస్…

Read more

‘ఇరుముడి’ మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది: మాస్ మహారాజా రవితేజ

-మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ, మైత్రీ మూవీ మేకర్స్ ‘ఇరుముడి’ ఎమోషన్స్ రోలర్ కోస్టర్ ట్రైలర్ లాంచ్ మాస్ మహారాజా రవి తేజ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఇరుముడి' చిత్రం ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో అంచనాలను పెరుగుతున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్ పాటలతో ఇప్పటికే చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు చిత్ర నిర్మాతలు తెలుగు, తమిళ భాషలలో విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌తో ఉత్సాహాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లారు. ట్రైలర్‌తో సినిమా కథలోని ప్రధాన అంశంపై స్పష్టత వచ్చింది. రవితేజ ఇందులో మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపించారు. భార్య, కూతురిని ఎంతో ప్రేమగా చూసుకునే…

Read more

‘సిగ్మా’ నుంచి ఓలమ్మో వగలాడి సాంగ్‌ రిలీజ్‌

లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్న 'సిగ్మా' సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దర్శకుడిగా జేసన్ సంజయ్ అరంగేట్రం చేస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ సిగ్మా స్టయిల్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఓలమ్మో వగలాడి సాంగ్ రిలీజ్ చేశారు. తమన్ ఎనర్జిటిక్ నెంబర్ ని కంపోజ్ చేశారు. యువన్ శంకర్ రాజా, సంజనా దివాకర్ కల్మంజే కలిసి ఆలపించిన ఈ పాట విన్నవెంటనే కనెక్ట్ అవుతుంది. కృష్ణ చైతన్య సాహిత్యం క్యాచిగా వుంది. ఈ పాటలో సందీప్ కిషన్, ఫారియా అబ్దుల్లా మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. ఇద్దరి మధ్య ఉన్న ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ పాటకు…

Read more